World Cup 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్‌కు అంపైర్లు వీళ్లే.. ఆ అంపైర్‌ను చూసిన భయపడుతున్న ఇండియన్ ఫ్యాన్స్.. ఇదీ కారణం
World Cup 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఐసీసీ అంపైర్లను అనౌన్స్ చేసింది. అయితే వీళ్లలో ఒక అంపైర్ ను చూసి ఇండియన్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇంతకీ ఎవరతను? ఎందుకా భయం?
World Cup 2023 Final: వరల్డ్ కప్ 2023లో ఇక కేవలం ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ ఆదివారం (నవంబర్ 19) ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగబోతోంది. దీంతో ఈ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్లను అనౌన్స్ చేసింది. రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నట్లు ఐసీసీ తెలిపింది.
అయితే వీళ్లలో అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోను చూసి ఇండియన్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. దీని వెనుక ఓ బలమైన కారణమే ఉంది. గత పదేళ్లలో టీమిండియా ఓడిన కీలకమైన మ్యాచ్ లలో ఈ కెటిల్‌బరోనే అంపైర్ గా ఉన్నాడు. కీలకమైన మ్యాచ్ లతోపాటు నాకౌట్ స్టేజ్ లలో ఇండియా ఆడినప్పుడు ఈ కెటిల్‌బరోనే ఉండటంతో ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అంపైర్లను ప్రకటించగా.. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఇండియా ఓడిపోయిన విషయం తెలుసు కదా. ఈ మ్యాచ్ లు అన్నింటిలోనూ ఈ కెటిల్‌బరోనే అంపైర్.
ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్లోనే అతడు అంపైరింగ్ చేయబోతున్నాడు. దీంతో టీమిండియా పరిస్థితి ఏమవుతుందో అన్న ఆందోళన మొదలైంది. ఆ కీలకమైన మ్యాచ్ లలో అతడు అంపైరింగ్ చేసిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. అతని వల్ల మరోసారి ఇండియన్ టీమ్ కు నష్టం జరగకూడదని వాళ్లు ఆకాంక్షిస్తున్నారు. క్రికెట్ ఓ గేమే అయినా.. అందులో ఇలాంటి విశ్వాసాలకు ప్రాధాన్యత చాలానే ఉంది.
ఈ అంపైర్ ఇంకా ఇండియాలోనే ఎందుకున్నాడు? ఇంగ్లండ్ టీమ్ తోపాటే వెళ్లిపోయి ఉంటే బాగుండేది అని ఓ అభిమాని ట్వీట్ చేయడం విశేషం. ఇక జై షా ఉన్నా కూడా ఇలాంటి అంపైర్ ను ఫైనల్ కు ఎలా నియమించారంటూ మరో యూజర్ సెటైర్ వేశారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం (నవంబర్ 19) ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వరల్డ్ కప్ కోసం ఇండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. 2003లోనూ ఈ రెండు టీమ్స్ తలపడగా.. ఆస్ట్రేలియా సులువుగా గెలిచి వరల్డ్ కప్ ఎగరేసుకుపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు అదే జట్టుతో ఫైనల్ ఆడుతుండటంతో ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.