Kettleborough | ఎండ తట్టుకోలేక మ్యాచ్‌ మధ్యలోనే వెళ్లిపోయిన అంపైర్‌-umpire kettleborough left the field after scorching heat made him sick ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kettleborough | ఎండ తట్టుకోలేక మ్యాచ్‌ మధ్యలోనే వెళ్లిపోయిన అంపైర్‌

Kettleborough | ఎండ తట్టుకోలేక మ్యాచ్‌ మధ్యలోనే వెళ్లిపోయిన అంపైర్‌

HT Telugu Desk HT Telugu
May 18, 2022 04:25 PM IST

సాధారణంగా వర్షం కారణంగా క్రికెట్‌ మ్యాచ్‌లు ఆగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఓ మ్యాచ్‌ కాసేపు ఆగిపోయింది.

<p>అంపైర్ వెళ్లిపోవడంతో నిలిచిపోయిన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్</p>
అంపైర్ వెళ్లిపోవడంతో నిలిచిపోయిన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్ (Twitter)

చట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ భానుడి ప్రతాపం వల్ల బుధవారం కాసేపు నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో అంపైరింగ్‌ చేస్తున్న రిచర్డ్‌ కెటిల్‌బరో ఎండ వేడిమి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యాడు. ఇక అంపైరింగ్‌ చేయడం తన వల్ల కాదంటూ బయటకు వెళ్లిపోయాడు. మ్యాచ్‌ 139వ ఓవర్‌ ముందు ఈ ఘటన జరిగింది.

కెటిల్‌బరో వెళ్లిపోవడంతో అతని స్థానంలో టీవీ అంపైర్‌గా ఉన్న జో విల్సన్‌ ఫీల్డ్‌లోకి వచ్చి అంపైరింగ్‌ చేయడం విశేషం. అంపైర్‌ మార్పు కారణంగా కాసేపు ఆట నిలిచిపోయింది. దీంతో ప్లేయర్స్‌ డ్రింక్స్‌ బ్రేక్‌ తీసుకున్నారు. వాళ్లు కూడా ఎండ ఎక్కువగా ఉండటంతో గ్రౌండ్‌లోనే రెండు భారీ గొడుగుల కింద నిల్చొని డ్రింక్స్‌ తీసుకున్నారు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 397 రన్స్‌ చేయగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ 3 వికెట్లకు 318 రన్స్‌ చేసింది. తమిమ్‌ ఇక్బాల్‌ సెంచరీ చేశాడు. 133 రన్స్‌ దగ్గర ఉన్న సమయంలో కాళ్లు తిమ్మిర్లు రావడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా క్రీజు వదిలి వెళ్లిపోయాడు. అటు మరో బంగ్లా బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ ఈ మ్యాచ్‌లోనే టెస్టుల్లో 5 వేల రన్స్‌ పూర్తి చేసుకున్నాడు. ఇది అతనికి 81వ టెస్ట్‌ మ్యాచ్‌.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్