Sourabh Netravalkar: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను వణికించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కమ్ క్రికెటర్ కథ ఇదే!
Sourabh Netravalkar: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి అమెరికా సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో అమెరికా విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ సౌరభ్ నేత్రవాల్కర్ స్టార్‌గా మారిపోయాడు. ఈ భారత సంతతి క్రికెటర్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తోన్నారు.
Sourabh Netravalkar: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి చరిత్రను తిరగరాసింది అమెరికా క్రికెట్ జట్టు. తాను ఆడుతోన్న తొలి వరల్డ్ కప్‌లోనే సంచలనాలను సృష్టించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అమెరికా క్రికెట్ టీమ్ అదరగొట్టింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌తో అమెరికా పేసర్ సౌరభ్ నేత్రవాల్కర్ హీరోగా మారిపోయాడు. ఈ భారత సంతతి క్రికెటర్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తోన్నారు.
నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు...
ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు సౌరభ్ నేత్రవాల్కర్. ఆ తర్వాత సూపర్ ఓవర్లోనూ పాకిస్థాన్‌ను అద్భుతంగా కట్టడిచేశాడు. సూపర్ ఓవర్లో ఓ వికెట్ తీశాడు. తన బౌలింగ్ తో అమెరికాకు చిరస్మరణీయ విజయం అందించాడు.
పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని సౌరభ్ అద్భుతంగా బౌలింగ్ చేయగా...పాకిస్థాన్ తరఫున సూపర్ ఓవర్ వేసిన మహ్మద్ అమీర్ ఏకంగా 18 రన్స్ ఇచ్చాడు. అందులో ఏడు ఎక్స్‌ట్రాలే ఉన్నాయి. ఇద్దరిని కంపేర్ చేస్తూ పాకిస్థాన్ జట్టును నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
టీమిండియా తరఫున అండర్ 19 వరల్డ్ కప్...
1991 అక్టోబర్ 16న ముంబయిలో జన్మించిన సౌరభ్ నేత్రవాల్కర్ టీమ్ ఇండియా తరఫున 2010లో అండర్ 19 వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయ్యాడు. . కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ అగర్వాల్‌లతో కలిసి వరల్డ్ కప్ ఆడాడు. ఈ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ తరఫున బాబర్ అజాం బరిలో దిగాడు.
అప్పుడు పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి అమెరికా జట్టు తరఫున పధ్నాలుగేళ్ల తర్వాత బాబర్ అజాంపై రివేంజ్ తీర్చుకున్నాడు సౌరభ్ నేత్రవాల్కర్. దేశవాళీలో ముంబయి జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు సౌరభ్ నేత్రవాల్కర్. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి పలు మ్యాచ్‌లు ఆడాడు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.
సాఫ్ట్వేర్ ఇంజినీర్...
అండర్ 19తో పాటు డొమెస్టిక్ క్రికెట్లో రాణించినా సౌరభ్‌కు జాతీయ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. క్రికెట్ కెరీర్‌పై ఆశలు వదులుకున్న సౌరభ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కార్నెల్ యూనివర్సీటి నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన సౌరభ్ చాలా కాలాంగా ఒరాకిల్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
అమెరికా టీమ్‌కు కెప్టెన్...
ఓ వైపు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూనే క్రికెట్‌పై ఫోకస్ పెట్టిన సౌరభ్ పలు అమెరికాలో పలు లీగ్ మ్యాచ్‌లు ఆడాడు. 2019లో అమెరికా నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ అయిన సౌరభ్ తన బౌలింగ్ టాలెంట్‌తో జట్టుకు కొద్ది కాలంలోనే కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. అమెరికాలో జరిగిన మేజర్ క్రికెట్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.
మంచి మ్యూజిషియన్ కూడా...
క్రికెటర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్గానే కాకుండా సౌరభ్ నేత్రవాల్కర్లో మంచి మ్యూజిషియన్ ఉన్నాడు. గిటార్‌ను పోలి ఉంటే ఉకులేలే అనే సంగీత వాయిద్యంలో అతడికి ప్రావీణ్యం ఉంది. ఉకులేలేను వాయిస్తూ ఓం నమః శివాయ అంటూ సౌరభ్ నేత్రవాల్కర్ పాడిన అమెరికా, పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత ట్రెండింగ్‌గా మారింది. ప్రొఫెషనల్ మ్యూజిషియన్, సింగర్‌ను తలపిస్తూ తన గాత్రంతో అదరగొట్టాడు సౌరభ్ నేత్రవాల్కర్. ఈ వీడియోను పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
పాకిస్థాన్‌పై ట్రోల్స్
కాగా ఈ మ్యాచ్‌లో అమెరికా పేస్ బౌలింగ్ ధాటికి పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేయడానికి అష్టకష్టాలు పడ్డారు. కెప్టెన్ బాబర్ అజాం 43 బాల్స్‌లో 44 రన్స్‌తో టెస్ట్ మ్యాచ్ తలపించేలా బ్యాటింగ్ చేయడంపై దారుణంగా విమర్శలొస్తున్నాయి.