Team India: పన్నెండేళ్లు టీమిండియాకు ఓపెనర్ - అయినా ఒక్క సెంచరీ చేయని క్రికెటర్ ఎవరంటే?
Team India: టీమిండియా టెస్ట్ జట్టులో పన్నెండేళ్ల పాటు ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ చేసిన ఓ క్రికెటర్ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఆ క్రికెటర్ ఎవరంటే?
Team India: చేతన్ చౌహాన్ 1970-80 దశకంలో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ క్రికెటర్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. ఫస్ట్ క్రికెట్‌లో 179 మ్యాచుల్లోనే 11 వేల పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ క్రికెటర్ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 21 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడి అత్యధిక స్కోరు 405 పరుగులు కావడం గమనార్హం.
ఒక్క సెంచరీ లేదు...
కానీ టీమిండియా తరఫున పన్నెండేళ్ల పాటు సునీల్ గవాస్కర్ తో కలిసి ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ చేసిన చేతన్ చౌహాన్ ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోవడం గమనార్హం. 1969 సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా చేతన్ చౌహన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన చివరి టెస్ట్‌ను 1981 మార్చిలో న్యూజిలాండ్‌పైనే ఆడాడు. పన్నెండేళ్ల కెరీర్‌లో కేవలం 40 టెస్ట్‌లు మాత్రమే ఆడిన చేతన్ చౌహాన్ 2084 పరుగులు చేశాడు. ఈ నలభై మ్యాచుల్లో ఓపెనింగ్ స్థానంలోనే చేతన్ చౌహాన్ బరిలో దిగాడు. ఓపెనర్‌గా బరిలో దిగి టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు.
97 పరుగులు...
చేతన్ చౌహాన్ అత్యధిక స్కోరు 97 మాత్రమే. పలుమార్లు 90ల్లోనే ఔటయ్యాడు. సెంచరీ చేయాలనే కల తీరకుండానే క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియా తరఫున 12 ఏళ్ల పాటు ఆడి ఒక్క సెంచరీ కూడా చేయని బ్యాట్స్‌మెన్‌గా చేతన్ చౌహాన్ నిలిచాడు. టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకోవడంతో వన్డేల్లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం ఏడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడిన చేతన్ చౌహాన్ 153 పరుగులు మాత్రమే చేశాడు. 2020లో కొవిడ్ కారణంగా చేతన్ చౌహాన్ కన్నుమూశాడు.
మిస్బాఉల్ హాక్...
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బాఉల్ హక్ కూడా 161 వన్డేల్లో 5122 పరుగులు చేశాడు. పదమూడేళ్ల పాటు పాకిస్థాన్ వన్డే జట్టులో కొనసాగిన మిస్పాఉల్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. టెస్టుల్లో మాత్రం మిస్బాఉల్ హక్ పది సెంచరీలు చేయడం గమనార్హం.
49 హయ్యెస్ట్...
టీమిండియా బౌలర్ హర్భజన్ సింగ్ టెస్టుల్లో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ 236 వన్డేలు ఆడిన హర్భజన్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. వన్డేల్లో అతడి హయ్యెస్ట్ స్కోరు 49 పరుగులు. హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు.236 వన్డేల్లో 1237 రన్స్ చేశాడు హర్భజన్. టీమిండియా తరఫున 103 టెస్ట్‌లు ఆడిన హర్భజ్ 2224 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
టాపిక్