Team India Orange Kit: ఆరెంజ్ ఆర్మీగా మారిపోయిన మెన్ ఇన్ బ్లూ.. టీమిండియా కొత్త ట్రైనింగ్ కిట్ చూశారా?-team india in orange kit ahead of their first world cup 2023 match against australia ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India Orange Kit: ఆరెంజ్ ఆర్మీగా మారిపోయిన మెన్ ఇన్ బ్లూ.. టీమిండియా కొత్త ట్రైనింగ్ కిట్ చూశారా?

Team India Orange Kit: ఆరెంజ్ ఆర్మీగా మారిపోయిన మెన్ ఇన్ బ్లూ.. టీమిండియా కొత్త ట్రైనింగ్ కిట్ చూశారా?

Hari Prasad S HT Telugu
Oct 05, 2023 04:43 PM IST

Team India Orange Kit: ఆరెంజ్ ఆర్మీగా మారిపోయారు మెన్ ఇన్ బ్లూ. వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ కు ముందు టీమిండియా కొత్త ట్రైనింగ్ కిట్ లో కనిపించారు.

ఆరెంజ్ కలర్ ట్రైనింగ్ కిట్ లో టీమిండియా సభ్యులు
ఆరెంజ్ కలర్ ట్రైనింగ్ కిట్ లో టీమిండియా సభ్యులు

Team India Orange Kit: టీమిండియాను ఇన్నాళ్లూ మెన్ ఇన్ బ్లూగానే పిలిచారు. కానీ మన మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీగా మారిపోయింది. ఆస్ట్రేలియాతో ఆదివారం (అక్టోబర్ 8) తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడటానికి ముందు ఇండియన్ టీమ్ కొత్త ట్రైనింగ్ కిట్ ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. ఇందులో ప్లేయర్స్ ఆరెంజ్ జెర్సీల్లో ప్రాక్టీస్ చేయడం చూడొచ్చు.

వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నైలో ఇండియా తలపడనుంది. నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ టీమ్ జెర్సీల్లాగే ఇండియన్ టీమ్ ట్రైనింగ్ కిట్ ఉండటం విశేషం. అటు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఇండియన్ టీమ్ ట్రైనింగ్ కిట్ ఆరెంజ్ కలర్ లోకి మారిపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

గతంలో రెడ్, గ్రేలాంటి రంగులను ట్రైనింగ్ కిట్ల కోసం ఉపయోగించారు. కానీ పదేళ్లుగా అయితే ట్రైనింగ్ కిట్ కూడా బ్లూ కలర్ లోనే ఉంటూ వస్తోంది. ఇప్పుడీ కొత్త రంగుల్లో ఇండియన్ టీమ్ సభ్యులు భిన్నంగా కనిపిస్తున్నారు. 2019 వరల్డ్ కప్ సందర్భంగా ఐసీసీ జట్లకు హోమ్, అవే కిట్లు వేర్వేరుగా ఉండాలన్న నిబంధన విధించింది. దీంతో అప్పట్లో టీమిండియా కాషాయం షేడ్ లో ఉన్న టీషర్ట్, నేవీ బ్లూ ప్యాంట్లలో కనిపించింది.

వరల్డ్ కప్ కోసం మ్యాచ్ జెర్సీలను బ్లూ షేడ్ లోనే అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ తయారు చేసింది. అయితే ట్రైనింగ్ కిట్ ను మాత్రం ఇలా ఆరెంజ్ కలర్ లో రూపొందించింది. భుజాలపై తెల్లటి చారలు మాత్రం అలాగే ఉన్నాయి. అడిడాస్ వచ్చినప్పటి నుంచీ నల్లటి ట్రైనింగ్ కిట్ ఉండేది. అయితే నల్ల రంగు వేడిని ఎక్కవగా శోషించుకుంటుంది. అందుకే కిట్ రంగు మార్చినట్లు తెలుస్తోంది.

ఇక వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ లు రెండూ వర్షార్పణం అయిన తర్వాత తొలి మ్యాచ్ కోసం ఇండియన్ టీమ్ బుధవారం (అక్టోబర్ 4) చెన్నై చేరింది. గురువారం మధ్యాహ్నం ఈ కొత్త ట్రైనింగ్ కిట్ లో టీమ్ తొలిసారి ప్రాక్టీస్ చేసింది. ఈ ఫొటోను ఇండియన్ క్రికెట్ టీమ్ తన అధికారిక వాట్సాప్ ఛానెల్లో షేర్ చేసింది.

Whats_app_banner