Riyan Parag Memes: క్రికెటర్ రియాన్ పరాగ్ మనసుపడిన హీరోయిన్‌తో ఓపెనర్ శుభమన్ గిల్ రొమాంటిక్ యాడ్.. మీమ్స్ మోత-team india all rounder riyan parag memes break the internet after shubman gill ananya panday come together for an ad ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Riyan Parag Memes: క్రికెటర్ రియాన్ పరాగ్ మనసుపడిన హీరోయిన్‌తో ఓపెనర్ శుభమన్ గిల్ రొమాంటిక్ యాడ్.. మీమ్స్ మోత

Riyan Parag Memes: క్రికెటర్ రియాన్ పరాగ్ మనసుపడిన హీరోయిన్‌తో ఓపెనర్ శుభమన్ గిల్ రొమాంటిక్ యాడ్.. మీమ్స్ మోత

Galeti Rajendra HT Telugu
Sep 05, 2024 11:37 AM IST

Ananya Panday: బాలీవుడ్ హీరోయిన్స్ అనన్య పాండే, సారా అలీ ఖాన్ హాట్ వీడియోలను యూట్యూబ్‌లో సెర్చ్ చేసి దొరికిపోయిన టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు.

రియాన్ పరాగ్, శుభమన్ గిల్, అనన్య పాండే
రియాన్ పరాగ్, శుభమన్ గిల్, అనన్య పాండే

Shubman Gill Ananya Panday Ad: భారత యంగ్ క్రికెటర్ రియాన్ పరాగ్‌పై మళ్లీ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రియాన్ పరాగ్‌ ఇటీవల యూట్యూబ్‌లో బాలీవుడ్ హీరోయిన్స్ అనన్య పాండే హాట్, సారా అలీ ఖాన్ హాట్ అని వీడియోలు సెర్చ్ చేసి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.

రియాన్ పరాగ్ యూట్యూబ్ సెర్చింగ్ హిస్టరీ మొత్తం బయటికి వచ్చేసింది. తాజాగా రియాన్ పరాగ్ మనసుపడిన హీరోయిన్ అనన్య పాండేతో ఒక రొమాంటిక్ యాడ్‌లో ఓపెనర్ శుభమన్ గిల్ నటించడంతో మళ్లీ అతనిపై ట్రోలింగ్ మొదలైంది. ఇప్పటికే సారా అలీ ఖాన్‌తోనూ శుభమన్ గిల్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ బీట్స్ తన కొత్త ఉత్పత్తులైన బీట్స్ సోలో బడ్స్, బీట్స్ సోలో 4, బీట్స్ పిల్‌లను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ యాడ్‌లో యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్, అనన్య పాండే యాక్ట్ చేశారు. బీట్స్ తమ ప్రొడెక్ట్స్ గురించి ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ఇద్దరూ యాడ్ షూట్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో పరాగ్‌ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.

ట్రెండ్‌లోకి వచ్చిన రియాన్

ఈ ఏడాది భారత టీ20 జట్టులో మెరిసిన రియాన్ పరాగ్.. ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా రాజస్థాన్‌ రాయల్స్ టీమ్‌కి ఆడుతున్నాడు. అతను క్రికెట్ ఆడటంతో పాటు పార్ట్ టైమ్ గేమర్ కూడా అప్పుడప్పుడు తన గేమింగ్ యాక్టివిటీస్‌ను ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ చేస్తుంటాడు. అతని యూట్యూబ్ ఛానల్‌కి 65,000 మంది సబ్ స్క్రైబర్లు కూడా ఉన్నారు.

ఇటీవల ఒక స్ట్రీమింగ్ షోలో పొరపాటున తన యూట్యూబ్ సెర్చ్ హిస్టరీని రియాన్ పరాగ్ షేర్ చేసేశాడు. అందులో అనన్య పాండే హాట్, సారా అలీ ఖాన్ హాట్ వీడియోలను అతను సెర్చ్ చేసినట్లు గుర్తించిన ఒక నెటిజన్.. స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయిపోయింది. దాంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో రియాన్ పరాగ్‌ని మీమ్స్, ట్రోల్స్‌తో ఆడుకున్నారు. ఇప్పుడు మళ్లీ గిల్, అనన్య కలిసి యాడ్‌లో నటించడంతో మళ్లీ రియాన్ ట్రెండింగ్‌లోకి వచ్చాడు.

దులీప్ కోసం సిద్ధమవుతున్న రియాన్

ఈ ఏడాది ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్ నిలకడగా రాణించాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 151.60 స్ట్రైక్ రేట్‌తో 567 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

రియాన్ పరాగ్ బ్యాటింగ్ ప్రదర్శనతో భారత సెలెక్టర్ల నుంచి కూడా అతనికి పిలుపు వచ్చింది. జింబాబ్వే, శ్రీలంకతో సిరీస్‌ల్లో అతను ఆడాడు. బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న సిరీస్ కోసం భారత్ జట్టుని త్వరలోనే సెలెక్టర్లు ఎంపిక చేయనుండటంతో ఈరోజు నుంచి జరుగుతున్న దులీప్ ట్రోఫీలో సత్తాచాటాలని రియాన్ పరాగ్ ఉవ్విళ్లూరుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తూ ఈ యంగ్ క్రికెటర్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు.

ట్రెండ్‌లోకి వచ్చిన రియాన్

ఈ ఏడాది భారత టీ20 జట్టులో మెరిసిన రియాన్ పరాగ్.. ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా రాజస్థాన్‌ రాయల్స్ టీమ్‌కి ఆడుతున్నాడు. అతను క్రికెట్ ఆడటంతో పాటు పార్ట్ టైమ్ గేమర్ కూడా అప్పుడప్పుడు తన గేమింగ్ యాక్టివిటీస్‌ను ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ చేస్తుంటాడు. అతని యూట్యూబ్ ఛానల్‌కి 65,000 మంది సబ్ స్క్రైబర్లు కూడా ఉన్నారు. అయితే ఇటీవల ఒక స్ట్రీమింగ్ షోలో పొరపాటున తన యూట్యూబ్ సెర్చ్ హిస్టరీని రియాన్ పరాగ్ షేర్ చేసేశాడు. అందులో అనన్య పాండే హాట్, సారా అలీ ఖాన్ హాట్ వీడియోలను అతను సెర్చ్ చేసినట్లు గుర్తించిన ఒక నెటిజన్.. స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయిపోయింది. దాంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో రియాన్ పరాగ్‌ని మీమ్స్, ట్రోల్స్‌తో ఆడుకున్నారు. ఇప్పుడు మళ్లీ గిల్, అనన్య కలిసి యాడ్‌లో నటించడంతో మళ్లీ రియాన్ ట్రెండింగ్‌లోకి వచ్చాడు.

దులీప్ కోసం సిద్ధమవుతున్న రియాన్

ఈ ఏడాది ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్ నిలకడగా రాణించాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 151.60 స్ట్రైక్ రేట్‌తో 567 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

రియాన్ పరాగ్ బ్యాటింగ్ ప్రదర్శనతో భారత సెలెక్టర్ల నుంచి కూడా అతనికి పిలుపు వచ్చింది. జింబాబ్వే, శ్రీలంక సిరీస్‌లో అతను ఆడాడు. బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న సిరీస్ కోసం భారత్ జట్టుని త్వరలోనే సెలెక్టర్లు ఎంపిక చేయనుండటంతో ఈరోజు నుంచి జరుగుతున్న దులీప్ ట్రోఫీలో సత్తాచాటాలని రియాన్ పరాగ్ ఉవ్విళ్లూరుతున్నాడు.