Shubman Gill: శుభ్‌మన్ చాలా క్యూట్‌గా ఉంటాడు.. టీమిండియా క్రికెటర్‌పై మనసు పారేసుకున్న బ్యూటీ.. సారాకు పోటీగా వస్తుందా?-tv actor ridhima pandit says shubman gill looks cute reacted to dating rumors ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shubman Gill: శుభ్‌మన్ చాలా క్యూట్‌గా ఉంటాడు.. టీమిండియా క్రికెటర్‌పై మనసు పారేసుకున్న బ్యూటీ.. సారాకు పోటీగా వస్తుందా?

Shubman Gill: శుభ్‌మన్ చాలా క్యూట్‌గా ఉంటాడు.. టీమిండియా క్రికెటర్‌పై మనసు పారేసుకున్న బ్యూటీ.. సారాకు పోటీగా వస్తుందా?

Hari Prasad S HT Telugu

Shubman Gill: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చాలా క్యూట్ గా ఉంటాడట. అతనిపై మనసు పారేసుకుంది ఓ టీవీ నటి. దీంతో మా సారాకు పోటీగా వస్తున్నావా అంటూ ఫ్యాన్స్ ఆమెను ఆటపట్టిస్తున్నారు.

శుభ్‌మన్ చాలా క్యూట్‌గా ఉంటాడు.. టీమిండియా క్రికెటర్‌పై మనసు పారేసుకున్న బ్యూటీ.. సారాకు పోటీగా వస్తుందా?

Shubman Gill: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పై మరో బ్యూటీ మనసు పారేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అతన్ని ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి కూడా చేసుకోనుందన్న పుకార్లు రావడంతో సదరు నటి స్పందించింది. అతడు చాలా క్యూట్ గా ఉంటాడు కానీ.. అలాంటిదేమీ జరగడం లేదని ఆమె చెప్పడం విశేషం. ఆ నటి పేరు రిద్ధిమా పండిట్.

శుభ్‌మన్ గిల్‌, రిద్ధిమా డేటింగ్

క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఇప్పటికే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలుసు కదా. ఇప్పుడామె తర్వాత మరో టీవీ నటి పేరు తెరపైకి వచ్చింది. ఆ నటి పేరు రిద్ధిమా పండిట్. డేటింగ్ కాదు ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి కూడా చేసుకుంటున్నారని వార్తలు వస్తుండటంతో తాజాగా ఫిల్మీజ్ఞాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది.

"అలాంటిదేమీ లేదు (శుభ్‌మన్ తో డేటింగ్ పై). ముందుగా అతను కనీసం నాకు తెలియదు. అతడు మంచి స్పోర్ట్స్ పర్సన్ కానీ వ్యక్తిగతంగా అతడు నాకు తెలియదు. నేను ఎప్పుడైనా అతన్ని కలిస్తే.. మేమిద్దరం దీనిపై బాగా నవ్వుకుంటాం. అతడు చాలా చాలా క్యూట్ గా ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగడం లేదు" అని రిద్ధిమా చెప్పడం విశేషం.

పెళ్లి పుకార్లపై..

నిజానికి గత మే నెలలోనే శుభ్‌మన్ తో పెళ్లిపై రిద్ధిమా స్పందించింది. డిసెంబర్లో పెళ్లి అని అప్పట్లోనే వార్తలు రావడంతో ఆమె వివరణ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. "నా పెళ్లి గురించిన ప్రశ్నలతో చాలా మంది జర్నలిస్టుల ఫోన్ కాల్స్ తో నేను నిద్ర లేచాను. కానీ ఎవరి పెళ్లి? నేను పెళ్లి చేసుకోవడం లేదు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే నేను కచ్చితంగా చెబుతాను. ఈ వార్తల్లో నిజం లేదు" అని రిద్ధిమా చెప్పింది.

అటు శుభ్‌మన్ మాత్రం ఈ పెళ్లి వార్తలపై ఇప్పటి వరకూ స్పందించలేదు. నిజానికి గతంలో సారా టెండూల్కర్ డేటింగ్ వార్తలపైనా అతడు ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఆ మధ్య గిల్ ఎక్కడ ఆడినా.. సారా పేరుతో అభిమానులు అతన్ని ఆట పట్టించేవారు. ఆ పుకార్లు అలా ఉండగానే ఇప్పుడు మరో నటితో ప్రేమ, పెళ్లి అనే వార్తలు రావడం విశేషం. ఈ మధ్యే అతడు జింబాబ్వే పర్యటనలో టీమిండియా కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను ఇండియా 4-1తో గెలిచింది.

ఎవరీ రిద్ధిమా పండిట్?

రిద్ధిమా పండిట్ ఓ టీవీ నటి. బహు హమారీ రజనీకాంత్, ఖత్రా ఖత్రా ఖత్రాలాంటి షోలతో పాపులర్ అయింది. 2021లో వచ్చిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లోనూ కనిపించింది. 2019లో ఆమె ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోంకే ఖిలాడీ 9లోనూ పార్టిసిపేట్ చేసింది. రెండో రన్నరప్ గా నిలిచింది. హమ్ అనే వెబ్ సిరీస్ లోనూ రిద్దిమా నటించింది.