T20 World Cup 2024 Team: టీ20 వరల్డ్ కప్ 2024.. టీమిండియాలో ఈ 8 స్థానాలు కన్ఫమ్.. ఆ ఏడు ఖాళీ-t20 world cup 2024 team these 8 slots are confirm in team india 7 places still need to be filled ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup 2024 Team: టీ20 వరల్డ్ కప్ 2024.. టీమిండియాలో ఈ 8 స్థానాలు కన్ఫమ్.. ఆ ఏడు ఖాళీ

T20 World Cup 2024 Team: టీ20 వరల్డ్ కప్ 2024.. టీమిండియాలో ఈ 8 స్థానాలు కన్ఫమ్.. ఆ ఏడు ఖాళీ

Hari Prasad S HT Telugu

T20 World Cup 2024 Team: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియాలో 8 స్థానాలు దాదాపు కన్ఫమ్ అయినట్లే. మిగిలిన 7 స్థానాలు మాత్రం ఇంకా కావాల్సి ఉంది. మరి ఎవరెవరు ఉన్నారు? ఎవరు వచ్చే అవకాశం ఉందో చూద్దాం.

టీ20 వరల్డ్ కప్ 2024.. టీమిండియాలో ఈ 8 స్థానాలు కన్ఫమ్.. ఆ ఏడు ఖాళీ (BCCI-X)

T20 World Cup 2024 Team: టీ20 వరల్డ్ కప్ 2024కు సోమవారం (ఏప్రిల్ 15) నుంచి చూసుకుంటే మరో 47 రోజుల సమయం ఉంది. జూన్ 2 నుంచి జూన్ 29 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికోసం టీమిండియాను మే తొలి వారంలో ఎంపిక చేయనున్నారు. అయితే ఇప్పటి వరకూ ఐపీఎల్ నాలుగు వారాలు ముగియడంతో 8 స్థానాలు దాదాపు కన్ఫమ్ అయ్యాయి. మరో ఏడు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2024కు టీమిండియా

ప్రస్తుతం ఉన్న ఫామ్, సీనియారిటీ ప్రకారం చూస్తే ఇప్పటికే సుమారు 8 స్థానాలు భర్తీ అయినట్లే చెప్పొచ్చు. వీటిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలాంటి సీనియర్లు కూడా ఉంటారు. అయితే ఏడు స్థానాల కోసం పోటీ పడుతున్న ప్లేయర్స్ మాత్రం చాలా మందే ఉన్నారు. వాటిపైనే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేసే అవకాశం లేదని కూడా ఇప్పటికే ఓ బీసీసీఐ అధికారి స్పష్టం చేసినట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్ తన రిపోర్టులో వెల్లడించింది.

ఈ 8 మంది కన్ఫమ్

ఇప్పటి వరకూ చూస్తే టీ20 వరల్డ్ కప్ కోసం ఎనిమిది మంది ప్లేయర్స్ మాత్రం దాదాను కన్ఫమ్ అయినట్లే. వాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, స్టార్ పేస్ బౌలర్ బుమ్రా, ఫినిషర్ రింకూ సింగ్, లెఫ్టామ్ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ మాత్రం ఖాయంగా కనిపిస్తున్నారు.

ఇక వికెట్ కీపింగ్ కోసం పంత్ తోపాటు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్లు కూడా పోటీ పడుతున్నారు. పంత్ ఖాయమే అయినా మరో స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరం. ఈ సీజన్లో సంజూ శాంసన్ టాప్ ఫామ్ లో ఉండటం అతనికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మరో స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కు కూడా జట్టులో స్థానం దక్కవచ్చు.

ప్రస్తుతం లీడింగ్ వికెట్ టేకర్ అతడే. ఇక వీళ్లే కాకుండా మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్ కూడా టీ20 వరల్డ్ కప్ టీమ్ రేసులో ఉన్నారు. వీళ్ల కాకుండా కేఎల్ రాహుల్, మయాంక్ యాదవ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, మోహిత్ శర్మలాంటి ప్లేయర్స్ ను కూడా సెలెక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. అంటే మిగిలిన ఏడు స్థానాల కోసం 14 మంది ప్లేయర్స్ పోటీ పడుతున్నారని చెప్పొచ్చు.

టీమ్ ఎంపికకు కనీసం మరో 20 రోజుల సమయం ఉంది. ఈ గ్యాప్ లో ఇప్పటికీ జట్టులో చోటు ఖాయం చేసుకోని ప్లేయర్స్ తమను తాము నిరూపించుకునే అవకాశం ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి కరీబియన్ దీవులతోపాటు అమెరికాలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇండియన్ టీమ్ తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది. జూన్ 11న పాకిస్థాన్ తో మ్యాచ్ ఉంటుంది. ఈసారి వరల్డ్ కప్ లో మొత్తంగా 20 టీమ్స్ పాల్గొంటున్నాయి.