RCB Strong Final XI: ఈ ఏడాది ఐపీఎల్‍లో ఆర్సీబీ తుది జట్టులో ఎవరు ఉండే ఛాన్స్ ఉంది? బలమైన ఎలెవెన్ ఇదే
IPL 2024 Royal Challengers Bengaluru Final XI: ఐపీఎల్ 2024 సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెడీ అయింది. స్టార్ ఆటగాళ్లతో మరోసారి బలంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆ జట్టు బలమైన ఫైనల్ ఎలెవెన్ ఏదో ఇక్కడ చూడండి.
IPL 2024 - RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్‍కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సన్నద్ధమైంది. మార్చి 22వ తేదీన ఐపీఎల్ 2024 షురూ కానుంది. తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో బెంగళూరు తలపడనుంది. సీజన్‍కు ముందు ఫ్రాంచైజీ పేరులో Bangalore ను Bengaluruగా మార్చడంతో పాటు జెర్సీలోనూ మార్పులు చేసింది. లోగోను కూడా కాస్త ఛేంజ్ చేసింది. ఐపీఎల్‍లో 16 సీజన్లుగా ఆర్సీబీకి టైటిల్ అందడం లేదు. ఈ 17వ సీజన్‍లో అయినా టైటిల్‍ను దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.
మళ్లీ ఫేవరెట్‍గానే..
ఐపీఎల్‍లో ఆర్సీబీ ఎప్పుడూ ఫేవరెట్‍గానే ఉంటుంది. ఈసారి కూడా ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలో స్టార్ ఆటగాళ్లతో ఆ జట్టు బలంగా ఉంది. భారత స్టార్ విరాట్ కోహ్లీ, డుప్లిసెసి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ సిరాజ్ సహా మరికొందరు స్టార్ ప్లేయర్లు ఆర్సీబీలో ఉన్నారు. ఈ సీజన్‍కు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‍ను కూడా ఆ ఫ్రాంచైజీ తీసుకుంది.
బ్యాటింగ్ ఆర్డర్ ఇలా..
ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రజత్ పాటిదార్ మూడో ప్లేస్‍లో బ్యాటింగ్‍కు రావొచ్చు. ఆస్ట్రేలియా స్టార్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ నాలుగు, ఐదు స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. దినేశ్ కార్తీక్ మరోసారి ఫినిషర్ రోల్ పోషించనున్నాడు. అనూజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్ కూడా తుది జట్టులో ప్లేస్ కోసం పోటీదారులుగా ఉన్నారు.
ప్రధాన బౌలర్లు
ఆర్సీబీకి ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో ప్రధాన పేసర్లుగా మహహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్ ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో యశ్ దయాల్, ఆకాశ్ దీప్, వైశాఖ్ విజయ్ కుమార్‌లను కూడా ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. ఇక మెయిన్ స్పిన్నర్లుగా తుది జట్టులో కరణ్ శర్మ, మయాంక్ డాగర్ ఉండొచ్చు. న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గ్యూసన్ కూడా ఉన్నా.. తుది జట్టులో అతడికి చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.
ఐపీఎల్ 2024లో ఆర్సీబీ తుది జట్టు (అంచనా): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), కరణ్ శర్మ, మయాంక్ డాగర్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ ప్లేయర్ కోసం ముఖ్యమైన ఆప్షన్లు: యశ్ దయాల్, మయాంక్ డాగర్, విజయ్ కుమార్ వైశాఖ్
పిచ్ పరిస్థితులు, గాయాలను బట్టి తుది జట్టులో మార్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది.
ఐపీఎల్ 2024లో ఆర్సీబీ పూర్తి జట్టు
- బ్యాటర్లు: ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, సౌరవ్ చౌహాన్
- వికెట్ కీపర్ బ్యాటర్లు: దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్
- ఆల్ రౌండర్లు: గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, ఆకాశ్ దీప్, సుయాశ్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, మనోజ్ భండగే
- బౌలర్లు: కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, టామ్ కరన్, మయాంక్ డాగర్, మహమ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రజన్ కుమార్, విజయ్ కుమార్ వైశాఖ్, లూకీ ఫెర్గ్యూసన్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్