India vs Pakistan: ఇండియాతో ఆడాలంటే మావాళ్లు భయపడతారు: పాకిస్థాన్ మాజీ సంచలన కామెంట్స్-pakistan players get scared while playing against india says former cricketer moin khan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Pakistan: ఇండియాతో ఆడాలంటే మావాళ్లు భయపడతారు: పాకిస్థాన్ మాజీ సంచలన కామెంట్స్

India vs Pakistan: ఇండియాతో ఆడాలంటే మావాళ్లు భయపడతారు: పాకిస్థాన్ మాజీ సంచలన కామెంట్స్

Hari Prasad S HT Telugu
Oct 02, 2023 09:26 AM IST

India vs Pakistan: ఇండియాతో ఆడాలంటే మావాళ్లు భయపడతారు అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆసియా కప్ లో అదే జరిగిందని కూడా అతడు చెప్పాడు.

పాకిస్థాన్ క్రికెట్ టీమ్
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ (AFP)

India vs Pakistan: ఇండియాతో ఆడాలంటే పాకిస్థాన్ ప్లేయర్స్ భయపడతారంటూ ఆ దేశ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ అన్నాడు. ఆసియా కప్ లో జరిగింది అదే అని అతడు చెప్పాడు. ఇప్పుడు వరల్డ్ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్ లో ఈ దాయాదులు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో మొయిన్ ఖాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అక్టోబర్ 5న వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఓ వామప్ మ్యాచ్ కూడా ఆడింది. భారీ స్కోరు చేసినా న్యూజిలాండ్ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇండియాతో ఆడాలంటే పాక్ ప్లేయర్స్ భయపడతారంటూ మొయిన్ ఖాన్ అనడం గమనార్హం.

"ఇది 100 శాతం నిజం. నేను చూశాను. ప్లేయర్స్ భయపడ్డారు. బాబర్ కు సలహాలు ఇవ్వడానికి కూడా వాళ్లు సందేహించారు. రిజ్వాన్, షాదాబ్, షహీన్ లాంటి ప్లేయర్స్ వెనుకా ముందు అయ్యారు. అసలు వాళ్లేమీ చర్చించుకోలేదు. కొన్ని సలహాలు ఇచ్చినా బాబర్ వాటిని ఫాలో కాలేదు. ఒకవేళ బాబర్ బాబర్ వాటిని ఫాలో అయినా వర్కౌట్ కాలేదు" అని క్రికెట్ పాకిస్థాన్ తో మాట్లాడుతూ మొయిన్ అన్నాడు.

"మరో విషయం ఏంటంటే.. ఇండియాతో ఆడాలంటే ప్లేయర్స్ భయపడతారు. ఎవరైతే భయపడతారో వాళ్ల సలహాలు పని చేయవు. ఓ ప్లేయర్ గా సామర్థ్యానికి తగినట్లు ఆడుతూ 100 శాతం ప్రదర్శన చేయాలి. మీరిచ్చే సలహాలు వర్కౌట్ కాకపోవచ్చు. అది సహజమే.

కానీ మీరు గెలవాలన్న కసి ఉంటే అదీ మీ బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తుంది. అది అక్కడ కనిపించలేదు. డ్రెస్సింగ్ రూమ్ లోనూ కొన్ని సమస్యలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రొఫెషనల్ క్రికెట్ లో విభేదాలు సహజమే. వాటికి ఫుల్ స్టాప్ పెట్టి మంచి ప్రదర్శన చేయాలి" అని మొయిన్ అన్నాడు.

న్యూజిలాండ్ తో తొలి వామప్ మ్యాచ్ లో ఓడిన పాకిస్థాన్.. అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో మరో పరీక్ష ఎదుర్కోబోతోంది. ఇక అక్టోబర్ 6న వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ తో పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. తొలి వామప్ మ్యాచ్ లో రిజ్వాన్ సెంచరీ, బాబర్, సాద్ షకీల్ హాఫ్ సెంచరీలతో పాక్ భారీ స్కోరు చేసినా.. బౌలర్లు దారుణంగా విఫలమవడం ఆ జట్టును కంగారు పెడుతోంది.

Whats_app_banner