తెలుగు న్యూస్ / ఫోటో /
World Cup Trophies: వరల్డ్ కప్ ట్రోఫీలు 1975 నుంచి 2023 వరకు.. ఎలా మారిపోయాయో చూడండి
- World Cup Trophies: వరల్డ్ కప్ ట్రోఫీలు 1975 నుంచి 2023 వరకు మారుతూ వస్తున్నాయి. 1975 నుంచి 1983 వరకు ఒక ట్రోఫీ, 1987, 1992, 1996లలో వేర్వేరు ట్రోఫీలు.. మళ్లీ 1999 నుంచి ఇప్పటి వరకూ ఒకే ట్రోఫీ అందిస్తున్నాయి. ఏ వరల్డ్ కప్ లో ట్రోఫీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
- World Cup Trophies: వరల్డ్ కప్ ట్రోఫీలు 1975 నుంచి 2023 వరకు మారుతూ వస్తున్నాయి. 1975 నుంచి 1983 వరకు ఒక ట్రోఫీ, 1987, 1992, 1996లలో వేర్వేరు ట్రోఫీలు.. మళ్లీ 1999 నుంచి ఇప్పటి వరకూ ఒకే ట్రోఫీ అందిస్తున్నాయి. ఏ వరల్డ్ కప్ లో ట్రోఫీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
(1 / 6)
World Cup Trophies: వన్డే వరల్డ్ కప్ కు టైమ్ దగ్గర పడింది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం పది టీమ్స్ పోటీ పడుతున్నాయి. అయితే 1975లో మొదలైన వరల్డ్ కప్ లో అందిస్తున్న ట్రోఫీలు.. ఈ 48 ఏళ్లలో ఎన్నోసార్లు మారాయి. ఎప్పుడు ఏ ట్రోఫీ ఇచ్చారో ఓసారి చూద్దాం.
(2 / 6)
World Cup Trophies: ఇది 1983లో ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ లార్డ్స్ బాల్కనీలో వరల్డ్ కప్ అందుకుంటున్న ఫొటో. 1975 నుంచి 1983 వరకూ ప్రుడెన్షియల్ కప్ పేరుతో జరిగిన వరల్డ్ కప్ ట్రోఫీలు ఒకేలా ఉండేవి. 1975, 1979లలో తొలి రెండు వరల్డ్ కప్ లు గెలిచిన వెస్టిండీస్.. 1983లో కప్పు గెలిచిన ఇండియా దగ్గర ఇలాంటి ట్రోఫీలే ఉన్నాయి.
(3 / 6)
World Cup Trophies: ఇది 1987లో ఇండియా, పాకిస్థాన్ కలిసి నిర్వహించిన వరల్డ్ కప్ ట్రోఫీ. ఆస్ట్రేలియా గెలిచిన తొలి వరల్డ్ కప్. అప్పటి కెప్టెన్ అలన్ బోర్డర్ చేతుల్లోని ఈ వరల్డ్ కప్ ట్రోఫీ ఆ ఒక్కసారికి మాత్రమే అందించారు. దీనిని రిలయెన్స్ వరల్డ్ కప్ గా పిలిచారు.
(4 / 6)
World Cup Trophies: 1992లో అందించిన వరల్డ్ కప్ ట్రోఫీ ఇది. ఇప్పటి వరకూ ఉన్న అన్ని ట్రోఫీల కంటే చాలా అందమైన ట్రోఫీగా దీనికి పేరుంది. ఆస్ట్రేలియాలో జరిగిన ఆ వరల్డ్ కప్ ను పాకిస్థాన్ గెలుచుకుంది.
(5 / 6)
World Cup Trophies: 1996లో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ ట్రోఫీ ఇది. ఫైనల్ లాహోర్ లో జరగగా.. ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక తొలిసారి ట్రోఫీ గెలిచింది. వరల్డ్ కప్ ట్రోఫీలలో చాలా ఎక్కువగా అందంగా అలంకరించిన ట్రోఫీగా దీనికి పేరుంది.
(6 / 6)
World Cup Trophies: ఇక 1999 నుంచి ఇప్పటి వరకూ ఒకే వరల్డ్ కప్ ట్రోఫీని అందిస్తున్నారు. తొలిసారి 1999లో ఇంగ్లండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో ఈ ట్రోఫీని ఆవిష్కరించారు. ఏవైపు నుంచి చూసినా ఒకేలా కనిపించే ట్రోఫీ ఇది. ఒక్కోవైపు మూడు స్టంప్స్, పైన మధ్యలో బంగారుపూత పూసిన గ్లోబ్ ఈ ట్రోఫీలో ఏర్పాటు చేశారు. విజేతకు గెలిచినప్పుడు మాత్రమే ఈ ట్రోఫీ అందిస్తారు. తర్వాత అది తీసుకొని దీని నకలును శాశ్వతంగా వాళ్లకు ఇస్తారు. అసలైన ట్రోఫీపై విజేతల పేర్లు ఉంటాయి. 1999 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా వరుసగా మూడుసార్లు, 2011లో వరల్డ్ కప్ గెలిచిన ఇండియా, 2015లో మరోసారి ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్ ఈ ట్రోఫీ అందుకున్నాయి.
ఇతర గ్యాలరీలు