IND vs ZIM: టీ20ల్లో టీమిండియా ప్లేయ‌ర్లు అందుకునే మ్యాచ్ ఫీజు మూడు ల‌క్ష‌లు - జింబాబ్వే ప్లేయ‌ర్ల‌కు ఇర‌వై వేలు-match fee differences in indian cricketers vs zimbabwe cricketers in t20 format ind vs zim t20 series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Zim: టీ20ల్లో టీమిండియా ప్లేయ‌ర్లు అందుకునే మ్యాచ్ ఫీజు మూడు ల‌క్ష‌లు - జింబాబ్వే ప్లేయ‌ర్ల‌కు ఇర‌వై వేలు

IND vs ZIM: టీ20ల్లో టీమిండియా ప్లేయ‌ర్లు అందుకునే మ్యాచ్ ఫీజు మూడు ల‌క్ష‌లు - జింబాబ్వే ప్లేయ‌ర్ల‌కు ఇర‌వై వేలు

Nelki Naresh Kumar HT Telugu
Jul 12, 2024 11:46 AM IST

IND vs ZIM: టీమిండియా క్రికెట‌ర్లు ఒక్కో టీ20 మ్యాచ్ ద్వారా మ్యాచ్ ఫీజుల రూపంలో మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ద‌క్కించుకోనున్నారు. అదే జింబాబ్వే క్రికెట‌ర్ల‌కు ఒక్కో మ్యాచ్ ద్వారా ఇర‌వై వేల రూపాయ‌ల లోపే ఆదాయం ద‌క్క‌నుంది.

టీమిండియా
టీమిండియా

IND vs ZIM: వ‌ర‌ల్డ్ లోని రిచెస్ట్ క్రికెట‌ర్ల లిస్ట్‌లో టీమిండియా ప్లేయ‌ర్లు ఎక్కువ మంది ఉంటారు. టీమిండియాతో పాటు ఐపీఎల్ ఆడ‌టం ద్వారా ఒక్కో క్రికెట‌ర్ ప్ర‌తి ఏటా కోట్ల‌లో ఆదాయాన్ని సంపాదిస్తోన్నారు. యాడ్స్‌, బ్రాండ్స్ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ ద్వారా వ‌చ్చే ఇన్‌క‌మ్ అద‌నం. కోహ్లి, రోహిత్‌, ధోనీ తో పాలు ప‌లువురు క్రికెట‌ర్లు ఒక్కో యాడ్ లో న‌టించినందుకు నాలుగు నుంచి ఆరు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు.

నాలుగు గ్రేడులు...

టీమిండియా క్రికెట‌ర్ల‌ను నాలుగు విభాగాలుగా విభ‌జించిన బీసీసీఐ ఏ ప్ల‌స్‌ గ్రేడ్‌ క్రికెట‌ర్ల‌కు ప్ర‌తి ఏటా ఏడు కోట్లు చెల్లిస్తోంది. ఏ గ్రేడ్ వారికి ఐదు కోట్లు, బీ గ్రేడ్ వారికి మూడు కోట్లు, సీ గ్రేట్‌లో చోటు ద‌క్కించుకున్న క్రికెట‌ర్ల‌కు కోటి వ‌ర‌కు బీసీసీఐ ఇస్తోంది.

ఒక్క మ్యాచ్ ఆడితే మూడు ల‌క్ష‌లు...

బీసీసీఐ లెక్క‌ల ప్ర‌కారం ఒక్కో టీమిండియా క్రికెట‌ర్ టెస్ట్ మ్యాచ్ ఆడితే ప‌దిహేను ల‌క్ష‌లు, వ‌న్డే మ్యాచ్ ఆడితే ఆరు ల‌క్ష‌లు, టీ20 మ్యాచ్ ఆడితే మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు మ్యాచ్ ఫీజుల రూపంలో ద‌క్కించుకోనున్నారు. ఆస్ట్రేలియా లాంటి అగ్ర జ‌ట్ల‌తో పాటు జింబాబ్వే లాంటి చిన్న టీమ్‌ల‌తో మ్యాచ్‌లు ఆడిన ఒకేలా టీమిండియాకు మ్యాచ్ ఫీజులు ద‌క్కుతాయి.ప్ర‌స్తుతం జింబాబ్వేతో జ‌రుగుతోన్న సిరీస్ ద్వారా టీమిండియా ప్లేయ‌ర్లు మ్యాచ్ ఫీజుల ద్వారానే ప‌ది నుంచి ప‌దిహేను ల‌క్ష‌ల వ‌ర‌కు సొంతం చేసుకోనున్నారు.

జింబాబ్వే ప్లేయ‌ర్ల‌కు ఇర‌వై వేలు...

జింబాబ్వే ఆట‌గాళ్ల ప‌రిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జింబాబ్వే ఆట‌గాళ్ల‌కు ఒక్కో టీ20 మ్యాచ్ ఆడితే ఇండియ‌న్ క‌రెన్సీలో 20 వేల వ‌ర‌కు ఆదాయం ద‌క్కుతుంది. ఇండియాతో జ‌రుగుతోన్న టీ20 సిరీస్ మొత్తం ఆడితే ఒక్కో ప్లేయ‌ర్‌కు ల‌క్ష వ‌ర‌కు సంపాదించే అవ‌కాశం ఉంది. సీనియారిటీ ప్ర‌కారం కొంద‌రు క్రికెట‌ర్ల‌కు ల‌క్ష కంటే త‌క్కువ మొత్త‌మే ద‌క్కే అవ‌కాశం ఉంది.

టీమిండియా క్రికెట‌ర్ల కంటే ప‌దింత‌లు త‌క్కువే జింబాబ్వే ప్లేయ‌ర్ల‌కు ద‌క్క‌నుంది. ఇండియాలో రంజీ మ్యాచ్‌లు ఆడే క్రికెట‌ర్లు ఒక్కో మ్యాచ్ ద్వారా న‌ల‌భైనుంచి అర‌వై వేల వ‌ర‌కు ఫీజుల రూపంలో అందుకుంటారు. వారి కంటే జింబాబ్వే క్రికెట‌ర్ల మ్యాచ్ ఫీజులు త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం.

టీమిండియా లీడ్‌...

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1లో జింబాబ్వేపై టీమిండియా ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా ఆ త‌ర్వాత రెండు మ్యాచుల్లో వ‌రుస‌గా విజ‌యాన్ని సాధించింది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య నాలుగో టీ20 మ్యాచ్ శ‌నివారం జ‌రుగ‌నుంది. ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్ వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడిన ప్లేయ‌ర్ల‌కు విశ్రాంతి నిచ్చిన బీసీసీఐ ఐపీఎల్ స్టార్ల‌ను జింబాబ్వే టూర్‌కు పంపించింది.

Whats_app_banner