IPL Balls Making: ఐపీఎల్లో వాడే బాల్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఒక్కో బాల్ ధర తెలిస్తే దిమ్మదిరిగిపోతుంది-ipl balls making meerut a city in uttar pradesh ruling cricket balls market with 500 crores turnover every year ipl 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl Balls Making: ఐపీఎల్లో వాడే బాల్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఒక్కో బాల్ ధర తెలిస్తే దిమ్మదిరిగిపోతుంది

IPL Balls Making: ఐపీఎల్లో వాడే బాల్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఒక్కో బాల్ ధర తెలిస్తే దిమ్మదిరిగిపోతుంది

Hari Prasad S HT Telugu
Mar 29, 2024 07:34 PM IST

IPL Balls Making: ఐపీఎల్లో వాడే క్రికెట్ బాల్స్ ను ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? ఏటా రూ.500 కోట్ల టర్రోవర్ ఉన్న ఈ బాల్స్ మార్కెట్ కు ఉత్తరప్రదేశ్ లోని ఓ చిన్న నగరం కేంద్రం కావడం విశేషం.

ఐపీఎల్లో వాడే బాల్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఒక్కో బాల్ ధర తెలిస్తే దిమ్మదిరిగిపోతుంది
ఐపీఎల్లో వాడే బాల్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఒక్కో బాల్ ధర తెలిస్తే దిమ్మదిరిగిపోతుంది

IPL Balls Making: ఐపీఎల్ 2024 ఓ రేంజ్ లో మొదలైంది. బౌలర్లను బ్యాటర్లు చితకబాదుతుంటే, బాల్ పదేపదే స్టాండ్స్ లోని ప్రేక్షకుల చేతుల్లోకి వెళ్తుంటే.. ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ వీరబాదుడు తట్టుకునే బాల్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? ముఖ్యంగా ఐపీఎల్ తోపాటు ఇండియాలో జరిగే ప్రతి అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ లలో వాడే బాల్స్ తయారీకి యూపీలోని ఓ చిన్న నగరం కేంద్రంగా ఉంది.

మీరట్.. క్రికెట్ బాల్స్ అడ్డా

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ఓ చిన్న నగరం. కానీ స్పోర్ట్స్ సామగ్రి తయారీలో మాత్రం మేటి. అందులోనూ క్రికెట్ బాల్స్ మేకింగ్ లో మీరట్ కు ప్రత్యేకమైన పేరుంది. ఇండియాలో జరిగే క్రికెట్ టోర్నీల్లో వాడే ఎస్‌జీ బాల్స్ తయారయ్యేది ఇక్కడే. ఇప్పుడు ఐపీఎల్లో వాడుతున్న బాల్స్ కూడా ఇక్కడి నుంచి వచ్చినవే. క్రికెట్ లో వివిధ ఫార్మాట్లలో వాడే వైట్, పింక్, రెడ్ బాల్స్ అన్నీ మీరట్ లోనే తయారవుతాయి.

ఏటా రూ.500 కోట్ల టర్నోవర్ ఈ క్రికెట్ బాల్స్ మేకింగ్ తో సాధ్యమవుతుందంటే నమ్మగలరా? ప్రపంచంలో చాలా చోట్ల క్రికెట్ బాల్స్ ను అత్యాధునిక మెషీన్లతో తయారు చేస్తున్నారు. కానీ మీరట్ లో మాత్రం ఇప్పటికే క్రికెట్ బాల్స్ ను చేత్తోనే చేస్తుండటం విశేషం. ఒక్కో బాల్ తయారు చేయడానికి చాలానే శ్రమించాల్సి వస్తుంది. లెదర్ ను ప్రాసెస్ చేయడం నుంచి బాల్ స్టిచింగ్, పాలిషింగ్ వరకూ ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది.

స్పోర్ట్స్ సిటీగా పేరుగాంచిన మీరట్ లో తయారయ్యే స్పోర్ట్స్ సామగ్రికి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా డిమాండ్ ఉంది. ఇక ఐసీసీ, బీసీసీఐ కూడా అధికారికంగా ఇండియాలో ఎస్‌జీ తయారు చేసే క్రికెట్ బాల్స్ కు ఆమోదం తెలిపాయి. అందుకే మొదటి నుంచీ ఇండియాలో ఈ ఎస్‌జీ బాల్సే వాడతారు. ఆస్ట్రేలియాలో అయితే కూకాబుర్రా, ఇంగ్లండ్ లో అయితే డ్యూక్ బాల్స్ వాడుతున్నారు.

ఐపీఎల్ బాల్స్ కూడా ఇక్కడే..

ఐపీఎల్లో వాడుతున్న వైట్ బాల్స్ కూడా మీరట్ లోనే తయారవుతున్నాయి. నిజానికి ఈ క్రికెట్ బాల్స్ లోనూ వివిధ క్వాలిటీలు ఉంటాయి. టెస్ట్ క్రికెట్ లో వాడే రెడ్ బాల్ అన్నింటి కంటే నాణ్యమైనది. వైట్ బాల్ కాస్త త్వరగా పాడవుతుంది. అందుకే వీటిని పరిమిత ఓవర్ల క్రికెట్ లో, రాత్రిపూట ఫ్లడ్ లైట్ల వెలుగులో వాడుతుంటారు. ఒక్కో బాల్ ఖరీదు కూడా రూ.12 వేల వరకూ ఉంటుందంటే నమ్మగలరా?

ఇంతటి ఖరీదైన బాల్స్ కాబట్టే.. ఐపీఎల్లో మన బ్యాటర్లు అంతగా ఉతికారేస్తున్నా తట్టుకోగలుగుతున్నాయి. అంతర్జాతీయ టీ20లు, వన్డేలు, ఐపీఎల్లో ఇలాంటి క్వాలిటీ బాల్స్ నే వాడతారు. అందుకే మీరట్ నగరంలోనే ఒక్క క్రికెట్ బాల్స్ ఏడాది టర్నోవరే రూ.500 కోట్లకుపైగా ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్ ఒక్కో ఇన్నింగ్స్ లో రెండు బాల్స్ వాడతారు. అంటే మ్యాచ్ లో మొత్తంగా నాలుగు బాల్స్ ఉపయోగిస్తారు.

IPL_Entry_Point