IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 574 ప్లేయర్స్.. కానీ 204 మందికే ఛాన్స్.. లిస్ట్ వచ్చేసింది-ipl 2025 mega auction total 574 players up for grabs 204 slots available rishabh pant in set 1 kl rahul in set 2 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 574 ప్లేయర్స్.. కానీ 204 మందికే ఛాన్స్.. లిస్ట్ వచ్చేసింది

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 574 ప్లేయర్స్.. కానీ 204 మందికే ఛాన్స్.. లిస్ట్ వచ్చేసింది

Hari Prasad S HT Telugu
Nov 15, 2024 08:44 PM IST

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 574 మంది ప్లేయర్స్ ను వేలం వేయనున్నారు. అయితే వీళ్లలో కేవలం 204 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. నవంబర్ 24, 25 తేదీల్లో జరగబోయే ఈ వేలంలో సెట్ 1లో రిషబ్ పంత్, సెట్ 2లో కేఎల్ రాహుల్ ఉన్నారు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 574 ప్లేయర్స్.. కానీ 204 మందికే ఛాన్స్.. లిస్ట్ వచ్చేసింది
ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 574 ప్లేయర్స్.. కానీ 204 మందికే ఛాన్స్.. లిస్ట్ వచ్చేసింది (Getty Images)

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన ప్లేయర్స్ జాబితాను నిర్వాహకులు శుక్రవారం (నవంబర్ 15) రిలీజ్ చేశారు. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో ఈ వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఆ రెండు రోజుల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు వేలం మొదలవుతుంది. మొత్తంగా 574 మంది ప్లేయర్స్ వేలంలోకి రాగా.. అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 12 మంది ఇండియన్స్, 208 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు.

ఐపీఎల్ వేలం జాబితా

ఐపీఎల్ మెగా వేలంలో భాగంగా మొత్తంగా 574 మంది ప్లేయర్స్ వేలానికి వచ్చినా అందులో 204 మంది ప్లేయర్సే ఆయా ఫ్రాంఛైజీల్లోకి వెళ్లనున్నారు. వీళ్లలో 70 మంది విదేశీ ప్లేయర్సే వేలంలో అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ జాబితాలో 318 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. 12 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. అసోసియేట్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్స్ ను కూడా షార్ట్ లిస్ట్ చేశారు.

ఈ వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్ అత్యధికం కాగా.. ఇందులో 81 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇక రూ.1.5 కోట్లలో 27 మంది, రూ.1.25 కోట్లలో 18 మంది, రూ.1 కోటి బేస్ ప్రైస్ లో 23 మంది ప్లేయర్స్ ఉన్నారు. 425 మంది ప్లేయర్స్ రూ.కోటి బేస్ ప్రైస్ కంటే దిగువన ఉంటారు. సౌదీ అరేబియాలోని జెద్దాలో జరిగే ఈ వేలాన్ని మల్లికా సాగర్ నిర్వహిస్తారు.

మార్కీ సెట్ 1లో పంత్, అయ్యర్

మెగా వేలంలో మొదటగా వచ్చే ప్లేయర్స్ జాబితాను కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఇక చహల్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్లు రెండో సెట్లో ఉన్నారు. ఈ వేలానికి రహానే రాగా.. పుజారా మాత్రం లేడు.

మార్కీ సెట్ 1 ప్లేయర్స్: జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడా, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్

మార్కీ సెట్ 2 ప్లేయర్స్: యుజ్వేంద్ర చహల్, లియామ్ లివింగ్‌స్టన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్

సెట్ 1 ఆల్ రౌండర్స్: అశ్విన్, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, రచిన్ రవీంద్ర, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టాయినిస్

సెట్ 1 బ్యాటర్స్: హ్యారీ బ్రూక్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, రాహుల్ త్రిపాఠీ, ఏడెన్ మార్‌క్రమ్, డేవిడ్ వార్నర్

సెట్ 1 వికెట్ కీపర్స్: క్వింటన్ డికాక్, జానీ బెయిర్‌స్టో, రహ్మనుల్లా గుర్బాజ్, ఇషాన్ కిషన్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ

సెట్ 1 పేస్ బౌలర్లు: ఖలీల్ అహ్మద్, ట్రెంట్ బౌల్ట్, జోష్ హేజిల్‌వుడ్, అవేష్ ఖాన్, నటరాజన్, ఎన్రిచ్ నోక్యా, ప్రసిద్ధ్ కృష్ణ

సెట్ 1 స్పిన్నర్లు: నూర్ అహ్మద్, రాహుల్ చహర్, వనిందు హసరంగ, వఖార్ సలామ్‌ఖీల్, ఆడమ్ జంపా, మహీష్ తీక్షణ

Whats_app_banner