తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం.. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్ వీళ్లే.. పంత్, రాహుల్, శ్రేయస్ కూడా..
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న విషయం తెలుసు కదా. దీనికోసం 1500కుపైగా ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకోగా.. అందులో రూ.2 కోట్ల కనీస ధరతో ఉన్న ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాం. ఈ జాబితాలో ఇండియన్ ప్లేయర్సే ఎక్కువగా ఉన్నారు.
(1 / 8)
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ వేలం కోసం మొత్తం 1,574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ జాబితాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి భారత సూపర్ స్టార్ల పేర్లు ఉండగా,. సహజంగానే పంత్ ఈసారి ఐపీఎల్ వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ కోటాలో ఉన్నాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఐపీఎల్ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్న భారత, విదేశీ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.(BCCI)
(2 / 8)
IPL 2025 Mega Auction: ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి తమ కెప్టెన్ రిషబ్ పంత్ ను రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు మెగా వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీమ్స్ అతనిపై కన్నేశాయి. మరి అతడు ఎంత ధర పలుకుతాడో చూడాలి.(ANI)
(3 / 8)
IPL 2025 Mega Auction: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ సాధించిపెట్టినా శ్రేయస్ అయ్యర్ ను ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఇప్పుడు అతడు కూడా రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వస్తున్నాడు.
(4 / 8)
IPL 2025 Mega Auction: లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తప్పుకున్న కేఎల్ రాహుల్ కూడా వేలంలో ఎంత ధర పలుకుతాడో అన్న ఆసక్తి నెలకొంది. అతడు రూ.2 కోట్ల కనీస ధరతో వస్తున్నాడు. (AFP)
(5 / 8)
IPL 2025 Mega Auction: రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ లను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకోలేదు. అయితే వేలం నుంచి అశ్విన్ ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని కోచ్ రాహుల్ ద్రావిడ్ సంకేతాలిచ్చాడు. ఈ మెగా వేలంలో టీమ్ఇండియాకు చెందిన ఇద్దరు స్టార్ స్పిన్నర్లు గరిష్టంగా రూ.2 కోట్ల కనీస ధరకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
(6 / 8)
IPL 2025 Mega Auction: 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత మహ్మద్ షమి ఆటకు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ 2025కు ముందు అతను ఫిట్ గా ఉంటాడని బీసీసీఐ వైద్య బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత రంజీ సీజన్లో షమి తిరిగి మైదానంలోకి వచ్చే అవకాశం ఉంది. అతడు కూడా రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.
(7 / 8)
IPL 2025 Mega Auction: వీళ్లే కాకుండా రూ.2 కోట్ల కనీస ధరతో ఉన్న ఇండియన్ ప్లేయర్స్ జాబితాలో.. ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, టీ నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు.(AP)
ఇతర గ్యాలరీలు