India vs Zimbabwe Full Schedule: ఇండియా, జింబాబ్వే సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?-india vs zimbabwe full schedule when and where to watch this 5 match t20i series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Zimbabwe Full Schedule: ఇండియా, జింబాబ్వే సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

India vs Zimbabwe Full Schedule: ఇండియా, జింబాబ్వే సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Jul 04, 2024 12:39 PM IST

India vs Zimbabwe Full Schedule: జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ కోసం యంగ్ ఇండియా సిద్ధమవుతోంది. శనివారం (జులై 6) నుంచి ప్రారంభం కాబోతున్న ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

ఇండియా, జింబాబ్వే సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఇండియా, జింబాబ్వే సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? (BCCI)

India vs Zimbabwe Full Schedule: ఓవైపు టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచి గురువారమే (జులై 4) స్వదేశంలో అడుగుపెట్టగా.. మరోవైపు మరో యంగ్ టీమిండియా జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఆ జట్టుతో ఐదు టీ20ల సిరీస్ కోసం సీనియర్లంతా దూరంగా ఉండటంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ ఆటగాళ్లు.. ఈ సిరీస్ ఆడనున్నారు. మరి ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ చూడండి.

ఇండియా, జింబాబ్వే సిరీస్

జింబాబ్వేతో ఇండియా ఐదు టీ20ల సిరీస్ శనివారం (జులై 6) ప్రారంభం కానుంది. జులై 14 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా, శుభ్‌మన్ గిల్ కెప్టెన్ గా టీమిండియా ఈ సిరీస్ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే జింబాబ్వే చేరుకొని అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.

మొత్తం ఐదు టీ20లో జింబాబ్వే రాజధాని హరారెలోని హరారె స్పోర్ట్స్ క్లబ్ లోనే జరుగుతాయి. ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే ఈ సిరీస్ ఆడనున్నారు. అయితే వీళ్లు తొలి రెండు టీ20లకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో శివమ్ దూబె, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ స్థానంలో జితేశ్ శర్మ, సాయి సుదర్శన్, హర్షిత్ రాణాలను తీసుకున్నారు. మూడో టీ20 నుంచి ఆ ముగ్గురూ అందుబాటులోకి వస్తారు.

ఇండియాకు తొలిసారి శుభ్‌మన్ గిల్ కెప్టెన్ గా ఉండబోతున్నాడు. గతంలో ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఉన్న గిల్ కు ఇది మంచి అనుభవం కానుంది. అంతేకాదు 2026లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లు తమను తాను నిరూపించుకోవడానికి ఇదో మంచి అవకాశం అని చెప్పొచ్చు.

ఇండియా, జింబాబ్వే సిరీస్ మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

ఇండియా, జింబాబ్వే సిరీస్ లోని ఐదు మ్యాచ్ లూ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

ఇండియా, జింబాబ్వే సిరీస్ ఎక్కడ చూడాలి?

ఇండియా, జింబాబ్వే టీ20 సిరీస్ లైవ్ టెలికాస్ట్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో ఉంటుంది.

ఇండియా, జింబాబ్వే సిరీస్ ఆన్‌లైన్లో చూడొచ్చా?

ఇండియా, జింబాబ్వే సిరీస్ సోనీలివ్ యాప్, సోనీలివ్ వెబ్‌సైట్లలోనూ చూడొచ్చు. అయితే దీనికోసం సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూసే అవకాశం లేదు.

జింబాబ్వే సిరీస్‌కు ఇండియా టీమ్ ఇదే

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా

ఐదు టీ20ల షెడ్యూల్ ఇదే..

తేదీఐదు టీ20ల సిరీస్వేదిక
జులై 6ఇండియా వర్సెస్ జింబాబ్వే తొలి టీ20హరారె స్పోర్ట్స్ క్లబ్
జులై 7ఇండియా వర్సెస్ జింబాబ్వే రెండో టీ20హరారె స్పోర్ట్స్ క్లబ్
జులై 10ఇండియా వర్సెస్ జింబాబ్వే మూడో టీ20హరారె స్పోర్ట్స్ క్లబ్
జులై 13ఇండియా వర్సెస్ జింబాబ్వే నాలుగో టీ20హరారె స్పోర్ట్స్ క్లబ్
జులై 14ఇండియా వర్సెస్ జింబాబ్వే ఐదో టీ20హరారె స్పోర్ట్స్ క్లబ్

WhatsApp channel