India vs Afghanistan Toss: టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులో రెండు మార్పులు-ind vs afg 2nd t20 india rohit sharma won the toss and choose to bowl virat kohli returns ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Afghanistan Toss: టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులో రెండు మార్పులు

India vs Afghanistan Toss: టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులో రెండు మార్పులు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 14, 2024 06:57 PM IST

India vs Afghanistan 2nd T20 Toss: టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 మొదలైంది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‍తో భారత టీ20 జట్టులోకి 14 నెలల తర్వాత తిరిగి వచ్చేశాడు. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.

India vs Afghanistan Toss: టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులో రెండు మార్పులు
India vs Afghanistan Toss: టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులో రెండు మార్పులు

India vs Afghanistan 2nd T20 Toss: అఫ్గానిస్థాన్‍తో భారత్ రెండో టీ20 మొదలైంది. ఇండోర్ వేదికగా నేడు (జనవరి 14) ఈ మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20 బరిలోకి దిగాడు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత వన్డేలు, టెస్టులకే పరిమితమైన విరాట్.. ఈ మ్యాచ్‍లో మళ్లీ భారత టీ20 జట్టులోకి వచ్చేశాడు. దీంతో ఈ మ్యాచ్‍లో అతడిపైనే అందరి కళ్లు ఉండనున్నాయి. ఇక, అఫ్గానిస్థాన్‍తో ఈ రెండో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు.

రెండు మార్పులు

రెండో టీ20 కోసం గత మ్యాచ్‍తో పోలిస్తే టీమిండియా రెండు మార్పులు చేసింది. భారత తుది జట్టులోకి విరాట్ కోహ్లీ వచ్చేశాడు. దీంతో యంగ్ ప్లేయర్ తిలక్ వర్మను తప్పించింది టీమిండియా మేనేజ్‍మెంట్. ఇక పూర్తి ఫిట్‍నెస్ సాధించిన యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‍లో శుభ్‍మన్ గిల్‍ను పక్కన పెట్టింది భారత్.

తుది జట్టులో అఫ్గానిస్థాన్ కూడా ఓ మార్పు చేసింది. రహ్మత్ షా స్థానంలో నూర్ అహ్మద్‍ను జట్టులోకి తీసుకుంది.

ఈ మూడు టీ20 సిరీస్‍లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ రెండో టీ20లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ పక్కా చేసుకోవాలని భావిస్తోంది. ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరిగే ముందు భారత్ ఆడే చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్ ఉంది. దీంతో అఫ్గాన్‍తోనే అయినా ఈ సిరీస్‍ను మరింత సీరియస్‍గా తీసుకుంది భారత్. టీమ్ కాంబినేషన్‍పై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే.. 14 నెలల తర్వాత భారత టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ ఎంట్రీ ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్ ఆడలేకపోయాడు కోహ్లీ. ఇప్పుడు రెండో మ్యాచ్‍లో బరిలోకి దిగుతున్నాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍గా ఉంది. ఈ మైలురాయి చేరిన తొలి క్రికెటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు.

భారత తుదిజట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్

అప్గానిస్థాన్ తుదిజట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్ జాయ్, మహమ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీమ్ జన్నత్, గుల్బాదిన్ నైబ్, ఫజల్‍హక్ ఫరూకీ, నవీనుల్ హక్, ముజీబుర్ రహ్మన్, నూర్ అహ్మద్

ఈ టీ20 సిరీస్‍లో తొలి మ్యాచ్‍లో అఫ్గానిస్థాన్‍పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత యంగ్ ఆల్ రౌండర్ శివమ్ దూబే (40 బంతుల్లో 60 పరుగులు; నాటౌట్) అజేయ అర్ధ శకతం చేసి జట్టును గెలిపించాడు. దీంతో 159 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలోనే ఛేదించింది. జితేశ్ శర్మ (31), రింకూ సింగ్ (9 బంతుల్లో 16 పరుగులు నాటౌట్) చివర్లో మెరిపించారు. 

Whats_app_banner