Dhawan trolls Pakistan: అంతులేని ప్రేమకథ అంటూ పాకిస్థాన్ టీమ్‌ను దారుణంగా ట్రోల్ చేసిన శిఖర్ ధావన్-dhawan trolls pakistan brutally with never ending love story jab cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dhawan Trolls Pakistan: అంతులేని ప్రేమకథ అంటూ పాకిస్థాన్ టీమ్‌ను దారుణంగా ట్రోల్ చేసిన శిఖర్ ధావన్

Dhawan trolls Pakistan: అంతులేని ప్రేమకథ అంటూ పాకిస్థాన్ టీమ్‌ను దారుణంగా ట్రోల్ చేసిన శిఖర్ ధావన్

Hari Prasad S HT Telugu
Oct 04, 2023 11:27 AM IST

Dhawan trolls Pakistan: అంతులేని ప్రేమకథ అంటూ పాకిస్థాన్ టీమ్‌ను దారుణంగా ట్రోల్ చేశాడు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్. దాయాది టీమ్ ఫీల్డింగ్ ను ఉద్దేశించి అతడీ కామెంట్స్ చేయడం విశేషం.

పాకిస్థాన్ ఫీల్డింగ్ ను ఉద్దేశించి ట్రోల్ చేసిన శిఖర్ ధావన్
పాకిస్థాన్ ఫీల్డింగ్ ను ఉద్దేశించి ట్రోల్ చేసిన శిఖర్ ధావన్

Dhawan trolls Pakistan: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ను దారుణంగా ట్రోల్ చేశాడు శిఖర్ ధావన్. ఆ టీమ్ ఫీల్డింగ్ ను ఉద్దేశించి అంతులేని ప్రేమ కథ అంటూ ధావన్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ 2023కు సిద్ధమవుతున్న పాకిస్థాన్.. హైదరాబాద్ లో ఆడిన రెండు వామప్ మ్యాచ్ లలోనూ ఓడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ ఈ పోస్ట్ చేయడం విశేషం. ఆస్ట్రేలియాతో మంగళవారం (అక్టోబర్ 3) జరిగిన వామప్ మ్యాచ్ లో పాకిస్థాన్ టీమ్ ఫీల్డింగ్ చూసి ధావన్ వాళ్లను ట్రోల్ చేశాడు. "పాకిస్థాన్, ఫీల్డింగ్ ఓ అంతులేని ప్రేమ కథ" అంటూ ధావన్ ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో పాకిస్థాన్ ఫీల్డర్లు మహ్మద్ వసీం, మహ్మద్ నవాజ్ ఓ బాల్ ను ఆపడానికి ప్రయత్నించి విఫలమవడం చూడొచ్చు.

ఒకరు ఆపుతారని మరొకరు వదిలేయడంతో ఆ బాల్ కాస్త వాళ్ల మధ్య నుంచి బౌండరీ వైపు వెళ్లిపోయింది. ఈ ఫన్నీ వీడియో, దానికి ధావన్ చేసిన కామెంట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. నిజమే కదా.. పాకిస్థాన్ ఫీల్డింగ్ లో ఇలాంటి ఎన్నో వింతలు తరచూ చూస్తూనే ఉంటాం కదా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ధావన్ కామెంట్ దీనికి అతికినట్లు సరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ వరల్డ్ కప్ లో భాగంగా హైదరాబాద్ లోనే రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న పాకిస్థాన్ వారం కిందట నగరానికి వచ్చింది. అసలు టోర్నీకి ముందు రెండు వామప్ మ్యాచ్ లను కూడా ఇక్కడే ఆడింది. మొదట న్యూజిలాండ్ చేతుల్లో, తర్వాత ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లలో ఓసారి తన టార్గెట్ డిఫెండ్ చేసుకోలేక, మరోసారి టార్గెట్ చేజ్ చేయలేక పాక్ ఓడిపోయింది.

ఆ టీమ్ బ్యాటర్లు మంచి ఫామ్ లోనే ఉన్నా.. బౌలింగ్ అనుకున్న స్థాయిలో లేకపోవడం ఆ టీమ్ ను ఆందోళనకు గురి చేస్తోంది. స్టార్ బౌలర్లు షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ ఇంకా పూర్తిగా గాడిలో పడాల్సి ఉంది. పాకిస్థాన్ టీమ్ హైదరాబాద్ లోనే అక్టోబర్ 6న నెదర్లాండ్స్ తో తమ తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనుంది.

Whats_app_banner