Kohli Gambhir hug : ‘ఆస్కార్ అవార్డ్ ఇవ్వండి’.. కోహ్లీ-గంభీర్ 'హగ్'పై గవాస్కర్..
Kohli Gambhir hug : గొడవలతో వార్తల్లో నిలిచే విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్‌లు.. హగ్ చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సునీల్ గవాస్కర్ స్పందించారు.
RCB vs KKR IPL 2024 : ఐపీఎల్ 2024లో శుక్రవారం జరిగిన ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది! అదే.. విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ 'హగ్'. గొడవలతో వార్తల్లో నిలిచే ఈ ఇద్దరు.. ఒక్కసారి హగ్ చేసుకోవడం చూసి నెటిజన్లు సంతోషిస్తున్నారు. ఈ ఘటనపై క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కోహ్లీ- గంభీర్ హగ్.. 'ఆస్కార్ ఇవ్వండి'..
శుక్రవారం.. బెంగళూరు వేదికగా జరిగింది ఈ మ్యాచ్. తొలుత ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది. టైమౌట్ సమయంలో కోహ్లీ.. తన టీమ్ సభ్యులతో మాట్లాడుతూ ఉండగా.. అక్కడికి గౌతమ్ గంభీర్ వచ్చాడు. కోహ్లీని హగ్ చేసుకుని, అతనితో మట్లాడాడు. కోహ్లీ కూడా గంభీర్‌తో నవ్వుతూ మాట్లాడాడు. ఈ దృశ్యాలు చూసిన వారందరు అటు షాక్ అవ్వడంతో పాటు ఇటు సంతోషించారు.
ఇక కోహ్లీ- గంభీర్ హగ్ సమయంలో కామెంట్రీ బాక్స్‌లో రవి శాస్త్రి- గవాస్కర్‌లు ఉన్నారు. 'గంభీర్.. కోహ్లీకి హగ్ ఇచ్చాడు. కేకేఆర్‌కి ఫెయిర్ ప్లే అవార్డు దక్కుతుంది,' అని కామెంట్ చేశాడు రవి శాస్త్రి. "ఫెయిర్‌ప్లే ఒక్కటే కాదు.. ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలి," అని అన్నారు గవాస్కర్!
కోహ్లీ గంభీర్- గొడవలే.. గొడవలు..
Kohli Gambhir hug : 2023లో లక్నోలో జరిగిన గొడవ తర్వాత.. కోహ్లీ- గంభీర్‌లు కలుసుకోవడం ఇదే తొలిసారి. ఎల్ఎస్జీ బౌలర్ నవీన్ ఉల్ హక్- కోహ్లీ మధ్య గొడవ జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత.. కోహ్లీ దగ్గరికి వెళ్లి గౌతమ్ గంభీర్ గొడవపడ్డాడు. ఇది చాలా హాట్ టాపిక్‌గా మారింది. ముగ్గురికి ఫైన్ పడింది.
కోహ్లీ- గంభీర్ మధ్య గొడవ ఇది మొదటిసారి కాదు. అనాదిగా.. వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2013 ఐపీఎల్లో తొలిసారిగా.. వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. 2016లోనూ గొడవపడ్డరు. తిరిగి.. 7ఏళ్ల తర్వాత.. 2023 ఐపీఎల్లో మళ్లీ విభేదాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో.. కోహ్లీ- గంభీర్‌లు కలుస్తుడటంతో.. శుక్రవారం ఏం జరుగుతుందని అటు ఫ్యాన్స్, ఇటు క్రికెట్ అభిమానులు ఉత్కంఠకు గురయ్యారు. ఈసారి గొడవ జరగలేదు. పైగా.. ఇద్దరు హగ్ చేసుకోవడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.
ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్- కోహ్లీ పోరాటం వృథా!
Kohli Gambhir hug viral video : విరాట్ కోహ్లి కళ్లు చెదిరే ఇన్నింగ్స్ కూడా ఆర్సీబీని ఆదుకోలేకపోయింది. 183 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ ఈజీగా చేజ్ చేసింది. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ తోపాటు వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ రాణించడంతో కేకేఆర్ టీమ్ 19 బాల్స్ మిగిలి ఉండగానే.. 7 వికెట్లతో విజయం సాధించింది. ఈ సీజన్లో నైట్ రైడర్స్ కు ఇది వరుసగా రెండో విజయం. కాగా.. ఆర్సీబీ మూడు మ్యాచ్‌లలో ఇది రెండో ఓటమి. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం