CSK vs RCB Toss: కెప్టెన్‌గా తొలి టాస్ ఓడిపోయిన రుతురాజ్.. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్-csk vs rcb toss faf du plessis won the toss and elected to bat first ruturaj gaikwad chennai super kings ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Csk Vs Rcb Toss Faf Du Plessis Won The Toss And Elected To Bat First Ruturaj Gaikwad Chennai Super Kings

CSK vs RCB Toss: కెప్టెన్‌గా తొలి టాస్ ఓడిపోయిన రుతురాజ్.. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్

Hari Prasad S HT Telugu
Mar 22, 2024 07:52 PM IST

CSK vs RCB Toss: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే టాస్ ఓడిపోయాడు రుతురాజ్ గైక్వాడ్. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెస్సి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

కెప్టెన్‌గా తొలి టాస్ ఓడిపోయిన రుతురాజ్.. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
కెప్టెన్‌గా తొలి టాస్ ఓడిపోయిన రుతురాజ్.. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్

CSK vs RCB Toss: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి టాస్ గెలిచాడు. కెప్టెన్ గా తన తొలి మ్యాచ్ లోనే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ ఓడిపోయాడు.

ట్రెండింగ్ వార్తలు

సీఎస్కే వెర్సెస్ ఆర్సీబీ టాస్

స్పిన్ కు కలిసొచ్చే, మంచు ప్రభావం ఎక్కువగా ఉండే చెన్నై పిచ్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవాలని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నా డుప్లెస్సి మాత్రం ఆశ్చర్యకరంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. భారీ స్కోర్లు నమోదు కావు. మ్యాచ్ ప్రారంభానికి ముందు పిచ్ రిపోర్టులో పీటర్సన్ కూడా ఇదే విషయం చెప్పాడు. అయితే డుప్లెస్సి మాత్రం బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

సీఎస్కే తుది జట్టు ఇదే

రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, రహానే, డారిల్ మిచెల్, ఎమ్మెస్ ధోనీ, సమీర్ రిజ్వి, రవీంద్ర జడేజా, తీక్షణ, ముస్తఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చహర్

ఆర్సీబీ తుది జట్టు ఇదే

విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెస్సి, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్

ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ

టాస్ కు ముందు ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ ఘనంగా జరిగింది. శుక్రవారం (మార్చి 22) సాయంత్రం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ సెర్మనీ నిర్వహించారు. మొదట బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ పర్ఫార్మెన్స్ తో ఈ సెర్మనీ మొదలైంది. ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని అక్షయ్ తనదైన స్టైల్లో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ తో కలిసి కొన్ని బాలీవుడ్ సాంగ్స్ కు కొన్ని స్టెప్స్ వేశాడు.

ఈ ఇద్దరూ కలిసి నటించిన బడే మియా చోటే మియా మూవీ త్వరలోనే రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫామ్ చేసి తమ మూవీ ప్రమోషన్లు కూడా వీళ్లు నిర్వహించారు. ఇక వీళ్లిద్దరి తర్వాత మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్, సోను నిగమ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ కొన్ని సూపర్ హిట్ బాలీవుడ్ సాంగ్స్ తోపాటు చెన్నై ప్రేక్షకుల కోసం కొన్ని తమిళ పాటలు కూడా పాడారు.

ఈ సందర్భంగా ఫీల్డ్ లో ఓ భారీ ఐపీఎల్ ట్రోఫీ నమూనా కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఫీల్డ్ మధ్యలో చేసిన లేజర్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో దేశ గొప్పతనాన్ని సూచించే ప్రదర్శనలతోపాటు ఐపీఎల్ 2024లో పాల్గొనే టీమ్స్, వాటి కెప్టెన్ల ఫొటోలను కూడా ప్రదర్శించారు. రెహమాన్ తన సూపర్ హిట్ సాంగ్ వందేమాతరంతో మొదలుపెట్టి.. తన ఆస్కార్ విన్నింగ్ సాంగ్ జయహోతో ముగించాడు. అతడు పర్ఫామ్ చేస్తున్నంతసేపూ స్టేడియం మార్మోగిపోయింది. చివరగా కళ్లు చెదిరే ఫైర్ వర్క్స్ తో ఓపెనింగ్ సెర్మనీ ముగిసింది.

IPL_Entry_Point