Ruturaj Gaikwad: ధోనీ ఎప్పుడో హింట్ ఇచ్చాడు - సర్‌ప్రైజింగ్ ఏం కాదు - కెప్టెన్సీ మార్పుపై రుతురాజ్ క్లారిటీ
Ruturaj Gaikwad: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. కెప్టెన్సీ మార్పుపై రుతురాజ్ ఐపీఎల్ కెప్టెన్స్ ఫొటోషూట్ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చాడు.
Ruturaj Gaikwad: ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ధోనీ స్థానంలో రుతురాజ్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు చెన్నై ఫ్రాంచైజ్ ఇటీవల ప్రకటించింది. ధోనీ తన కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. రుతురాజ్ 2019 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతోన్నాడు. 52 మ్యాచ్ లు ఆడాడు అంటూ చెన్నై యాజమాన్యం ఇటీవల ట్వీట్ చేసింది. చెన్నై నిర్ణయంతో ధోనీ అభిమానులు షాకయ్యారు.
సర్‌ప్రైజ్ కాదు...
ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్లతో ఫోటోషూట్ జరిగింది. ఇందులో చెన్నై టీమ్ కెప్టెన్‌గా రుతురాజ్ ఈ ఫొటోషూట్‌లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్‌లోనే కెప్టెన్సీ మార్పుపై రుతురాజ్ క్లారిటీ ఇచ్చాడు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం తనకు సర్‌ప్రైజ్ ఏం కాదని రుతురాజ్ తెలిపాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు గత ఏడాదే ధోనీ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడని రుతురాజ్ అన్నాడు.
గత ఏడాది హింట్...
సారథ్య బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ధోనీ గత ఏడాదే నాకు హింట్ ఇచ్చాడు ఏ క్షణంలోనైనా తాను నాయకత్వ పగ్గాలను వదలిపెట్టవచ్చని చెప్పాడు. ధోనీ స్థానంలో నేను సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించలేదు అని రుతురాజ్ తెలిపాడు.
ట్రైనింగ్ క్యాంప్‌లో...
సారథిగా జట్టును ముందుకు నడిపించేలా నన్ను ధోనీ గైడ్ చేశాడు. ట్రైనింగ్ క్యాంప్‌లో రియల్ సిట్యూవేషన్స్ క్రియేట్ చేసి వాటిని ఎలా ఎదుర్కొన్నాలో సలహాలు సూచనలు ఇచ్చాడు అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
ధోనీ ట్వీట్...
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై ధోనీ మూడు వారాల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. కొత్త రోల్‌తో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచే ధోనీ కెప్టెన్సీ మార్పుపై వార్తలు మొదలుయ్యాయి. ఆ పోస్ట్ గురించి కూడా ఈ వీడియోలో రుతురాజ్ స్పందించాడు. ధోనీ తర్వాత సీఎస్‌కే తదుపరి కెప్టెన్ మీరేనా అంటూ చాలా మంది నన్ను అడిగారు.
కానీ ధోనీ పెట్టింది క్యాజువల్ పోస్ట్ అనుకున్నాను. మనసులో కెప్టెన్సీపై కోరిక ఉన్న దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఐపీఎల్ ప్రారంభానికి వారం రోజుల ముందే కెప్టెన్సీపై ధోరీ తన నిర్ణయాన్ని నాతో చెప్పాడు అని రుతురాజ్ పేర్కొన్నాడు. సీఎస్‌కేకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందని రుతురాజ్ చెప్పాడు. అనుభవజ్ఞులైన ప్లేయర్లు జట్టులో ఉండటం తమకు ప్లస్ పాయింట్ అని తెలిపాడు. రుతురాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2019లో ఎంట్రీ...
2019లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రుతురాజ్ గైక్వాడ్. గత ఐదు సీజన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2023 సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 590 రన్స్ చేశాడు. 2021 సీజన్‌లో 635 రన్స్‌తో ఆకట్టుకున్నాడు.