Ruturaj About Shiva Singh: బౌలర్‌కు స్టువర్ట్ బ్రాడ్‌ను గుర్తు చేద్దామనుకున్నా.. 7 సిక్సర్ల రికార్డుపై రుతురాజ్ స్పందన-ruturaj gaikwad says he want to remember stuart broad to shiva singh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ruturaj About Shiva Singh: బౌలర్‌కు స్టువర్ట్ బ్రాడ్‌ను గుర్తు చేద్దామనుకున్నా.. 7 సిక్సర్ల రికార్డుపై రుతురాజ్ స్పందన

Ruturaj About Shiva Singh: బౌలర్‌కు స్టువర్ట్ బ్రాడ్‌ను గుర్తు చేద్దామనుకున్నా.. 7 సిక్సర్ల రికార్డుపై రుతురాజ్ స్పందన

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 10:03 PM IST

Ruturaj About Shiva Singh: విజయ్ హజారే ట్రోఫీలో ఇటీవలే జరిగిన క్వార్టర్స్‌లో మహరాష్ట్రా బ్యాటర్ రుతురాజ్.. యూపీ బౌలర్ శివా సింగ్‌ ఓవర్లో 7 సిక్సర్లు బాదాడు. ఈ సమయంలో బౌలర్‌కు కి స్టువర్ట్ బ్రాడ్‌ను గుర్తు చేద్దామని రుతురాజ్ స్పష్టం చేశాడు.

రుతురాజ్ గైక్వాడ్
రుతురాజ్ గైక్వాడ్ (BCCI)

Ruturaj About Shiva Singh: టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపుతోన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రుతురాజ్.. ఇటీవల ఉత్తరప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అద్బుత ద్విశతకంతో విధ్వంసృం సృష్టించాడు. ముక్యంగా యూపీ స్పిన్నర్ శివా సింగ్ వేసిన ఓవర్లో ఓడు సిక్సర్లతో అదరగొట్టాడు. దీంతో మహారాష్ట్ర అద్భుత విజయాన్ని అందుకుంది. అనంతరం సెమీస్‌లోనూ అసోంపై 160 పరుగులతో అదిరే సెంచరీతో మరోసారి విజృంభించాడు. ఈ మ్యాచ్ అనంతరం తను ఏడు సిక్సర్ల విషయం గురించి మాట్లాడుతూ శివ సింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

"అసోం బౌలర్లను కించపరచడం కాదు కానీ.. ఉత్తరప్రదేశ్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. ఆల్ రౌండ్ ఎటాక్‌తో మెరుగైన ప్రదర్శన చేశారు. మేము అప్పటికే వేగంగా రెండు వికెట్లు కోల్పోయాం. గాయం తర్వాత నేను ఆడుతున్న మొదటి గేమ్ అదే. అంతేకాకుండా నాకౌట్ మ్యాచ్. కాబట్టి ఒత్తిడి కూడా అధికంగా ఉంది. యూపీతో జరిగిన మ్యాచ్‌కు అత్యధిక రేటింగ్ ఇస్తాను" అని రుతురాజ్ స్పష్టం చేశాడు.

యూపీ బౌలర్ శివా సింగ్ గురించి మాట్లాడుతూ.. 2007లో టీ20 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్‌ను గుర్తు చేయాలనుకున్నట్లు తెలిపాడు. "అతడు(శివా సింగ్) అర్ధం చేసుకోలేని రీతిలో నిరుత్సాహానికి గురయ్యాడు. నేను అతడికి 2007 టీ20 ప్రపంచకప్‌లో యువీ స్టువర్ట్ బ్రాడ్‌ను ఎలాగైతే ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడో అతడికి అదే సంఘటనను గుర్తు చేయాలనుకున్నాను. అతడికి అత్యుత్తమ కెరీర్ కలిగి ఉన్నాడు కాబట్టి.. ప్రతి బౌలర్‌కు ఇదొక పాఠం అని చెప్పవచ్చు." అని రుతురాజ్ తెలిపాడు.

యూపీతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో మహారాష్ట్ర 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రుతురాజ్ 220 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా 49 ఓవర్ వేసిన శివా సింగ్ బౌలింగ్‌లో నోబాల్ సహా ఏడు సిక్సర్లు బాదాడు. ఫలితంగా ఆ ఓవర్‌లో 43 పరుగులు వచ్చాయి. అనంతరం సెమీస్‌లో అసోంపై కూడా 168 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ చేసి వరసుగా రెండు ద్విశతకాలు నమోదు చేసిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మొదటి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాలని ఆశపడ్డాడు. కానీ 32 పరుగుల దూరంలోనే నిలిచిపోయాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్