Vijay Shekhar Sharma resigns : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి విజయ్ శేఖర్ ఔట్.. అసలు కారణం ఇదే!
Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవికి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవికి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేశారు.
Paytm Payments Bank Vijay Shekhar Sharma : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) పార్ట్‌టైమ్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేశారు. ఆర్బీఐ కఠిన ఆంక్షలతో పేమెంట్స్ బ్యాంక్ అల్లాడిపోతున్న తరుణంలో.. ఆయన రాజీనామా చేయం చర్చనీయాంశంగా మారింది.
నిబంధనలు సరిగ్గా పాటించడం లేదన్న ఆరోపణలు, కొనసాగుతున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో మెటిరీయల్ సూపర్వైజరీపై ఆందోళనల కారణంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 15 తర్వాత ఏ కస్టమర్ నుండి డిపాజిట్లు మరియు క్రెడిట్లను స్వీకరించకుండా పిపిబిఎల్ను నిషేధించింది.
Paytm Payments Bank crisis : నిబంధనలు పాటించడం లేదని, ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్న కారణంతో.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్లను నిలిపివేస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కఠిన ఆంక్షలు తొలుత.. ఫిబ్రవరి 29 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ.. వాటిని మార్చ్ 15 వరకు వాయిదా వేశారు.
విజయ్ శేఖర్ శర్మ ఎందుకు రాజీనామా చేశారు?
ఫిన్‌టెక్ బ్రాండ్ పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఓసీఎల్).. తన అసోసియేట్ బ్యాంక్ అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను పునర్వ్యవస్థీకరించినట్లు సోమవారం ప్రకటించింది.
RBI Paytm Payments Bank : రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, న్యూ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్‌లో.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, మాజీ ఐఎఎస్ అధికారి రజనీ సెఖ్రి సిబల్‌లు ఉన్నారు.
జనవరి 31న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పీపీబీఎల్‌పై గణనీయమైన వ్యాపార ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత కొత్త డిపాజిట్లను స్వీకరించడాన్ని, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించడంపై నిషేధం విధించింది. ఆ తర్వాత ఈ గడువును మార్చ్ 15 వరకు పొడిగించారు.
ఎవరీ విజయ్ శేఖర్ శర్మ?
Vijay Shekhar sharma quits : విజయ్ శేఖర్ శర్మ.. వన్97 కమ్యూనికేషన్స్, దాని కన్స్యూమర్ బ్రాండ్ పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ. అతి తక్కువ కాలంలోనే పేటీఎంను భారతదేశ ప్రముఖ మొబైల్-ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్‌గా మార్చి.. వార్తల్లో నిలిచారు. చాలా మందికి ఆదర్శనంగా నిలిచారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 1978లో జన్మించిన విజయ్ శేఖర్ శర్మ.. 1998లో దిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి బీటెక్ పూర్తి చేశారు.
శర్మ 2011లో.. మొబైల్ వాలెట్ పేటీఎంను స్థాపించారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. మొబైల్ ద్వారా చెల్లింపునకు సంక్షిప్త రూపమైన పేటీఎం.. 2016 లో భారతదేశ నోట్ల రద్దు తరువాత విపరీతమైన వృద్ధిని సాధించింది. నోట్ల రద్దు తర్వాత.. పేటీఎంకు 400 మిలియన్ల వినియోగదారులు వచ్చారు. ప్రతిరోజూ 25 మిలియన్ల లావాదేవీలు జరిగేవి.
Paytm Share price today : 2017లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ఫర్ క్లీన్ ఎయిర్ పాట్రాన్గా విజయ్ శేఖర్ శర్మ నియమితులయ్యారు. యూఎన్ ఎన్విరాన్మెంట్ #BreatheLife ప్రచారానికి మద్దతు ఇచ్చారు. పర్యావరణ చర్యలు, అవగాహన కోసం కృషిచేశారు.
పేటీఎం కోసం వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే నుంచి 300 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పొందడం ద్వారా శర్మ 2018 ఆగస్టులో అందరి దృష్టిని ఆకర్షించారు. పేటీఎం మాల్ అనే ఈ-కామర్స్ వెంచర్‌ని ప్రారంభించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని స్థాపించారు.
50 కోట్ల మంది నిరుపేద భారతీయ కస్టమర్లకు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు అందించాలనే లక్ష్యంతో.. 2019లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అవతరించింది.
ఫోర్బ్స్ 2022 బిలియనీర్స్ నెట్ వర్త్ ప్రకారం.. శర్మ నికర విలువ 1.2 బిలియన్ డాలర్లు. 2019లో ఇది ఇంకాస్త ఎక్కువగానే ఉండేది. ఏదిఏమైనా.. శర్మ ఫోర్బ్స్ 2022 బిలియనీర్ జాబితాలో స్థానం పొందారు.
సంబంధిత కథనం