Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీల గడువును పొడిగించిన ఆర్బీఐ-rbi extends paytm payments bank transaction curb deadline to 15 march ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీల గడువును పొడిగించిన ఆర్బీఐ

Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీల గడువును పొడిగించిన ఆర్బీఐ

HT Telugu Desk HT Telugu
Feb 16, 2024 07:10 PM IST

Paytm: సంక్షోభంలో ఉన్న పేటీఎంకు కొంత ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీల గడువును మార్చి 15 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వన్ 97 కమ్యూనికేషన్స్ లేదా పేటీఎంలో భాగమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో లావాదేవీలను నిలిపివేసే గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 15 రోజులు పొడిగించింది. ఖాతాదారులు తమ ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్ లు, ప్రీపెయిడ్ కార్డులలో డబ్బు జమ చేయడానికి మార్చి 15 వరకు సమయం ఉంది.

yearly horoscope entry point

మరికొంత గడువు

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి మరింత సమయం అవసరమని, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. పేటీఎం (PayTM) లోని కస్టమర్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్ లు, ఇతర సాధనాలలో డిపాజిట్లు లేదా టాప్-అప్ లను ఫిబ్రవరి 29 తర్వాత స్వీకరించడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ జనవరి 31 న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ను ఆదేశించిన విషయం తెలిసిందే.

మార్చి 15 వరకు..

వడ్డీ, క్యాష్ బ్యాక్ లు, భాగస్వామ్య బ్యాంకుల నుంచి స్వీప్ ఇన్ లేదా రీఫండ్ లు మినహా మార్చి 15 తర్వాత కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్ లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు మొదలైనవాటిలో ఎలాంటి డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్ అప్ లు అనుమతించబడవని ఆర్ బిఐ శుక్రవారం తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహించే వన్97 కమ్యూనికేషన్స్, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ నోడల్ ఖాతాలను మూసివేసే గడువును మాత్రం ఆర్బీఐ పొడిగించలేదు. వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 2023 మార్చి 31 నాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో 49% వాటాను కలిగి ఉంది. పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ దీని అనుబంధ సంస్థ.

నోడల్ ఖాతా అంటే?

వినియోగదారులు, వ్యాపారులు, పేమెంట్ అగ్రిగేటర్లు, గేట్ వే లు వంటి ఆర్థిక సంస్థల మధ్య నోడల్ ఖాతాలు మధ్యవర్తిగా పనిచేస్తాయి. వ్యాపారులతో లావాదేవీ ముగియడానికి ముందు కస్టమర్ చెల్లింపులను చేస్తాయి. ఖాతాదారులు తమ ఖాతాల నుంచి బ్యాలెన్స్ లను ఉపసంహరించుకోవడానికి లేదా ఉపయోగించడానికి ఎటువంటి ఆంక్షలు లేవని ఆర్బీఐ పునరుద్ఘాటించింది.

Whats_app_banner