వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి NCLT ఆమోదం-viacom 18 star india mega merger deal gets nclt approval ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి Nclt ఆమోదం

వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి NCLT ఆమోదం

Sudarshan V HT Telugu
Aug 30, 2024 10:38 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని వయాకామ్ 18 మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్తుల హోల్డింగ్ కంపెనీ స్టార్ ఇండియాతో విలీన పథకానికి NCLT శుక్రవారం ఆమోదం తెలిపింది.

వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి NCLT ఆమోదం
వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి NCLT ఆమోదం (REUTERS)

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని వయాకామ్ 18 మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్తుల హోల్డింగ్ కంపెనీ స్టార్ ఇండియాతో విలీన పథకానికి NCLT శుక్రవారం ఆమోదం తెలిపింది. గ్లోబల్ మీడియా దిగ్గజం ది వాల్ట్-డిస్నీకి చెందిన వయాకామ్ 18, డిజిటల్ 18, స్టార్ ఇండియా మధ్య ఏర్పాటు చేసిన కాంపోజిట్ స్కీమ్‌ను కిషోర్ వేములపల్లి (గౌరవ సభ్యులు - జ్యుడీషియల్)తో కూడిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఇద్దరు సభ్యుల బెంచ్ ఆమోదించింది.

సీసీఐ తరువాత ఎన్సీఎల్టీ

రిలయన్స్ (reliance) ఇండస్ట్రీస్, ది వాల్ట్ డిస్నీ కో మీడియా ఆస్తుల విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ విలీనంతో రూ. 70,000 కోట్ల విలువైన, దేశంలోనే అతిపెద్దదైన మీడియా సామ్రాజ్యం రూపొందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా, ది వాల్ట్ డిస్నీల విలీనం న్యాయమైనదిగా, సహేతుకమైనదిగా కనిపిస్తుందని, చట్టంలోని ఏ నిబంధనలను ఉల్లంఘించలేదని, ఇది ఏ పబ్లిక్ పాలసీకి విరుద్ధం కాదని తేలిందని ఈ విలీనానికి ఆమోదం తెలుపుతూ ఎన్సీఎల్టీ వ్యాఖ్యానించింది.

22 పేజీల ఆర్డర్

NCLT తన 22 పేజీల సుదీర్ఘ ఆర్డర్‌లో "స్కీమ్ పరంగా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఈ పథకం ప్రభావవంతంగా ఉంటుంది" అని పేర్కొంది. వయాకామ్ 18 అనుబంధ సంస్థ అయిన వయాకామ్ 18, అలాగే రిలయన్స్ గ్రూప్ లోని జియో సినిమా (jio cinema) నుండి మీడియా ఆపరేషన్స్ అండర్‌టేకింగ్‌ను డిజిటల్ 18కి బదిలీ చేయడాన్ని ఈ పథకం ప్రతిపాదించింది. దీని తర్వాత డిజిటల్ 18 నుండి స్టార్ ఇండియాలోకి V18 అండర్‌టేకింగ్‌ను విభజించడం, బదిలీ చేయడం, వెస్టింగ్ చేయడం జరుగుతుంది’’ అని తెలిపింది.