Walt Disney layoffs : వాల్ట్ డిస్నీలో ఉద్యోగాల కోత.. రిక్రూట్మెంట్ నిలిపివేత!
Walt Disney layoffs : వాల్ట్ డిస్నీ సైతం ఉద్యోగాల కోతకు సిద్ధపడింది. దీనితో పాటు రిక్రూట్మెంట్ ప్రక్రియను నిలిపివేసేందుకు నిర్ణయించింది.
Walt Disney layoffs : ఆర్థిక అనిశ్చితి వెంటాడుతున్న నేపథ్యంలో.. వాల్ట్ డిస్నీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. హైరింగ్ ప్రక్రియను నిలిపివేయడంతో పాటు సంస్థలోని కొందరు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధపడింది. డిస్నీ+ స్ట్రీమింగ్ సర్వీసును లాభాల బాట పట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఒక మెమోను విడుదల చేసింది సంస్థ.
కాస్ట్ కటింగ్ పేరుతో..
డిస్నీ డివిజన్ లీడర్స్‌కు.. ఈ మెమోను పంపించారు సంస్థ సీఈఓ బాబ్ చాపెక్. కాస్ట్ కటింగ్ కోసం.. టార్గెటెడ్ హైరింగ్‌ని ఫ్రీజ్ చేస్తున్నట్టు, సిబ్బందిని తగ్గించుకోనున్నట్టు.. ఆ మెమోలో ఆయన పేర్కొన్నారు.
"కొన్ని పరిస్థితులు మా నియంత్రణలో లేవు. కానీ వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే లక్ష్య సాధన కోసం.. మా చేతుల్లో ఉన్న అంశాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తాము. ముఖ్యంగా మా ఖర్చులను తగ్గించుకుంటాము," అని ఆ మెమోలో ఉంది. ముఖ్యమైన పోస్టుల భర్తీ కోసమే రిక్రూట్మెంట్ ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది.
Walt Disney job cuts : కాస్ట్ కటింగ్ ప్రక్రియతో క్వాలిటీ తగ్గదని చాపెక్ అన్నారు. బిజినెస్ ట్రావెల్‌ను కూడా తగ్గించేస్తున్నట్టు.. ట్రిప్స్ విషయంలో ముందస్తు ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. సంస్థ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ప్రస్తుత త్రైమాసిక ఫలితాల సీజన్లో.. వాల్ట్ డిస్నీ ఆదాయం అంచనాలను తప్పింది. స్ట్రీమింగ్ సర్వీసులో భారీ నష్టాలను చూస్తోంది సంస్థ. మంగళవారం సాయంత్రం ఫలితాలు వెలువడగా.. బుధవారం ట్రేడింగ్ సెషన్లో డిస్నీ స్టాక్ 13శాతం మేర పతనమైంది.
డిస్నీ స్ట్రీమింగ్ ఖర్చులపై వాల్ స్ట్రీన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్ట్రీమింగ్ సర్వీసులతో మదుపర్లకు నష్టం రాదని.. సంస్థ నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఐటీలో ఉద్యోగాల కోత..
Meta layoffs 2022 : అమెరికా ఐటీ రంగం నుంచి ఉద్యోగాల కోత వార్తలు భారీగా వినిపిస్తున్నాయి. మెటా వంటి దిగ్గజ సంస్థలు త్రైమాసిక ఫలితాలు అంచనాలను తప్పుతున్నాయి. ఫలితంగా కాస్ట్ కటింగ్‌పై ఎక్కువ దృష్టి సారించాయి కంపెనీలు. ఈ నేపథ్యంలో సంస్థ నుంచి 11వేల మందిని తొలగిస్తున్నట్టు మెటా ఇటీవలే ప్రకటించింది. మొత్తం సిబ్బందిలో ఇది 13శాతంగా ఉండటం గమనార్హం.
Twitter layoffs 2022 : ఇక ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. వస్తూనే భారీ మొత్తంలో ఉద్యోగులను తీసేశారు. ట్విట్టర్ ఇండియాలో 90శాతం మందిని తప్పించినట్టు ఓ నివేదిక బయటకొచ్చింది. సంస్థ వృద్ధికి కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన అంటున్నారు.
సంబంధిత కథనం
టాపిక్