Samsung Galaxy A55 : సామ్సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 ధరల వివరాలు..
శాంసంగ్ గెలాక్సీ ఏ55, శాంసంగ్ గెలాక్సీ ఏ35 ధరల వివరాలు వెల్లడయ్యాయి. దీని ధర, లభ్యత మరియు మరెన్నో తెలుసుకోండి.
Samsung Galaxy A55 price in India : సామ్సంగ్ తన గెలాక్సీ ఏ సిరీస్‌లోని సామ్సంగ్ గెలాక్సీ ఏ55 5జీ, గెలాక్సీ ఏ 35 5జీలను ఇటీవలే ఇండియాలో లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు.. ఈ మోడల్స్‌కి చెందిన ధరలను రివీల్ చేసింది ఈ దిగ్గజ టెక్ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ సామ్సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్స్ ధరలు, ఆఫర్స్, ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సామ్సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్స్- ధరలు..
సామ్సంగ్ గెలాక్సీ ఏ55.. మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి.. ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ లీలాక్, ఆసమ్ నేవీ. ఇక ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ55లో మూడు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు ఉంటాయి. 8 జీబీ + 128 జీబీ ధర రూ.36999, 8 జీబీ + 256 జీబీ ధర రూ.39999, 12 జీబీ + 256 జీబీ ధర వరుసగా రూ.42,999గా ఉన్నాయి.
ఇక సామ్సంగ్ గెలాక్సీ ఏ35.. రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 256 జీబీ. ఇవి వరుసగా రూ .27999- రూ .30999 కు లభిస్తాయి.
Samsung Galaxy A35 price in India : సామ్సంగ్ ఆన్లైన్ స్టోర్, సామ్సంగ్ స్టోర్స్‌తో పాటు వివిధ ఛానెళ్ల ద్వారా ఈ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు త్వరలోనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు.
ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్..
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్స్‌పై.. అదనపు బోనస్‌గా సామ్సంగ్ కాంప్లిమెంటరీ యాక్సెసరీస్, గణనీయమైన బ్యాంక్ డిస్కౌంట్లతో మంచి డీల్‌ను పొందొచ్చు! సామ్సంగ్ గెలాక్సీ ఏ35 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి రూ.1499 విలువైన ఉచిత కార్డ్ స్లాట్ కేస్‌తో పాటు రూ.3000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అదేవిధంగా.. సామ్సంగ్ గెలాక్సీ ఏ55 కొనుగోలుదారులకు అదే బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు రూ .1999 విలువైన కాంప్లిమెంటరీ సిలికాన్ కేస్ లభిస్తుంది.
సామ్సంగ్ గెలాక్సీ ఎ 55 5 జి స్పెసిఫికేషన్స్..
Samsung Galaxy A55 features : సామ్సంగ్ గెలాక్సీ ఏ55లో.. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ వచ్చే 6.6 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. గెలాక్సీ ఏ55లో ఇన్-హైస్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ఉండనుంది. 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్స్ ఇందులో ఉంటాయి. ఇక ఈ సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుందని సంస్థ చెప్పింది.
ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ55 స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రావైడ్, 5ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ రేర్‌లో ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీపై ఈ గ్యాడ్జెట్ పనిచేస్తుంది.
సామ్సంగ్ గెలాక్సీ ఏ35 స్పెసిఫికేషన్లు..
Samsung Galaxy A35 specifications : సామ్సంగ్ గెలాక్సీ ఏ35లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగిన ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ దీని సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుందని సంస్థ చెప్పింది. ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్, 5ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ రేర్‌లో వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉంటుంది. ఇందులో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తోంది.
సంబంధిత కథనం