PM Kisan : మీ ఖాతాలో పీఎం కిసాన్​ డబ్బులు పడాలంటే- ముందు ఇలా చేయాలి..-pm kisan yojana scheme 18th installment on this date all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Pm Kisan : మీ ఖాతాలో పీఎం కిసాన్​ డబ్బులు పడాలంటే- ముందు ఇలా చేయాలి..

PM Kisan : మీ ఖాతాలో పీఎం కిసాన్​ డబ్బులు పడాలంటే- ముందు ఇలా చేయాలి..

Sharath Chitturi HT Telugu
Sep 30, 2024 09:25 AM IST

PM Kisan ekyc : ఇంకొన్ని రోజుల్లో పీఎం కిసాన్​ నిధి యోజన 18వ విడద డబ్బులు రైతుల ఖాతాల్లో పడతాయి. కానీ దాని కన్నా ముందు రైతులు తమ ఈకేవైసీని కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు..

ఇంకొన్ని రోజుల్లో పీఎం కిసాన్​ నిధి డబ్బులు..
ఇంకొన్ని రోజుల్లో పీఎం కిసాన్​ నిధి డబ్బులు.. (MINT_PRINT)

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 5 2024న పీఎం కిసాన్ యోజన పథకం 18వ విడతను విడుదల చేయనున్నారు. ఈ పథకం భారతదేశంలో భూమి ఉన్న అన్ని వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. పీఎం కిసాన్ యోజన పథకం కింద అర్హులైన రైతులందరికీ ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 అందుతాయన్న విషం తెలిసిందే. అయికే ఈ నిధుల కోసం కేవైసీని అప్డేట్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు..

కిసాన్ యోజన తదుపరి విడత ఎప్పుడు?

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 17 వాయిదాలను విడుదల చేసింది. తదుపరి భాగాన్ని పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ 5న విడుదల చేయనుంది.

ఈ ఏడాది జూన్​లో 17వ విడత విడుదల చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్​ఫర్​ (డీబీటీ) విధానాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి కిసాన్​ యోజన నిధులు బదిలీ చేస్తారు.

ఈ పథకం కింద చేరిన రైతులందరూ తమ ఖాతాల్లో డబ్బులు జమ అయినప్పుడు స్టేటస్​ని ఇలా తెలుసుకోవచ్చు…

1. అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్​ని యాక్సెస్ చేయండి. బెనిఫిషియరీ స్టేటస్ పేజీకి వెళ్లండి.

2. బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్​పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ వంటి వివరాలను యాడ్ చేయాలి.

3. "గెట్​ డేటా" బటన్​పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ బెనిఫిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.

4. పేమెంట్​ స్టేటస్​ని వెరిఫై చేసిన తర్వాత మీ రిక్వెస్ట్​ ప్రాసెస్​ అవుతుంది.

పీఎం కిసాన్ యోజన అర్హత..

ఈ పథకం కింద తమ పేరు మీద సాగు భూమి ఉన్న భూస్వామ్య రైతు కుటుంబాలు అర్హులు. 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ పథకంతో ప్రయోజనాలను పొందవచ్చు.

పీఎం కిసాన్ యోజన కేవైసీ ఫార్మాలిటీస్..

పీఎం కిసాన్ యోజన పథకం కింద అర్హులైన రైతులందరూ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈకేవైసీ) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

పీఎం కిసాన్ స్కీమ్​లో చేరిన రైతులకు ఈకేవైసీ వెరిఫికేషన్​ కోసం మూడు ఆప్షన్స్​ అందుబాటులో ఉన్నాయి. అవి.. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ, బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ, ఫేస్ అథెంటికేషన్ ఆధారిత ఈ-కేవైసీ.

ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ: ఎలా ఎంచుకోవాలి

1. పీఎం-కిసాన్ యోజన వెబ్సైట్​ని సందర్శించి, ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లోకి వెళ్లి ఈ-కేవైసీ ఆప్షన్ ఎంచుకోండి.

2. మీ ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దీని తరువాత, వెరిఫికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కి వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీప) వస్తుంది.

3. ఓటీపీ ఎంటర్ చేస్తే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.

సంబంధిత కథనం