DA hike news : డీఏ పెంపుపై కేంద్రం ఎప్పుడు ప్రకటన చేస్తుంది? ఈసారి ఎంత హైక్​ ఉంటుంది?-when is dearness allowance da hike announced for central government employees ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Da Hike News : డీఏ పెంపుపై కేంద్రం ఎప్పుడు ప్రకటన చేస్తుంది? ఈసారి ఎంత హైక్​ ఉంటుంది?

DA hike news : డీఏ పెంపుపై కేంద్రం ఎప్పుడు ప్రకటన చేస్తుంది? ఈసారి ఎంత హైక్​ ఉంటుంది?

Sharath Chitturi HT Telugu
Sep 30, 2024 07:20 AM IST

DA hike central government employees : డీఏ పెంపు ప్రకటనపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ కొనసాగుతోంది. ఈ విషయంపై ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేస్తుంది? ఈసారి డీఏ పెంపు ఎంత ఉండొచ్చు? ఇక్కడ తెలుసుకోండి..

డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వస్తుంది?
డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వస్తుంది? (AFP)

డియర్నెస్ అలొవెన్స్ డీఏ పెంపు వార్త కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ కొనసాగుతోంది. ఈ విషయంపై కేంద్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. వివిధ మీడియా కథనాల ప్రకారం.. డీఏ పెంపుపై అక్టోబర్​లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ వార్తలపై అధికారులు ఇంకా స్పందించలేదు. సాధారణంగా డీఏ పెంపు ప్రకటన దీపావళి సమయంలోనే ఉంటుంది. పలు మీడియా నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి 3 నుంచి 4శాతం డీఏ పెంపు మాత్రమే ఉంటుంది!

2023లో డీఏ పెంపును ఎప్పుడు ప్రకటించారు?

గతేడాది అక్టోబర్ మొదటి వారంలో డీఏ పెంపును ప్రకటించారు. ఈసారి సెప్టెంబర్​లోనే డీఏ పెంపు ప్రకటన ఉంటుందని అందరు భావించారు. కానీ అలా జరగలేదు. ఫలితంగా అక్టోబర్​ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

అసలు డియర్నెస్ అలొవెన్స్ (డీఏ) అంటే ఏంటి?

డియర్నెస్ అలొవెన్స్ (డీఏ) అనేది ఉద్యోగుల జీవన వ్యయంపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పూడ్చడానికి చెల్లించడానికి ఉపయోగపడే ఒక సాధనం. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్​లో మార్పులను లెక్కించడానికి ఇది సాధారణంగా ప్రతి ఆరు నెలలకు సర్దుబాటు అవుతుంది. డీఏ పెంపుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధిచేకూరుతుంది.

న్యూస్ 18 నివేదిక ప్రకారం.. నెలవారీ వేతనం రూ .30,000, అందులో మూల వేతనం రూ .18,000గా ఉన్న వారు ప్రస్తుతం రూ .9,000 డియర్నెస్ అలొవెన్స్ (డీఏ) పొందుతున్నారు. ఇది వారి మూల వేతనంలో 50%. 

ప్రస్తుత పరిస్థితి:

  • మూలవేతనం: రూ.18,000
  • కరెంట్ డీఏ: రూ.9,000

డీఏలో 3 శాతం పెంపు ఉంటే..

  • కొత్త డీఏ = రూ.9,000 + రూ.540 (ఇది రూ.18,000లో 3 శాతం)
  • సవరించిన డీఏ: రూ.9,540

డీఏలో 4 శాతం పెంపు ఉంటే:

  • కొత్త డీఏ = రూ.9,000 +రూ.9,000

ఏడాదికి రెండుసార్లు డీఏ పెంపు ఉంటుంది. జనవరికి సంబంధించిన డీఏ పెంపు ప్రకటన తరచుగా మార్చ్​ హోలీ సమయంలో ఉంటుంది. జులైకి సంబంధించిన డీఏ పెంపు ప్రకటనలను దీపావళికి దగ్గరగా చేస్తూ వస్తోంది కేంద్రం ప్రభుత్వం. ఇలా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డియర్నెస్ రిలీఫ్​ని ఏడాదికి రెండుసార్లు పెంచుతుంది.

వీడీఏ పెంపు..

పండగ సీజన్​ నేపథ్యంలో అసంఘటిత సెక్టార్​లోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని వీడీఏ (వేరియెబుల్​ డియర్​నెస్​ అలొవెన్స్​)ని పెంచుతున్నట్టు ఇటీవలే ప్రకటించింది. 2024 అక్టోబర్ 1న ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ తాజా చర్యల కారణంగా లక్షలాది మంది కార్మికుల కనీస వేతనం పెరగనుంది. ఈ వీడిఏ పెంపుతో భవన నిర్మాణం, లోడింగ్​-అన్​లోడింగ్​, పారిశుద్ధ్యం, హౌస్​కీపింగ్​, మైనింగ్​, వ్యవసాయ రంగాల్లోని వర్కర్లు లబ్ధిపొందనున్నారు. 2024లో వర్కర్ల జీతాల సవరణ ఇది రెండోసారి. ఏప్రిల్​లో ఒకసారి అప్డేట్​ అయ్యింది. పరిశ్రమ వర్కరల కోసం సీపీఐని దృష్టిలో పెట్టుకుని ప్రతియేటా రెండుసార్లు వీడీఏని ప్రభుత్వం సవరిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం