festival offers on bikes : కొత్త 2 వీలర్​ కొనాలా? పండుగ సీజన్​లో వీటిపై క్రేజీ ఆఫర్స్​..-planning to buy a two wheeler check these festival offers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Planning To Buy A Two-wheeler Check These Festival Offers

festival offers on bikes : కొత్త 2 వీలర్​ కొనాలా? పండుగ సీజన్​లో వీటిపై క్రేజీ ఆఫర్స్​..

Sharath Chitturi HT Telugu
Oct 27, 2023 12:01 PM IST

festive offers on bikes : ఆటోమొబైల్​ సంస్థలు అనేక పండుగ ఆఫర్స్​ని ఇస్తున్నాయి. ఫలితంగా చాలా 2 వీలర్ మోడల్స్​.. తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఆ వివరాలు..

కొత్త 2 వీలర్​ కొనాలా? పండుగ సీజన్​లో వీటిపై క్రేజీ ఆఫర్స్​..
కొత్త 2 వీలర్​ కొనాలా? పండుగ సీజన్​లో వీటిపై క్రేజీ ఆఫర్స్​..

Festive offers on bikes : కొత్తగా 2 వీలర్​ కొనాలని చూస్తున్నారా? అయితే.. దేశంలో ఇప్పుడు నడుస్తున్న పండుగ సీజన్​ రైట్​ టైమ్​! అనేక సంస్థలు.. కస్టమర్లను ఆకర్షించే విధంగా.. పలు ఎగ్జైటింగ్​ ఆఫర్స్​, డిస్కౌంట్స్​ని ఇస్తున్నాయి. క్యాష్​ డిస్కౌంట్స్​, ఎక్స్​ఛేంజ్​ బోనస్​, యాక్సెసరీస్​- ఫైనాన్సింగ్​ ఆఫర్స్​ అంటూ.. భారీగానే ప్లాన్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆటోమొబైల్​ మార్కెట్​లోని పలు ప్రముఖ సంస్థలు, అవి ఇస్తున్న ఆఫర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

ఈ 2 వీలర్స్​పై మంచి ఆఫర్స్​..!

హీరో మోటోకార్ప్​:- పండుగ సీజన్​లో 'గిఫ్ట్​' ప్రోగ్రామ్​ని మొదలుపెట్టింది హీరో మోటోకార్ప్​. గిఫ్ట్​ అంటే.. గ్రాండ్​ ఇండియన్​ ఫెస్టివల్​ ఆఫ్​ ట్రస్ట్​. హీరో స్ల్పెండర్​ ప్లస్​ బైక్​.. సంస్థకు ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటి. ఈ 2 వీలర్​పై.. 'బై నౌ పే ఇన్​ 2024' ఆఫర్​ ఇస్తోంది. అంటే.. ఈ వెహికిల్​ని ఈ పండుగ సీజన్​లో కొన్నప్పటికీ, ఈఎంఐలు మాత్రం 2024 నుంచే మొదలవుతాయి! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

హార్లీ డేవిడ్​సన్​:- పలు ఎంపిక చేసిన మోడల్స్​పై ఈసారి.. రూ. 5.25లక్షల వరకు డిస్కౌంట్స్​ ఇస్తోంది సంస్థ. వీటిల్లో.. హార్లీ డేవిడ్​సన్​ పాన్​ అమెరికా 1250 స్పెషల్​, స్పోర్ట్​స్టర్​ ఎస్​, నైట్​స్టర్​ బైక్​ మోడల్స్​ ఉన్నాయి. 2023 మోడల్స్​ రేంజ్​కు ఈ ఆఫర్స్​ వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Festival offers on scooters : ఆంపియర్​ ఎలక్ట్రిక్​:- గో ఎలక్ట్రిక్​ ఫెస్ట్​ పేరుతో పలు ఆసక్తికర ఆఫర్స్​ ఇస్తోంది ఈ సంస్థ. మాగ్నస్​ ఈఎక్స్​, ప్రైమస్​ ఈ-స్కూటర్లకు ఈ ఆఫర్స్​ వర్తిస్తాయి. గో- ఎలక్ట్రిక్​ వీల్​ని స్పిన్​ చేసి, కస్టమర్లు పలు ఎగ్జైటింగ్​ ఆఫర్స్​ని పొందొచ్చు. మాగ్నస్​ ఈఎక్స్​పై రూ. 10వేలు, ప్రైమస్​పై రూ. 14వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తోంది. అక్టోబర్​ 31 వరకు ఈ డిస్కౌంట్స్​ ఉంటాయి. ఆ తర్వాత.. అవి రూ. 6వేలు, రూ. 10వేలకు తగ్గుతాయి.

ఇదీ చూడండి:- Ola Electric : ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఫ్రీగా కావాలా? ఇదే మంచి ఛాన్స్​!

బజాజ్​ ఆటో:- చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​పై మంచి ఆఫర్స్​ ఇస్తోంది బజాజ్​ ఆటో. కానీ ఇవి తమిళనాడు, కర్ణాటకకు మాత్రమే పరిమితం! అర్హత పొందిన కస్టమర్లు.. చేతక్​ ఎలక్ట్రిక్​ని రూ. 1.15లక్షలకే (ఎక్స్​షోరూం ధర) దక్కించుకోవచ్చు. అంతకుముందు ఈ ధర రూ. 1.30లక్షలుగా ఉండేది.

Festival offers on 2 wheelers : హెచ్​ఓపీ ఎలక్ట్రిక్​:- స్కూటర్స్​, బైక్స్​పై మంచి ఆఫర్స్​ ఇస్తోంది ఈ సంస్థ. ఈఎంఐ ఆప్షన్​తో రూ. 69వేలకే ఈ సంస్థ స్కూటర్లను పొందొచ్చు! హాప్​ ఓఎక్స్​ఓ ఎలక్ట్రిక్​ బైక్​ని నెలకు రూ. 3,499 ఈఎంతో కొనుగోలు చేసుకోవచ్చు. జీరో పర్సెంట్​ డౌన్​పేమెంట్​తో పాటు రూ. 5,100వరకు బెనిఫిట్స్​ సైతం మీరు పొందొచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం