Harley Davidson : ఈ హార్లీ డేవిడ్​సన్​ బైక్స్​పై క్రేజీ డిస్కౌంట్స్​.. ఇదే మంచి ఛాన్స్​!-harley davidson india rolls out massive discounts on select bikes ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Harley Davidson : ఈ హార్లీ డేవిడ్​సన్​ బైక్స్​పై క్రేజీ డిస్కౌంట్స్​.. ఇదే మంచి ఛాన్స్​!

Harley Davidson : ఈ హార్లీ డేవిడ్​సన్​ బైక్స్​పై క్రేజీ డిస్కౌంట్స్​.. ఇదే మంచి ఛాన్స్​!

Sharath Chitturi HT Telugu
Oct 24, 2023 06:30 PM IST

Harley Davidson : హార్లీ డేవిడ్​సన్​కు చెందిన పలు బైక్స్​పై ఇండియాలో మంచి డిస్కౌంట్స్​ లభిస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం..

ఈ హార్లీ డేవిడ్​సన్​ బైక్స్​పై క్రేజీ డిస్కౌంట్స్​!
ఈ హార్లీ డేవిడ్​సన్​ బైక్స్​పై క్రేజీ డిస్కౌంట్స్​!

Huge discounts on Harley Davidson bikes : హార్లీ డేవిడ్​సన్​ బైక్​ కొనాలని ప్లాన్​ చేస్తున్న వారికి ఇదే సరైన సమయం! పలు ఎంపిక చేసిన బైక్స్​పై క్రేజీ డిస్కౌంట్స్​ ఇస్తోంది ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఈ హార్లీ డేవిడ్​సన్​ బైక్స్​పై ఆఫర్స్​..

పలు ఎంపిక చేసిన మోడల్స్​పై ఈసారి.. రూ. 5.25లక్షల వరకు డిస్కౌంట్స్​ ఇస్తోంది సంస్థ. వీటిల్లో.. హార్లీ డేవిడ్​సన్​ పాన్​ అమెరికా 1250 స్పెషల్​, స్పోర్ట్​స్టర్​ ఎస్​, నైట్​స్టర్​ బైక్​ మోడల్స్​ ఉన్నాయి. 2023 మోడల్స్​ రేంజ్​కు ఈ ఆఫర్స్​ వర్తిస్తాయి.

మరీ ముఖ్యంగా.. 2023 హార్లీ డేవిడ్​సన్​ పాన్​ అమెరికా 1250 స్పెషల్​పై రూ. 3.25లక్షలకు బెనిఫిట్స్​ పొందొచ్చు. ఫలితంగా.. ఈ బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 21.24లక్షలకు దిగొచ్చింది. ఈ మోడల్​ వాస్తవ ఎక్స్​షోరూం ధర రూ. 24.49లక్షలు. ఇందులో 1,252సీసీ ట్విన్​ సిలిండర్​, లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 150.9 బీహెచ్​పీ పవర్​ను, 128 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక ఇప్పుడు.. ఇండియా మార్కెట్​లో అందుబాటులో ఉన్న డుకాటీ మల్టీస్ట్రాడా వీ4, ట్రయంఫ్​ టైగర్​ 1200, బీఎండబ్ల్యూ ఆర్​ 1250 జీఎస్​ వంటి 2 వీలర్స్​కు ఈ బైక్​ గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:- Ather Energy : ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​పై క్రేజీ ఫెస్టివల్​ ఆఫర్స్​.. మిస్​ అవ్వకండి!

Harley Davidson bikes offers : అదే విధంగా.. 2023 హార్లీ డేవిడ్​సన్​ స్పోర్ట్​స్టర్​ ఎస్​పై రూ. 3.25లక్షల డిస్కౌంట్​ వస్తోంది. ఫలితంగా ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 18.79లక్షల నుంచి రూ. 15.54లక్షలకు చేరింది. ఈ మోడల్​లో కూడా 1,252సీసీ ట్విన్​ సిలిండర్​, లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. కాకపోతే ఇది 121 బీహెచ్​పీ పవర్​ను, 125 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

చివరిగా.. 2023 హార్లీ డేవిడ్​సన్​ నైట్​స్టర్​పై అత్యధికంగా రూ. 5.25లక్షల వరకు బెనిఫిట్స్​ పొందే అవకాశం మీ సొంతం! రూ. 17.63లక్షలుగా ఉండాల్సిన ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర.. ఆఫర్స్​ తర్వాత రూ. 12.24లక్షలకు పడింది. ముఖ్యంగా.. ఈ నైట్​స్టర్​ మోడల్​ గతేడాదే ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 975 సీసీ, ట్విన్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 89 బీహెచ్​పీ పవర్​ను, 95 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

Harley Davidson bikes festival offers : ఈ పండుగ సీజన్​లో.. హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 మోడల్​పై ఎలాంటి ఆఫర్స్​ ఇవ్వట్లేదు సంస్థ.

WhatsApp channel

సంబంధిత కథనం