Harley Davidson new bike : అతి చౌకైన హార్లీ డేవిడ్​సన్​ బైక్​ వచ్చేస్తోంది..!-affordable harley davidson bike in works check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Harley Davidson New Bike : అతి చౌకైన హార్లీ డేవిడ్​సన్​ బైక్​ వచ్చేస్తోంది..!

Harley Davidson new bike : అతి చౌకైన హార్లీ డేవిడ్​సన్​ బైక్​ వచ్చేస్తోంది..!

Sharath Chitturi HT Telugu
Sep 25, 2023 11:49 AM IST

Harley Davidson new bike : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోకి హార్లీ డేవిడ్​సన్​ నుంచి అతి చౌకైన బైక్​ ఒకటి రాబోతోందని తెలుస్తోంది. దీని పేరు హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​ 210. ఈ బైక్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

అతి చౌకైన హార్లీ డేవిడ్​సన్​ బైక్​ వచ్చేస్తోంది..!
అతి చౌకైన హార్లీ డేవిడ్​సన్​ బైక్​ వచ్చేస్తోంది..!

Harley Davidson new bike : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హార్లీ డేవిడ్​సన్​.. ఇండియాన్​ మార్కెట్​పై ఫోకస్​ చేసినట్టు కనిపిస్తోంది. హీరో మోటోకార్ప్​తో కలిసి ఎక్స్​ 440 రోడ్​సర్ట్​ను ఇటీవలే ఇండియాలో లాంచ్​ చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు మరో బైక్​ను సిద్ధం చేస్తోందని సమచారం. దీని పేరు హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​ 210 అని తెలుస్తోంది. ఇండియాలో సంస్థ చరిత్రలోనే ఇది అతి చౌకైన మోటర్​సైకిల్​గా నిలిచిపోతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక రాజస్థాన్​ జైపూర్​లో ఈ వెహికిల్​కి సంబంధించిన టెస్ట్​ డ్రైవ్​ కూడా జరిగింది! ఈ నేపథ్యంలో బైక్​ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాము..

హార్లీ డేవిడ్​సన్​ కొత్త బైక్​ ఎలా ఉంటుంది..?

రూమర్స్​ ప్రకారం.. ఈ హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​ 210 డిజైన్​.. ఎక్స్​ 440ని పోలి ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే.. ఎక్స్​ 440కి ఇది మినీ వర్షెన్​గా కూడా ఉండొచ్చని టాక్​ నడుస్తోంది. ఇందులో హీరో మోటోకార్ప్​కు చెందిన 210 సీసీ, లిక్విడ్​ కూల్డ్​, డీఓహెచ్​సీ, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉండొచ్చు. ఇటీవలే లాంచ్​ అయిన హీరో కరిష్మా ఎక్స్​ఎంఆర్​ 210లో ఇదే ఇంజిన్​ ఉంది. ఈ ఇంజిన్​.. 25 హెచ్​పీ పవర్​ను, 204. ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. కొత్త బైక్​కి కూడా 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ లభించొచ్చు.

Harley Davidson X 210 price in India : సబ్​-300 సీసీ సెగ్మెంట్​కు ఇండియాలా కనిపిస్తున్న డిమాండ్​ను క్యాష్​ చేసుకోవాలని హార్లీ డేవిడ్​సన్​ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మార్కెట్​లో పోటీని తట్టుకునే విధంగా.. కాస్త తక్కువ ధరకు ఈ బైక్​ను తీసుకురావాలని ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం.

ఇదీ చూడండి:- Royal Enfield Scram 440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440కి ధీటుగా రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​!

ఈ బైక్​ ధర ఎంత ఉండొచ్చు..?

ఇండియాలో హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​ 440 ఎక్స్​షోరూం ధర రూ. 2.39లక్షలు- రూ. 2.69లక్షల మధ్యలో ఉంది. ఇక కొత్త ఎక్స్​ 210 బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.8లక్షలకు అటు, ఇటుగా ఉండొచ్చని సమాచారం. ధర ఇదే విధంగా ఉంటే మాత్రం.. బైక్​ లవర్స్​ను కచ్చితంగా ఆకర్షిస్తుందని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి.

Harley Davidson X 210 India launch : అయితే.. ఈ బైక్​ గురించి సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం రూమర్స్​ మాత్రమే వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం