Hero Karizma XMR 210 : హీరో కొత్త బైక్ లాంచ్.. కరిష్మా ఎక్స్ఎంఆర్ 210 ఎలా ఉందంటే..
Hero Karizma XMR 210 : హీరో కరిష్మా ఎక్స్ఎంఆర్ 210 లాంచ్ అయ్యింది. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
Hero Karizma XMR 210 launch : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్.. ఇండియా మార్కెట్లోకి సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది. దీని పేరు హీరో కరిష్మా ఎక్స్ఎంఆర్ 210. ఈ నేపథ్యంలో ఈ బైక్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త బైక్ ఫీచర్స్ ఇవే..!
హీరో కరిష్మా ఎక్స్ఎంఆర్ డిజైన్ అట్రాక్టివ్‌గా ఉందని చెప్పుకోవాలి. ఇందులో వైడ్ హ్యాండిల్ల్యాంప్, ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అలాయ్ వీల్స్, విజర్, స్ల్పిట్ సీట్, ఎక్స్ఎంఆర్ బ్యాడ్జింగ్ వంటివి వస్తున్నాయి.
ఈ కొత్త బైక్‌లో 210సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ డీఓహెచ్సీ 4వీ ఇంజిన్ ఉంటుంది. ఇది 25.5 హేచ్పీ పవర్‌ను, 20.4 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ దీని సొంతం. మూడు రంగుల్లో ఈ బైక్ అందుబాటులోకి రానుంది. అవి.. బ్లాక్, యెల్లో, రెడ్
Hero Karizma XMR features : ఈ 2 వీలర్లో 6 స్టెప్ మోనోషాక్ సస్పెన్షన్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్, టర్న్-బై-టర్న్ నేవిగేషన్, అడ్జెస్టెబుల్ విండ్‌షీల్డ్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌లు వంటివి వస్తున్నాయి.
"మూడు నెలల్లో కంపెనీ నుంచి వస్తున్న మూడో ప్రీమియం మోడల్ ఈ హీరో కరిష్మా ఎక్స్ఎంఆర్ 210. దీనికి మంచి డిమాండ్ లభిస్తుందని నమ్మకం ఉంది. యువతను అట్రాక్ట్ చేసే విధంగా దీనిని రూపొందించాము. రానున్న రోజుల్లో మరిన్ని మోడల్స్‌ను లాంచ్ చేస్తాము," అని కొత్త బైక్ లాంచ్ ఈవెంట్లో సంస్థ సీఈఓ నిరంజన్ గుప్త వ్యాఖ్యానించారు.
ధర ఎంతంటే..
Hero Karizma XMR price in India : హీరో కరిష్మా ఎక్స్ఎంఆర్ ఇంట్రొడక్టరీ ప్రైజ్ రూ. 1.73లక్షలుగా ఉంది. వాస్తవానికి ఈ ధర రూ. 2.3లక్షలు- రూ. 2.5లక్షల మధ్యలో ఉంటుందని మర్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఈ మోడల్ బుకింగ్స్ మంగళవారం ఓపెన్ అయ్యాయి.
ఇంట్రొడక్టరీ ఆఫర్ ముగిసిన తర్వాత.. ఈ బైక్ ఎక్స్‌షోరూం ధర రూ. 2లక్షల వరకు వెళ్లొచ్చు. కాగా.. ఇప్పటివరకు సంస్థ నుంచి వచ్చిన ప్రీమియం బైక్స్‌లో అత్యంత ఎక్కువ ధర కలిగిన బైక్‌గా ఈ మోడల్ నిలిచిపోనుంది.
ది బెస్ట్ బైక్ ఇదే : హృతిక్ రోషన్..
హీరో కరిష్మా ఎక్స్ఎంఆర్ 210కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రముఖ సినీ నటుడు హృతిక్ రోషన్.. ఈవెంట్ స్టేజ్‌పైకి బైక్‌పై వచ్చారు. ఈ బైక్ మీద రైడ్ చాలా బాగుందని, మరే ఇతర బైక్ కూడా దీనికి పోటీరాదని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో.. 'ఇతర బైక్స్‌తో పోల్చుకుంటే, ఈ బైక్ హృతిక్ రోషన్ లాంటిది,’ అని అన్నారు నిరంజన్ గుప్త.
సంబంధిత కథనం