Oppo Find X8 : మార్కెట్‌లోకి రానున్న ఒప్పో కొత్త ఫోన్.. అక్టోబర్ 24న ఫైండ్ ఎక్స్8 సిరీస్ లాంచ్
Oppo Find X8 : ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 సిరీస్‌ను అక్టోబర్ 24న చైనాలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఆల్ న్యూ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ కలిగి ఉంటుందని ధృవీకరించింది.

ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్‌కు సిద్ధమైంది. ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్‌ను అక్టోబర్ 24న చైనాలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఒప్పో ఫైండ్ ఎక్స్ 8, ఫైండ్ ఎక్స్ 8 ప్రో, ఫైండ్ ఎక్స్ 8 ప్రో శాటిలైట్ కమ్యూనికేషన్ వెర్షన్ వంటి అనేక మోడళ్లు రానున్నాయి. ఈ లైనప్‌లో ఫైండ్ ఎక్స్ 8 అల్ట్రా కూడా ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు. అల్ట్రా మోడల్ 2025 జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
లీకైన ఫోటోలలో ఫైండ్ ఎక్స్ 8 సిరీస్ వెనుక భాగంలో రౌండ్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. ప్రో మోడల్ డ్యూయల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని, స్టాండర్డ్ మోడల్ సింగిల్ పెరిస్కోప్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఐఫోన్ 16 సిరీస్ తరహా కెమెరా కంట్రోల్ బటన్ కూడా ఉండనుంది.
ఫైండ్ ఎక్స్ 8 సిరీస్‌లో ముందు భాగంలో మైక్రో క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. ఈ మొత్తం లైనప్ 50 వాట్ మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుందని, కలర్ఓఎస్ 15 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుందని తెలుస్తోంది . రెనో 12 సిరీస్ మాదిరిగానే ఫైండ్ ఎక్స్ 8 మోడల్ కూడా బీకాన్ లింక్ అనే ఆఫ్-నెట్వర్క్ కమ్యూనికేషన్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నారు.
ఇందులో హై-పెర్ఫార్మెన్స్ కార్టెక్స్-ఎక్స్ 925 కోర్, 3.62 గిగాహెర్ట్జ్, మూడు కార్టెక్స్-ఎక్స్ 4 కోర్లు, నాలుగు కార్టెక్స్-ఎ720 కోర్లు ఉన్నాయి. మునుపటి తరంతో పోలిస్తే ఈ కాన్ఫిగరేషన్ సింగిల్-కోర్ పనితీరును 35 శాతం, మల్టీ-కోర్ పనితీరును 28 శాతం పెంచుతుంది.
ఈ ఫోన్ వినియోగదారులకు అధిక పనితీరుతో పాటు ఎక్కువ బ్యాటరీ జీవితకాలం లభిస్తుంది. ఫైండ్ ఎక్స్ 8 సిరీస్‌ను కూడా త్వరలో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఫైండ్ ఎక్స్ 8, ఎక్స్ 8 ప్రో కూడా భారతదేశం, ఇండోనేషియా, థాయ్ లాండ్ వంటి దేశాలలో సర్టిఫై అయ్యాయి.