OPPO Find X7 : లాంచ్​కి ముందే ఒప్పో ఫైండ్​ ఎక్స్​7 కీలక ఫీచర్స్​ లీక్​!-oppo find x7s key specifications leaked ahead of launch check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo Find X7 : లాంచ్​కి ముందే ఒప్పో ఫైండ్​ ఎక్స్​7 కీలక ఫీచర్స్​ లీక్​!

OPPO Find X7 : లాంచ్​కి ముందే ఒప్పో ఫైండ్​ ఎక్స్​7 కీలక ఫీచర్స్​ లీక్​!

Sharath Chitturi HT Telugu
Nov 18, 2023 09:00 AM IST

OPPO Find X7 : లాంచ్​కి ముందే ఒప్పో ఫైండ్​ ఎక్స్​7 కీలక ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

లాంచ్​కి ముందే ఒప్పో ఫైండ్​ ఎక్స్​7 కీలక ఫీచర్స్​ లీక్​!
లాంచ్​కి ముందే ఒప్పో ఫైండ్​ ఎక్స్​7 కీలక ఫీచర్స్​ లీక్​! (representative image)

OPPO Find X7 : ఒప్పో సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్ సిరీస్​​ లాంచ్​కి సిద్ధమవుతోంది. దీని పేరు ఒప్పో ఫైండ్​ ఎక్స్​7. కాగా.. లాంచ్​కి ముందు ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

ఒప్పో కొత్త స్మార్ట్​ఫోన్​..

ఒప్పో ఫైండ్​ ఎక్స్​6కి.. ఈ ఒప్పో ఫైండ్​ ఎక్స్​7 సక్సెసర్​గా వస్తోంది. పలు లీక్స్​ ప్రకారం.. ఇందులో 120హెచ్​జెడ్​ డిస్​ప్లే, ఆండ్రాయిడ్​ 14 ఆధారిత కలర్​ఓఎస్​ 14 యూఐ వంటివి ఉంటాయి.

OPPO Find X7 pro : వీటికి తోడు.. ఎక్స్​ 7 సిరీస్​లో సరికొత్త హైపర్​టోన్​ కెమెరా ఉంటుందని, శాటిలైట్​ కనెక్టివిటీ ఫీచర్స్​ ఉంటాయని ఒప్పో సంస్థే ప్రకటించింది. ఇక ఈ సిరీస్​లో ఒప్పో ఫైండ్​ ఎక్స్​7, ఒప్పో ఫైండ్​ ఎక్స్​7 ప్రో మోడల్స్​ ఉంటాయని టాక్​ నడుస్తోంది.

ఒప్పో ఫైండ్​ ఎక్స్​7 ప్రో మోడల్​లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 చిప్​సెట్​ ఉండొచ్చు. సోనీ సరికొత్త 1 ఇంచ్​ ఎల్​వైటీ-900 కెమెరా సెన్సార్​ ఇందులో ఉంటుందని టాక్​!

ఒప్పో ఫైండ్​ ఎక్స్​7 లాంచ్​ ఎప్పుడు..?

OPPO Find X7 pro price : ఈ ఒప్పో కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ లాంచ్​ డేట్​పై ప్రస్తుతం క్లారిటీ లేదు. కాగా.. ఈ గ్యాడ్జెట్​.. చైనాలో 2024 తొలి త్రైమాసికంలో లాంచ్​ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

ఈ మోడల్​ ఇతర ఫీచర్స్​, ధర వంటి వివరాలపై రానున్న రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఒప్పో రెనో 11 కూడా వస్తోంది..!

Oppo Reno 11 launch : రెనో 11 సిరీస్​ని ఒప్పో సంస్థ తయారు చేస్తున్న సమాచారం. చైనా మార్కెట్​లో లాంచ్​కు ఈ సిరీస్​ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ నెల 23న చైనాలో ఓ ఈవెంట్​ ఉంటుందని, ఇందులో లాంచ్​ అయ్యే గ్యాడ్జెట్​ ఈ ఒప్పో రెనో 11 సిరీస్​ అని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

ఆన్​లైన్​లో లీక్​ అయిన డేటా ప్రకారం..​ ఈ ఒప్పో రెనో 11 సిరీస్​ డిజైన్​.. ఈ ఏడాది తొలినాళ్లల్లో లాంచ్​ అయిన ఒప్పో రెనో 10ని పోలి ఉంటుంది. ఇక త్వరలో రాబోతున్న స్మార్ట్​ఫోన్​ రేర్​లో ఎలిప్టికల్​ కెమెరా మాడ్యూల్​ ఉంటుంది. రెండు కెమెరా రింగ్స్​ ఉంటాయి. టాప్​ కెమెరా రింగ్​లో 2 కెమెరా సెన్సార్​లు, రెండొవ రింగ్​లో మూడో లెన్స్​ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం