Oppo Reno 11 : లాంచ్​కు రెడీ అవుతున్న ఒప్పో రెనో 11 సిరీస్​.. ఫీచర్స్​ ఇవేనా?-oppo reno 11 series features leaked check details here ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Oppo Reno 11 Series Features Leaked Check Details Here

Oppo Reno 11 : లాంచ్​కు రెడీ అవుతున్న ఒప్పో రెనో 11 సిరీస్​.. ఫీచర్స్​ ఇవేనా?

Sharath Chitturi HT Telugu
Nov 10, 2023 01:40 PM IST

Oppo Reno 11 : ఒప్పో రెనో 11 సిరీస్​.. లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్​లోని స్మార్ట్​ఫోన్స్​కు చెందిన ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

ఒప్పో రెనో 11 సిరీస్​..
ఒప్పో రెనో 11 సిరీస్​.. (Representative image)

Oppo Reno 11 : రెనో 11 సిరీస్​ని ఒప్పో సంస్థ తయారు చేస్తున్న సమాచారం. చైనా మార్కెట్​లో లాంచ్​కు ఈ సిరీస్​ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ నెల 23న చైనాలో ఓ ఈవెంట్​ ఉంటుందని, ఇందులో లాంచ్​ అయ్యే గ్యాడ్జెట్​ ఈ ఒప్పో రెనో 11 సిరీస్​ అని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటి మధ్య.. ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన కీలక​ ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

ట్రెండింగ్ వార్తలు

ఒప్పో రెనో 11 సిరీస్​ ఫీచర్స్​ ఇవేనా?

ఆన్​లైన్​లో లీక్​ అయిన డేటా ప్రకారం..​ ఈ ఒప్పో రెనో 11 సిరీస్​ డిజైన్​.. ఈ ఏడాది తొలినాళ్లల్లో లాంచ్​ అయిన ఒప్పో రెనో 10ని పోలి ఉంటుంది. ఇక త్వరలో రాబోతున్న స్మార్ట్​ఫోన్​ రేర్​లో ఎలిప్టికల్​ కెమెరా మాడ్యూల్​ ఉంటుంది. రెండు కెమెరా రింగ్స్​ ఉంటాయి. టాప్​ కెమెరా రింగ్​లో 2 కెమెరా సెన్సార్​లు, రెండొవ రింగ్​లో మూడో లెన్స్​ ఉన్నాయి.

Oppo Reno 11 pro : ఇక ఈ స్మార్ట్​ఫోన్​లోని ప్రో మోడల్​లో.. కర్వ్​డ్​ ఎడ్జ్​తో కూడిన ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుందట. 1.5కే రిసొల్యూషన్​ దీని సొంతం. ఈ గ్యాడ్జెట్​లో డైమెన్సిటీ స్నాప్​డ్రాగన్​ 8 ప్లస్​ జెన్​ 1 చిప్​సెట్​ ఉండనుందని టాక్​ నడుస్తోంది. ఒప్పో రెనో 10 ప్రో+ లోనూ ఇదే ప్రాసెసర్​ ఉంది.

ఇతర లీక్స్​ ప్రకారం.. ఇక రెనో 11లో డైమెన్సిటీ 8200 చిప్​సెట్​ ఉంటుంది. ఒప్పో రెనో 10 ప్రోలో ఈ ప్రాసెసర్​ని చూడవచ్చు. ఈ బేస్​ వెరియంట్​లోనూ కర్వ్​డ్​ ఎడ్జ్​లతో కూడిన ఓఎల్​ఈడీ ప్యానెల్​ ఉండొచ్చు.

Oppo Reno 11 pro price : ఇక ఈ సిరీస్​లోని రెనో 11, రెనో 11 ప్రో మోడల్స్​లో 32ఎంపీ టెలిఫొటో కెమెరా, 2ఎక్స్​ ఆప్టికల్​ జూమ్​ వంటివి వస్తాయి. ఈ రెండిట్లోనూ ప్లాస్టిక్​ మిడల్​ ఫ్రేమ్​ ఉంటుంది.

కాగా.. రెనో 10 ప్రో+ వేరియంట్​లో పెరిస్కోపిక్​ టెలిఫొటో కెమెరా ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకరాం.. ఒప్పో రెనో 11 సిరీస్​లో ఎలాంటి ప్రో+ ఉండదట! అంటే.. ఈసారి రెండు మోడల్స్​ మాత్రమే లాంచ్​ అవుతాయని తెలుస్తోంది. అవి.. రెనో 11, రెనో 11 ప్రో. అంటే.. ఈ సిరీస్​లో పెరిస్కోపిక్​ టెలిఫొటో కెమెరా లేనట్టే!

Oppo Reno 11 features : ఈ ఒప్పో కొత్త సిరీస్​కు సంబంధించిన ఇతర ఫీచర్స్​, ధర వంటి వివరాలపై ప్రస్తుతం సమాచారం లేదు. సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇండియా లాంచ్​పైనా సంస్థ స్పందించాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం