Smartphones Discount : అబ్బాబ్బా ఎన్ని డిస్కౌంట్లో.. 10 వేలలోపు ధరలో 5జీ ఫోన్లు
Smartphones Discount : స్మార్ట్‌ఫోన్ కొనాలి అనుకునేవారికి ఇది మంచి సమయం. చాలా కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు నడుస్తున్నాయి. రూ.10 వేలలోపు ధరతో ఉన్న స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేయండి.
పండుగ సీజన్ రావడంతో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు. కొత్తగా ఫోన్ తీసుకోవాలి అనుకునేవారికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణ సమయంలో ఎక్కువ ధరతో కొనుగోలు చేసే ఫోన్.. ఇప్పుడు తక్కువ ధరకు మీ సొంతం చేసుకోవచ్చు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో డిస్కౌంట్లతో ఫోన్లు పొందవచ్చు.
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్ మంచి ఆప్షన్స్ అందిస్తోంది. బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో భాగంగా తక్కువ ధరకే ఫోన్లు కొనుక్కోవచ్చు. దీని ప్రయోజనం అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బ్రాండెడ్ 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్‌లో మంచి తగ్గింపుతో లభిస్తాయి. రూ .10,000 కంటే తక్కువకు ఆర్డర్ చేయవచ్చు. ఇందులో కొన్ని ఫోన్ల గురించి చూద్దాం..
రియల్‌మీ సీ63 5జీ
రియల్‌మీ సీ సిరీస్‌కు చెందిన ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఈ ఫోన్‌ను కేవలం రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు.
వివో టీ3 లైట్ 5జీ
కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లతో వివో 5జీ ఫోన్ను రూ.9,499కే కొనుగోలు చేయవచ్చు. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను ఈ ఫోన్ అందిస్తుంది. వివో చౌకైన 5జీ ఫోన్ ఇదే.
మోటరోలా జీ45 5జీ
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వెజిటేరియన్ లెదర్ ఫినిష్ డిజైన్‌తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ ఈ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన 5జీ ఫోన్. ఆఫర్ల కారణంగా రూ.10,000 వరకు ధరకు కొనుగోలు చేయవచ్చు.
పోకో ఎం6 5జీ
50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌తో పోకో ఎం6 5జీ పోకో స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో కేవలం రూ.7,200కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. కస్టమర్లు పాత ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకుంటే అదనపు డిస్కౌంట్లను సద్వినియోగం చేసుకోవచ్చు.
శామ్‌సంగ్
దక్షిణ కొరియా టెక్ బ్రాండ్ శామ్‌సంగ్ ఎ-సిరీస్ ఫోన్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 5జీ ఫోన్లలో శాంసంగ్ ఎ 14 5జీ ఒకటి. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,749గా నిర్ణయించారు.