Tecno Spark 30C 5G : కేవలం రూ.8,999కే 48 ఎంపీ సోనీ కెమెరాతో 5జీ ఫోన్.. వెట్ టచ్ సపోర్ట్
Tecno Spark 30C 5G Launched : టెక్నో స్పార్క్ 30సీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. 5జీ టెక్నాలజీ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్లో వెనకవైపు 48 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంది. తక్కువ ధరలో మార్కెట్‌లోకి వచ్చింది.
టెక్ బ్రాండ్ టెక్నో తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ స్పార్క్ 30సీని భారత మార్కెట్లో విడుదల చేసింది. మంచి స్పెసిఫికేషన్లు, 5జీ కనెక్టివిటీతో బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఆధునిక డిజైన్ కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద డిస్‌ప్లేతో ఈ ఫోన్ వచ్చింది.
స్మూత్ స్క్రోలింగ్, మంచి గేమ్ ప్లే అనుభవాన్ని అందిస్తుంది ఈ ఫోన్. ఐపీ54 రేటింగ్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో వెట్ టచ్ సపోర్ట్ ఉంది. అంటే తేలికపాటి వర్షంలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 582 ఏఐ కెమెరా సెటప్ ఉంది.
5జీ కనెక్టివిటీ కోసం టెక్నో ఫోన్‌లో 10 5జీ బ్యాండ్స్, ఎన్‌ఆర్ సీఏ టెక్నాలజీని సపోర్ట్ చేశారు. ఈ పరికరం మంచి డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ నాలుగేళ్లకు పైగా లాగ్ ఫ్రీ పెర్ఫామెన్స్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా ఐపీ బ్లాస్టర్, ఆల్-డైరెక్షనల్ ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇది 18 W ఛార్జర్‌తో సపోర్ట్ చేసే 5,000 mAh బ్యాటరీని ఉపయోగిస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్‌తో రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 14లో పనిచేస్తుంది. టెక్నో స్పార్క్ 30సీ కొత్త స్మార్ట్ఫోన్ మిడ్‌నైట్ షాడో, అజూర్ స్కై, అరోరా క్లౌడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. కేవలం రూ.8,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో లభ్యం కానుంది.