Redmi Note 12 Discovery Edition । సూపర్ ఫాస్ట్ ఛార్జర్‌తో సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్!
షావోమి నుంచి సరికొత్త Redmi Note 12 Discovery Edition స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. దీని ధర, ఇతర ఫీచర్లను ఇక్కడ చూడండి.
షావోమి యాజమాన్యంలోని మొబైల్ తయారీదారు Redmi తాజాగా, తమ నోట్ 12 సిరీస్‌లో వివిధ మోడళ్లను పరిచయం చేసింది. ఇందులో Redmi Note 12 Discovery Edition అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనిని గతంలో రెడ్‌మి నోట్ 12 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌గా పేర్కొన్నారు. ఇప్పుడు డిస్కవరీ ఎడిషన్‌గా చలామణీలోకి వచ్చింది.
ఈ డిస్కవరీ ఎడిషన్ కూడా దాదాపుగా Redmi Note 12 Pro Plus హార్డ్‌వేర్‌ను కలిగి ఉంది. అయితే స్పెసిఫికేషన్‌లలో స్వల్ప మార్పులు ఉన్నాయి. డిస్కవరీ ఎడిషన్ 4,300 mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. అంటే Redmi Note 12 Pro Plusతో పోలిస్తే 700 mAh తక్కువ. అదే విధంగా దీని బరువు కూడా స్వల్పంగా తక్కువగా ఉంది. ర్యామ్ సామర్థ్యం కూడా ప్రో వెర్షన్ కంటే తక్కువే.
మరోవైపు, డిస్కవరీ ఎడిషన్ 210 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 9 నిమిషాల్లోనే బ్యాటరీని 0% నుండి 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఇంతటి శక్తివంతమైన ఛార్జర్‌తో షావోమి నుంచి వచ్చిన తొలి హ్యాండ్‌సెట్ ఇదే కావడం విశేషం. ఇక మిగతా స్పెసిఫికేషన్లన్నీ దాని ఇతర మోడళ్లతో సమానంగానే ఉన్నాయి.
Redmi Note 12 Discovery Edition ఏకైక 8GB RAM +256GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారితమైన MIUI 13 ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. Discovery Edition స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తున్న ఫీచర్లు, స్పెసిఫికేషన్ల జాబితాను ఒకసారి ఈ కింద పరిశీలించండి.
Redmi Note 12 Discovery Edition స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67-అంగుళాల పూర్తి HD+ OLED డిస్‌ప్లే
- 8GB RAM, 256GB స్టోరేజ్ సామర్థ్యం
- మీడియా డైమెన్సిటీ 1080 ప్రాసెసర్
- వెనకవైపు 200MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్,
- ముందు భాగంలో16 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 4300 mAh బ్యాటరీ సామర్థ్యం, 210W ఫాస్ట్ ఛార్జర్
కనెక్టివిటీ కోసం.. 5G, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, అల్ట్రాసోనిక్ ఉన్నాయి.
డిస్కవరీ ఎడిషన్ ప్రస్తుతం చైనా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అక్కడ దీని ధర CNY 2,399 (సుమారు రూ. 27,200) గా ఉంది. Mi.com ద్వారా ప్రీ-ఆర్డర్‌లు చేయవచ్చు, నవంబర్ 3 నుండి విక్రయాలు ప్రారంభమవుతాయి.
సంబంధిత కథనం