How to track pan card status : మీ పాన్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను ట్రాక్ చేయండి ఇలా..!
How to track pan card status : కొత్తగా పాన్ కార్డుకు అప్లై చేశారా? అయితే మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఇలా ట్రాక్ చేసుకోండి..
How to track pan card status : దేశంలో ఆర్థిక పరమైన లావాదేవీలు చేయడానికి పాన్ కార్డు చాలా ముఖ్యం. ఆధార్ కార్డుతో పాటు ఇప్పుడు చాలా వరకు పాన్ కార్డును కూడా అడుగుతున్నారు. అందుకే ఆధార్- పాన్ కార్డును లింక్ చేయాలని ప్రభుత్వం కూడా చెబుతోంది. ఇందులోని ఆల్ఫా- న్యూమరికల్ కోడ్‌ను ఎవరు డూప్లికేట్ కూడా చేయలేరు. మరి మీరు కొత్తగా పాన్ కార్డుకు అప్లై చేశారా? అయితే.. మీ పాన్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను ఎలా ట్రాక్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
యూటీఐఐటీఎస్ఎల్ ద్వారా..
పాన్ కార్డును యూటీఐఐటీఎస్ఎల్ ద్వారా అప్లై చేసిన వారు.. స్టేటస్‌ను ఇలా ట్రాక్ చేసుకోవచ్చు.
Pan card status check UTI : స్టెప్ 1:- ముందుగా యూటీఐఐటీఎస్ఎల్ పాన్ కార్డు ట్రాకింగ్ పోర్టల్‌లోకి వెళ్లండి.
స్టెప్ 2:- 'యువర్ పాన్' మీద 'అప్లికేషన్ కూపాన్ నెంబర్'ను ఎంటర్ చేయండి.
స్టెప్ 3:- సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి, సబ్మీట్ బటన్ ప్రెస్ చేయండి.
స్టెప్ 4:- మీ పాన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది.
ఇదీ చూడండి:- How to link Aadhaar to LPG : ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్‌ను లింక్ చేయండి ఇలా..
ఎన్ఎస్డీఎల్ ద్వారా..
టీఐఎన్- ఎన్ఎస్డీఎల్ ద్వారా పాన్ కార్డును అప్లై చేసుకున్న వారు.. అప్లికేషన్ స్టేటస్‌ను ఇలా ట్రాక్ చేసుకోవచ్చు..
Pan card status check online : స్టెప్ 1:- టీఐఎన్- ఎన్ఎస్డీఎల్ పాన్ కార్డు ట్రాకింగ్ పోర్టల్‌కు వెళ్లండి.
స్టెప్ 2:- 'ఆప్లికేషన్ టైప్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 'పాన్ న్యూ- ఛేంజ్ రిక్వెస్ట్' మీద క్లిక్ చేయండి.
Pan card status check NSDL : స్టెప్ 3:- 'అక్నాలెజ్డ్ నెంబర్'తో పాటు సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి ఎంటర్ చేయండి.
స్టెప్ 4:- సబ్మీట్ బటన్ క్లిక్ చేస్తే.. మీ పాన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్పీడ్ పోస్టు ద్వారా..
స్పీడ్ పోస్టు ద్వారా కూడా మీరు మీ పాన్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. ఎలా అంటే..
Pan card status check Indian post : స్టెప్ 1:- ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- కన్సైన్మెంట్ ట్రాకింగ్ పోర్టల్‌లోకి వెళ్లండి.
స్టెప్ 3:- మీ కన్సైన్మెంట్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.
స్టెప్ 4:- సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5:- మీ పాన్ కార్డు డెలివరీ స్టేటస్.. స్క్రీన్‌పై కనిపిస్తుంది.
సంబంధిత కథనం