(1 / 6)
పాన్ కార్డును పోయినట్లైతే సాధరణంగా కొత్తగా కార్డును దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం నేరుగా https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html లేదా https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homereprint వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
(2 / 6)
సైట్‌లో Request for Reprint PAN Cardపై క్లిక్ చేయాలి. తర్వాత PAN Card, Aadhaar, Date of Birth వివరాలు నమోదు చేయాలి.కొత్త కార్డు కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. వివరాలను పరిశీలించి ఆదాయపు పన్ను శాఖ చిరునామాకు కార్డును పంపిస్తుంది
(3 / 6)
అలా కాకుండా సత్వరమే కార్డు కావాలంటే.. https://www.incometax.gov.in/iec/foportal పోర్టల్‌కు వెళ్లి, ఈ-పాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సైట్‌లో ఎడమవైపు దిగువ భాగంలో Instant E-PAN క్లిక్ చేయండి. అనంతరం New E PAN వద్ద క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయండి.
(4 / 6)
నిబంధనలు చదివిన తర్వాత Accept బటన్ క్లిక్ చేయాలి. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. పేర్కొన్న వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసిన తర్వాత Confirm క్లిక్ చేయండి. ఈ-మెయిల్ ఐడీకి E-PAN వస్తుంది. E-PAN పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడుకొవచ్చు.
(5 / 6)
తిరిగి కార్డను పొందే సమయంలో మీ పాన్ కార్డు వివరాలు మీకు తెలియకపోతే.. adg1.systems@incometax.gov.in లేదా jd.systems1.1@incometax.gov.inకు కొత్త కార్డు కోసం ఐటీ శాఖకు ఇ-మెయిల్ చేయొచ్చు.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు