Gold price : ఇంకొన్ని నెలల్లో బంగారం ధర @75వేలు- వెండి రేటు @95వేలు..-experts see gold price at 75 000 per 10 gm level in fy25 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price : ఇంకొన్ని నెలల్లో బంగారం ధర @75వేలు- వెండి రేటు @95వేలు..

Gold price : ఇంకొన్ని నెలల్లో బంగారం ధర @75వేలు- వెండి రేటు @95వేలు..

Sharath Chitturi HT Telugu
Mar 30, 2024 11:15 AM IST

Gold price prediction 2024 : ఇంకొన్ని నెలల్లో బంగారం ధర రూ. 75వేలు, వెండి ధర 95వేలకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

బంగారం ధర రూ. 75వేలు.. వెండి ధర రూ. 95వేలు!
బంగారం ధర రూ. 75వేలు.. వెండి ధర రూ. 95వేలు!

Gold price today : దేశంలో ఎండలతో పాటు పసిడి ధరలు కూడా భగభగలాడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్​తో పాటు ఇతర కారణాలతో బంగారం రేట్లు.. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్నాయి. పసిడి ప్రియులకు అదనంగా ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో.. గోల్డ్​ ప్రైజ్​ ప్రెడిక్షన్​కి సంబంధించిన ఓ వార్త బయటకి వచ్చింది. కొన్ని నెలల్లోనే 10 గ్రాముల పసిడి రూ. 75వేలు తాకే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇంకొన్ని నెలల్లో బంగారం ధర @75వేలు..

2024 ఆర్థిక ఏడాది ముగింపు సమయానికి.. ఎంసీఎక్స్​ (మల్టీ కమోడిటీ ఎక్స్​ఛేంజ్​)లో గోల్డ్​ ఫ్యూచర్స్​ కాంట్రాక్ట్​.. (10గ్రాములు) రూ. 67,850 వద్ద ఆల్​-టైమ్​ హైని తాకి.. చివరికి రూ. 67,800 వద్ద ముగిసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది చివరి రెండు త్రైమాసికాల్లో.. 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.11వేలు పెరగడం గమనార్హం. ఎఫ్​వై24 చివరి ట్రేడింగ్​ సెషన్​లో స్పాట్​ గోల్డ్​ ప్రైజ్​ ఔన్స్​కు 2,254 డాలర్ల వద్ద ముగిసింది.

Gold price prediction FY2025 : కమోడిటీ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. ఎఫ్​25లోనూ బంగారం ధర పెరుగుతుంది. 2024లో అమెరికా ఫెడ్ నుంచి మూడు రేట్​ కట్స్​ ఉంటాయన్న అంచనాలు ఇందుకు కారణం. అంటే.. ఎఫ్​వై25లో మొదటి 9 నెలల్లో మూడు రేట కట్స్​ ఉండే అవకాశం ఉంది. భౌగోళిక పరిస్థితులు, అమెరికా ద్రవ్యోల్బణంలో తగ్గుదల, అమెరికా డాలర్​ రేట్స్​ కారణంగా.. వచ్చే ఆర్థిక ఏడాదిలో ఎంసీఎక్స్​ గోల్డ్​ రేట్​ (10గ్రాములు) రూ. 75వేలని తాకొచ్చు.

"బంగారంలో కనీవినీ ఎరుగని రీతిలో అప్​ట్రెండ్​ కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక ఏడాది చివరి రెండు త్రైమాసికల్లో.. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 11వేలు పెరిగింది. కేజీ వెండి ధర రూ. 78,000- రూ. 78,000 వద్ద రెసిస్టెన్స్​ ఎందుర్కొంటోంది. ఏది ఏమైనా.. గోల్డ్​, సిల్వర్​లో ఈ అప్​ట్రెండ్​.. రానున్న ఆర్థిక ఏడాదిలో కూడా కొనసాగుతుంది. బంగారం ధర ఇంకా పెరుగుతుంది," అని ఎస్​ఎస్​ వెల్త్​స్ట్రీట్​ ఫౌండర్​ సుగంధ సచ్​దేవ తెలిపారు.

Silver price prediction 2024 : "గ్లోబల్​ గ్రీన్​ ఇనీషియేటివ్స్​, 5జీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్​ సెగ్మెంట్స్​ కారణంగా.. సిల్వర్​కి డిమాండ్​ పెరిగే అవకాశం ఉంది. వెండి కన్నా బంగారం ధర బాగా పెరుగుతుందని మేము అంచనా వేస్తున్నప్పటికీ.. సిల్వర్​లోనూ మంచి అప్​ట్రెండ్​ కనిపించొచ్చు. రూ. 78,000- రూ. 78,500 వద్ద ఉన్న బలమైన రెసిస్టెన్స్​ దాటితే.. కేజీ వెండి ధర రూ. 88వేలు-95వేల వరకు వెళ్లొచ్చు," అని సుగంధ సచ్​దేవ అభిప్రాయపడ్డారు.

బంగారం విషయంలో ఇదే బెస్ట్​ ఇన్​వెస్ట్​మెంట్​..

స్టాక్​ మార్కెట్​లతో పాటు బంగారం అనేది లాంగ్​ టర్మ్​ ఇన్​వెస్ట్​మెంట్​గా చాలా మంది పరిగణిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే గోల్డ్​ కూడా బ్యూటిఫుల్​ రిటర్నులు ఇచ్చింది. అయితే.. ఫిజికల్​ గోల్డ్​ కొని, దానినే ఇన్​వెస్ట్​మెంట్​ అనుకోవడం.. చాలా మంది చేసే తప్పు! ఫిజికల్​ గోల్డ్​లో ఆ ఛార్జీలనీ, ఈ ఛార్జీలనీ.. చాలా కటింగ్స్​ ఉంటాయి. అయితే.. గోల్డ్​ని ఇన్​వెస్ట్​మెంట్స్​గా చూస్తుంటే మాత్రం.. ప్రధానంగా మూడు మార్గాలు కనిపిస్తాయి. 1. సావరిన్​ గోల్డ్​ బాండ్​, 2. గోల్డ్​ ఈటీఎఫ్​, 3. డిజిటల్​ గోల్డ్​.

Gold price in Hyderabad : వీటిల్లో గోల్డ్​ ఈటీఎఫ్​ మంచి ఆప్షన్​ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఈటీఎఫ్​లు మ్యూచువల్​ ఫండ్స్​ని పోలి ఉంటాయి. మ్యూచువల్​ ఫండ్స్​లో యూనిట్​లు ఫండ్​ హౌజ్​ దగ్గర ఉంటాయి. కానీ ఈటీఎఫ్​లు మన ట్రేడింగ్​ అకౌంట్​లోనే ఉంటాయి. గోల్డ్​ ఈటీఎఫ్​కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం