Citroen eC3 vs Tiago EV vs Tigor EV : ఈ మూడింట్లో.. బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీ ఏది?
Citroen eC3 vs Tiago EV : సిట్రోయెన్ ఈసీ3 ఎట్టకేలకు ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యింది. టాటా టియాగో ఈవీ, టిగోర్ ఈవీలకు గట్టిపోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడింట్లో చౌకైన ఈవీ ఏది అనేది ఇక్కడ తెలుసుకుందాము..
Citroen eC3 vs Tiago EV : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో గత కొంత కాలంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంస్థల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈవీల ధరలు కూడా దిగొస్తున్నాయి. ఒక ఈవీ కొనాలంటే.. గతంలో కనీసం రూ. 15లక్షలు- రూ. 20లక్షలైనా వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బడ్జెట్ ధరల్లోనే ఈవీలు దొరికేస్తున్నాయి! టాటా మోటార్స్‌కు చెందిన టియాగో ఈవీ, టిగోర్ ఈవీలు ఇందుకు చక్కటి ఉదాహరణ. ఇక ఇప్పుడు అఫార్డిబుల్ ఈవీ రేసులో సిట్రోయెన్ సంస్థ కూడా అడుగుపెట్టింది. ఈసీ3ని లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ మూడు ఈవీల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ వాహనం ఏదనేది ఇక్కడ తెలుసుకుందాము..
సిట్రోయెన్ ఈసీ3 వేరియంట్లు- ఎక్స్‌షోరూం ధరలు..
సిట్రోయెన్ ఈసీ3లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి..
- Citroen eC3 on road price in Hyderabad : లైవ్- రూ. 11.50లక్షలు.
- ఫీల్- రూ. 12.13లక్షలు.
- ఫీల్ వైబ్ ప్యాక్- రూ. 12.28లక్షలు
- ఫీల్ వైబ్ ప్యాక్ డ్యూయెల్ టోన్- రూ. 12.43లక్షలు.
ఇదీ చదవండి : Citroen eC3 vs Tata Tiago EV : సిట్రోయెన్ ఈసీ3 వర్సెస్ టియాగో ఈవీ.. ది బెస్ట్ ఏది?
టాటా టియాగో ఈవీ వేరియంట్లు- ఎక్స్‌షోరూం ధరలు..
- Tata Tiago EV on road price Hyderabad : ఎక్స్ఈ ఎంఆర్- రూ. 8.69లక్షలు.
- ఎక్స్‌టీ ఎంఆర్- రూ. 9.29లక్షలు.
- ఎక్స్‌టీ ఎల్ఆర్- రూ. 10.19లక్షలు.
- ఎక్స్జెడ్+ ఎల్ఆర్- రూ. 10.99లక్షలు
- ఎక్స్జెడ్+ టెక్ లక్స్ ఎల్ఆర్- రూ. 11.49లక్షలు
- ఎక్స్జెడ్+ ఎల్ఆర్(7.2 కేడబ్ల్యూ ఛార్జర్)- రూ. 11.49లక్షలు
- ఎక్స్జెడ్|+ టెక్ లక్స్ ఎల్ఆర్ (7.2కేడబ్ల్యూ ఛార్జర్)- 11.99లక్షలు
ఇదీ చదవండి : Citroen eC3 first drive review : సిట్రోయెన్ ఈసీ3 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొత్త ఈవీ ఎలా ఉంది?
టాటా టిగోర్ ఈవీ వేరియంట్లు- ఎక్స్‌షోరూం ధరలు..
- Tata Tigor EV on road price in Hyderabad : ఎక్స్ఈ- రూ. 12.349లక్షలు.
- ఎక్స్‌టీ- రూ. 12.99లక్షలు.
- ఎక్స్జెడ్+ - రూ. 13.49లక్షలు.
- జెడ్ఎక్స్+ లక్స్- రూ. 13.75లక్షలు.
సిట్రోయెన్ ఈసీ3 బేస్, టాప్ ఎండ్‌తో పోల్చుకుంటే.. టాటా టియాగో ఈవీ చౌకైనది. అదే సమయంలో టాటా టిగోర్ ఈవీతో పోల్చుకుంటే సిట్రోయెన్ బేస్, టాప్ ఎండ్ వేరియంట్లు చౌకైనవి.