Tata Tiago EV price hike : టాటా టియాగో ఈవీ ధర పెంపు.. ఎంతంటే!-tata tiago ev prices increased after introductory offer ends check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Tiago Ev Price Hike : టాటా టియాగో ఈవీ ధర పెంపు.. ఎంతంటే!

Tata Tiago EV price hike : టాటా టియాగో ఈవీ ధర పెంపు.. ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Feb 10, 2023 01:28 PM IST

Tata Tiago EV prices increased : టాటా టియాగో ఈవీ ధరలు పెరిగాయి. ప్రతి వేరియంట్​పై రూ. 20వేలు పెంచింది టాటా మోటార్స్​. తాజా ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

టాటా టియాగో ఈవీ ధర పెంపు.. ఎంతంటే!
టాటా టియాగో ఈవీ ధర పెంపు.. ఎంతంటే! (Tata Motors)

Tata Tiago EV prices increased : దేశంలోని అతి చౌకైన ఎలక్ట్రిక్​ వెహికిల్​గా గుర్తింపు పొందింది టాటా టియాగో ఈవీ. బుకింగ్స్​ పరంగా రికార్డులు సృష్టించింది ఈ ఈవీ. ఒక్క రోజులోనే 10వేలకుపైగా యూనిట్​లు బుక్​ అయ్యాయి. ఇక నెల రోజుల వ్యవధిలో బుకింగ్స్​ సంఖ్య 20వేలు దాటిపోయింది. ఈ ఈవీ డెలవరీలు ఇటీవలే మొదలయ్యాయి. ఇక ఇప్పుడు టియాగో ఈవీ ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్​ ప్రకటించింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

టాటా టియాగో ఈవీ ధర..

ఇంట్రొడక్టరీ ప్రైజ్​ కింద టాటా టియాగో ఈవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 8.69లక్షలుగా ఉంది. అది రూ. 11.99లక్షల వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు వేరియంట్​పై రూ. 20వేల వరకు పెంచింది టాటా మోటార్స్​.

Tata Tiago EV on road price Hyderabad : టాటా టియాగో ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్​లు ఉంటాయి. అవి 19.2కేడబ్ల్యూహెచ్​, 24కేడబ్ల్యూహెచ్​. మొదటికి 250కి.మీల రేంజ్​ ఇస్తుంటే.. రెండోదానికి 315కి.మీల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది.

Tata Tiago EV vs Citroen eC3 : ఈ రెండు ఈవీల మధ్య ది బెస్ట్​ ఏదనేది తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తాజా పెంపుతో.. 19.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​, 3.3 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​ ఆప్షన్​ ఉండే ఎక్స్​ఈ వేరియంట్​ ధర 8.69లక్షలకు చేరింది. ఎక్స్​టీ వేరియంట్​ ధర రూ. 9.29లక్షలకు పెరిగింది.

Tata Tiago EV price hike : ఇక 24కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​, 3.3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​ ఆప్షన్​ ఉన్న ఎక్స్​టీ వేరియంట్​ ధర రూ. 10.19లక్షలుగాను, ఎక్స్​జెడ్​+ వేరియంట్​ ధర రూ. 10.99లక్షలుగాను, ఎక్స్​జెడ్​+ టెక్​ ఎల్​యూఎక్స్​ ధర రూ. 11.49లక్షలుగాను ఉంది.

మరోవైపు 24కేడబ్ల్యూహెచ్​, 7.2కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​ ఆప్షన్​, ఎక్స్​జెడ్+ వేరియంట్​ ధర రూ. 11.49లక్షలు, ఎక్స్​జెడ్​+ టెక్​ ఎల్​యూఎక్స్​ ధర రూ. 11.99లక్షలుగాను ఉంది.

టాటా టియాగో ఈవీ- ఇంజిన్​..

Tata Tiago EV delivery : 19.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉన్న 45కేడబ్ల్యూ ఎలక్ట్రిక్​ మోటార్​​.. 110ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 0-60 కేఎంపీహెచ్​ను కేవలం 6.2సెకన్లలో అందుకుంటుంది. ఇక 24కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉన్న 55 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్​ మోటార్​.. 114 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 0-60 కేఎంపీహెచ్​ను కేవలం 5.7సెకన్లలో అందుకుంటుంది.

టాటా టియాగో ఈవీకి సిట్రోయెన్​ ఈసీ3 నుంచి పోటీ అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త ఇవీ ఈ నెలలోనే మార్కెట్​లో లాంచ్​కానుంది. సిట్రోయెన్​ ఈసీ3 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner