Citroen C3X sedan : సీ3ఎక్స్​ సెడాన్​ లాంచ్​కు ప్లాన్​ చేస్తున్న సిట్రోయెన్​.. విశేషాలివే!-citroen c3x sedan to arrive in 2024 see features price and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Citroen C3x Sedan : సీ3ఎక్స్​ సెడాన్​ లాంచ్​కు ప్లాన్​ చేస్తున్న సిట్రోయెన్​.. విశేషాలివే!

Citroen C3X sedan : సీ3ఎక్స్​ సెడాన్​ లాంచ్​కు ప్లాన్​ చేస్తున్న సిట్రోయెన్​.. విశేషాలివే!

Sharath Chitturi HT Telugu
May 21, 2023 08:31 AM IST

Citroen C3X sedan : సీ3ఎక్స్​ సెడాన్​ మోడల్​ను ఇండియాలో లాంచ్​ చేసేందుకు సిట్రోయెన్​ ప్లాన్​ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

సీ3ఎక్స్​ సెడాన్​ లాంచ్​కు ప్లాన్​ చేస్తున్న సిట్రోయెన్​.. విశేషాలివే!
సీ3ఎక్స్​ సెడాన్​ లాంచ్​కు ప్లాన్​ చేస్తున్న సిట్రోయెన్​.. విశేషాలివే! (Representative image/ cars arena)

Citroen C3X sedan : వరుస లాంచ్​లతో దూసుకెళుతున్న ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ సిట్రోయెన్​.. ఇండియా మార్కెట్​లో మరో కారును లాంచ్​ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అదే సిట్రోయెన్​ సీ3ఎక్స్​ సెడాన్​. ఈ క్రాసోవర్​ సెడాన్​ వచ్చే ఏడాదిలో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. వోక్స్​వ్యాగన్​ వర్టూస్​, స్కోడా స్లావియాకు గట్టిపోటీనిచ్చే విధంగా ఈ మోడల్​ను సిట్రోయెన్​ రూపొందిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సెడాన్​పై ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలుసుకుందాము..

సిట్రోయెన్​ సీ3ఎక్స్​- డిజైన్​..

ఈ సిట్రోయెన్​ సీ3ఎక్స్​ ఎక్స్​టీరియర్​ లుక్​.. సిట్రోయెన్​ సీ3ని పోలి ఉండొచ్చు. స్కల్ప్​టెడ్​ బానెట్​, బంపర్​ మౌంటెడ్​ హెడ్​లైట్స్​ విత్​ స్ప్లిట్​ టైప్​ డీఆర్​ఎల్స్​, స్లీక్​ గ్రిల్​, డబుల్​ చెవ్రాన్​ లోగో, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, ఫాస్ట్​బ్యాక్​ లైక్​ స్లోపింగ్​ రూఫ్​లైన్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి.

Citroen C3X sedan launch in India : ఇక ఈ సెడాన్​ రేర్​లో వ్రాప్​ అరౌండ్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ ఉంటాయని తెలుస్తోంది.

సిట్రోయెన్​ సీ3ఎక్స్​- ఫీచర్స్​..

సిట్రోయెన్​ సీ3ఎక్స్​ సెడాన్​ ఇంటీరియర్​ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇందులోని స్పేషియస్​ కేబిన్​లో మినిమలిస్ట్​ డాష్​బోర్డ్​, ప్రీమియం అప్​హోలిస్ట్రీ, యాంబియెంట్​ లైటింగ్​, మేన్యువల్​ ఏసీ వెంట్స్​, రేర్​ ఏసీ వెంట్స్​, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10 ఇంచ్​ టచ్​స్కీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ ప్యానెల్​ ఉండనున్నాయి. ఇందులో ఇన్ఫోటన్​మెంట్​ సిస్టెమ్​.. సీ3, సీ3 ఎయిర్​క్రాస్​ను పోలీ ఉంటుందని తెలుస్తోంది.

ప్యాసింజర్​ సేఫ్టీ కోసం మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​ లభిస్తాయి.

సిట్రోయెన్​ సీ3ఎక్స్​ సెడాన్​- ఇంజిన్​..

Citroen C3X sedan price : ఇందులో 1.2 లీటర్​, లిక్వ్​డ్​ కూల్డ్​, టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. ఇది 108.4 హెచ్​పీ పవర్​ను, 190ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఉండొచ్చు.

సిట్రోయెన్​ సీ3ఎక్స్​- ధర..

Citroen C3X sedan price in India : ఈ సెడాన్​ మోడల్​ ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. లాంచ్​ డేట్​, స్పెసిఫికేషన్స్​, ధర, ఫీచర్స్​పై రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రీమియం సెగ్మెంట్​లో ఇది అడుగుపెట్టొచ్చు.

సిట్రోయెన్​ సీ4.. వచ్చేస్తోంది!

Citroen C4 : సిట్రోయెన్​ నుంచి.. సీ3, సీ3 ఎయిర్​క్రాస్​, సీ5 ఎయిర్​క్రాస్​తో పాటు ఈసీ3 ఎలక్ట్రిక్​ వెహికిల్​ ప్రస్తుతం మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. అయితే.. సిట్రోయెన్​ సీ4 ప్రస్తుతం టెస్ట్​ రన్​ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వెహికిల్​ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం