Ysrcp Bus Yatra: నేటి నుంచి రెండో విడత వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర-ysrcps second phase of social empowerment bus yatra from today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Bus Yatra: నేటి నుంచి రెండో విడత వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర

Ysrcp Bus Yatra: నేటి నుంచి రెండో విడత వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర

Sarath chandra.B HT Telugu
Nov 15, 2023 06:35 AM IST

Ysrcp Bus Yatra: వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సామాజిక సాధికార యాత్ర" రెండో దశ నేటి నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు సాగే ఈ బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు పాల్గొననున్నారు.

వైసీపీ బస్సు యాత్ర
వైసీపీ బస్సు యాత్ర

Ysrcp Bus Yatra: వైసీపీ రెండో విడత సామాజిక సాధికార బస్సు యాత్ర తొలి రోజున శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరగనుంది. పేద, బడుగు వర్గాలకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించే సామాజిక సాధికార యాత్ర రెండో దశ బస్సు యాత్ర 39 నియోజకవర్గాల్లో జరగనుంది.

నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సీఎం జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమంతో ఆర్థిక సాధికారత కోసం తీసుకున్న చర్యలను.. చేసిన మంచిని వివరించే ఉద్దేశంతో చేపట్టిన సామాజిక సాధికార యాత్ర మొదటి దశ విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లోని 35 నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర పూర్తి అయ్యింది.

ముఖ్యమంత్రి చెప్పే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్న మాటలకు నిజమైన అర్థం చెప్పి.. నాలుగున్నరేళ్ల పాలనలో లంచాలు, వివక్షత లేకుండా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా సాగిన ప్రజా పాలనకు సామాజిక సాధికార యాత్ర అద్ధం పడుతోందని వైసీపీ చెబుతోంది.

నాలుగున్నరేళ్లలో రూ. 2.35 లక్షల కోట్లను ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా పంపిణీ చేయడంతో పాటు రూ. 2.34 లక్షల కోట్ల నాన్ డీబీటీ లబ్ధి మొత్తంగా రూ. 4.69 లక్షల కోట్లను వివిధ రూపాల్లో పేదల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం అందించినట్లు వివరిస్తున్నారు.

రాష్ట్రాల అభివృద్ధికి ప్రామాణికంగా నిలిచే జీఎస్డీపీ వద్ధి రేటులో నెంబర్ 1 గా నిలిచి, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయ వృద్ధిలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా 17వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరిన అంశాలను సామాజిక సాధికార యాత్ర ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

"సామాజిక సాధికార యాత్ర" మొదటి దశలో పూర్తి అయిన నియోజకవర్గాలు

1. శ్రీకాకుళం జిల్లా - ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస

2. గుంటూరు జిల్లా - తెనాలి, గుంటూరు ఈస్ట్

3. అనంతపురం జిల్లా - సింగనమల

4. విజయనగరం జిల్లా - గజపతినగరం, శృంగగవరపు కోట

5. పశ్చిమ గోదావరి జిల్లా - నరసాపురం, పాలకొల్లు

6. తిరుపతి జిల్లా - తిరుపతి

7. విశాఖపట్టణం జిల్లా - భీమిలి, గాజువాక

8. బాపట్ల జిల్లా - బాపట్ల

9. వైఎస్సార్ కడప జిల్లా - ప్రొద్దుటూరు

10. ఆల్లూరి సీతారామ రాజు జిల్లా - పాడేరు

11. ఏలూరు జిల్లా - దెందులూరు

12. నెల్లూరు జిల్లా - ఉదయగిరి, కావలి

13. అనకాపల్లి జిల్లా - మాడుగుల, అనకాపల్లి

14. కృష్ణా జిల్లా - అవనిగడ్డ, పామర్రు

15. చిత్తూరు జిల్లా - చిత్తూరు

16. పల్నాడు జిల్లా - మాచెర్ల, వినుకొండ, పెదకూరపాడు

17. శ్రీ సత్య సాయి జిల్లా - ధర్మవరం

18. కాకినాడ జిల్లా - కాకినాడ రూరల్

20. ప్రకాశం జిల్లా - మార్కాపురం, కనిగిరి

21. నంద్యాల జిల్లా - ఆళ్లగడ్డ

22. మన్యం జిల్లా - సాలూరు, పార్వతీపురం

23. అన్నమయ్య జిల్లా - తంబళ్లపల్లె

రెండవ దశ "సామాజిక సాధికార యాత్ర" తొలిరోజు

శ్రీకాకుళం జిల్లా -

నరసన్నపేట

గుంటూరు జిల్లా - పొన్నూరు

శ్రీ సత్యసాయి జిల్లా - హిందూపురంలో పర్యటిస్తారు.

Whats_app_banner