Visakha Crime : విశాఖలో దారుణం, స్నేహితుడి ప్రాణం తీసిన అష్టా చమ్మా ఆట!-visakhapatnam four friends quarrel in ashta chamma game one died ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Crime : విశాఖలో దారుణం, స్నేహితుడి ప్రాణం తీసిన అష్టా చమ్మా ఆట!

Visakha Crime : విశాఖలో దారుణం, స్నేహితుడి ప్రాణం తీసిన అష్టా చమ్మా ఆట!

Bandaru Satyaprasad HT Telugu
Aug 16, 2023 02:29 PM IST

Visakha Crime : అష్టా చమ్మా ఆటలో తలెత్తిన వివాదం స్నేహితుడి ప్రాణం తీసింది. విశాఖలో నలుగురు స్నేహితులు మద్యం మత్తులో ఓ విషయంలో గొడవపడ్డారు. ఈ గొడవలో ఒకరిని తోసేయడంతో తలకు సిమెంట్ అరుగు తగిలి ప్రాణాలు కోల్పోయాడు.

అష్టా చమ్మా ఆటలో  గొడవ, స్నేహితుడిపై దాడి
అష్టా చమ్మా ఆటలో గొడవ, స్నేహితుడిపై దాడి

Visakha Crime : అష్టా చమ్మా ఆటలో స్నేహితుల మధ్య ఘర్షణ తలెత్తి ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. నలుగురు స్నేహితులు కాలక్షేపానికి అష్టా చమ్మా ఆడుకుంటున్నారు. ఈ ఆటలో వివాదం మొదలై ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒక వ్యక్తిని బలంగా తోసేయడంతో అతడు వెనక్కి పడిపోయాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తల సిమెంట్ గట్టుకు తగలడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విశాఖ మద్దిలపాలెంలో ఈ ఘటన జరిగింది. పిఠాపురం కాలనీ గవరివిధికి చెందిన పెయింటర్ నారాయణ రావు, మద్దిలపాలెంనకు చెందిన రాంబాబు, రమణ, దాసు అనే నలుగురు పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నలుగురు మద్దిలపాలెం బజార్ సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద అష్టా చమ్మా ఆట ఆడారు. ఈ ఆటలో వీరి మధ్య ఘర్షణ తలెత్తింది.

అష్టా చమ్మాలో వివాదం

అష్టా చమ్మా ఆటలో స్నేహితుల మధ్య వివాదం మొదలై పరస్పరం దాడికి దిగారు. దీంతో నారాయణరావు అనే వ్యక్తి మృతి చెందాడు. ఎంవీపీ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం.. గవరవీధి, ఆటోమోటివ్‌ ప్రాంతానికి చెందిన నారాయణరావు (28), మద్దిలపాలెం పిఠాపురం కాలనీకి చెందిన రాంబాబు (29), రమణ, దాసు స్నేహితులు. మంగళవారం మధ్యాహ్నం వీరు పిఠాపురం కాలనీ మార్కెట్‌ సెంటర్‌ సమీపంలో బెట్టింగ్ వేసుకుని అష్టా చమ్మా ఆట ఆడారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన నారాయణరావు అష్టా చమ్మా పిక్కలను తన్నేశాడు. అయితే రాంబాబు కోపంతో నారాయణరావు మోహంపై బలంగా కొట్టాడు. దీంతో వెనక్కి పడిపోయిన నారాయణరావుకు అక్కడున్న సిమెంట్‌ గట్టుకు తల బలంగా తగలడంతో అక్కడికక్కడే మరణించినట్లు సీఐ వెల్లడించారు. నారాయణరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నారాయణరావు చనిపోయాడని తెలుసుకున్న నిందితుడు రాంబాబు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మద్యం మత్తులో గొడవ

అయితే ఈ నలుగురు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. పిఠాపురం కాలనీ బజార్ వద్ద సులభ్ కాంప్లెక్స్ వద్ద అష్టా చమ్మా ఆట మొదలుపెట్టారు. అక్కడున్న సులభ్ కాంప్లెక్స్ కేర్ టెకర్ రామకృష్ణ వారిని వారించి వెళ్లిపొమ్మన్నాడు. అక్కడ నుంచి వెళ్లిపోయిన ఆ నలుగురు కాసేటికి మళ్లీ తిరిగి వచ్చారు. మళ్లీ వెళ్లిపోమన్న రామకృష్ణపై దాడికి యత్నించారు. కేర్ టేకర్ వద్దన్నా వినకుండా ఆట మొదలుపెట్టి ఘర్షణ పడ్డారు. వాళ్లు అక్కడకు రాకముందే ఏదో గొడవ జరిగిందని రామకృష్ణ తెలిపాడు. మద్యం మత్తులో మాటామాటా పెరిగి కొట్టుకున్నారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అష్టా చమ్మా పిక్కలను నారాయణ రావు తీసివేయడంతో రాంబాబు కోపంతో అతడిపై దాడి చేశాడు. ఈ దాడిలో నారాయణ రావు చనిపోయాడు.

Whats_app_banner