IMU Admissions: విశాఖ ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీలో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లు, జూలై 13న ప్రవేశ పరీక్ష…-visakha indian maritime university lateral entry admissions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Imu Admissions: విశాఖ ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీలో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లు, జూలై 13న ప్రవేశ పరీక్ష…

IMU Admissions: విశాఖ ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీలో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లు, జూలై 13న ప్రవేశ పరీక్ష…

HT Telugu Desk HT Telugu
Jun 27, 2024 10:51 AM IST

IMU Admissions: విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌తిష్టాత్మ‌క ఇండియన్ మారిటైమ్‌ యూనివ‌ర్శిటీ (ఐఎంయూ) లేట‌ర‌ల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఐఎంయూ విశాఖలో అడ్మిషన్లు...
ఐఎంయూ విశాఖలో అడ్మిషన్లు...

IMU Admissions: విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌తిష్టాత్మ‌క ఇండియన్ మారిటైమ్‌ యూనివ‌ర్శిటీ (ఐఎంయూ) లేట‌ర‌ల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2024-25 విద్యా సంవ‌త్సరానికి గాను లేట‌ర‌ల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశాల‌కు దర‌ఖాస్తుల‌ను ఐఎంయూ ఆహ్వానిస్తుంది. ఈ ప్రోగ్ర‌మ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాడానికి జూలై 5 వ‌ర‌కు గ‌డువును నిర్ణ‌యించింది. జూలై 13న ఈ కోర్సుకు సంబంధించి ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు ఐఎంయూ తెలిపింది.

కోర్సు వివ‌రాలు

రెండో ఏడాది బీటెక్ (నేవ‌ల్ ఆర్కిటెక్చ‌ర్ అండ్ ఓషియ‌న్ ఇంజినీరింగ్-ఎన్ఏఓఈ), రెండో ఏడాది బీటెక్ (నేవ‌ల్ ఆర్కిటెక్చ‌ర్ అండ్ షిప్ బిల్డింగ్-ఎన్ఏఎస్బీ) కోర్సుల‌కు అడ్మిష‌న్లు జ‌రుగుతున్నాయి. అయితే ఈ కోర్సులు కాల వ్య‌వ‌ధి మూడేళ్లు (ఆరు సెమిస్ట‌ర్స్‌) ఉంటుంది. బీటెక్ (నేవ‌ల్ ఆర్కిటెక్చ‌ర్ అండ్ ఓషియ‌న్ ఇంజినీరింగ్-ఎన్ఏఓఈ) కోర్సులో ఏడు సీట్లు, రెండో ఏడాది బీటెక్ (నేవ‌ల్ ఆర్కిటెక్చ‌ర్ అండ్ షిప్ బిల్డింగ్-ఎన్ఏఎస్బీ) కోర్సులో ఆరు సీట్లు ఉన్నాయి.

అర్హ‌త‌లు

డిప్లొమా (షిప్ బిల్డింగ్ ఇంజినీరింగ్ (నాలుగేళ్లు)/ మెకానిక‌ల్ (మూడేళ్లు)/ సివిల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు)/ నేవ‌ల్ ఆర్కిటెక్చ‌ర్ అండ్ ఆఫ్ షోర్ ఇంజినీరింగ్ (మూడేళ్లు))లో క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అలాగే ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌ల్లో ఇంగ్లీష్‌లో 50 శాతం మార్కులు రావాలి. లేక‌పోతే మూడేళ్ల‌ బీఎస్సీ- షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్‌లో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌ల్లో ఇంగ్లీష్‌లో 50 శాతం మార్కులు రావాలి.

అభ్య‌ర్థులు గ‌రిష్ఠ వ‌యో ప‌రిమితి 2024 ఆగ‌స్టు 1 నాటికి పురుషుల‌కు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ వాళ్ల‌కు 25 ఏళ్లు, ఓబీసీల‌కు 28 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీల‌కు 30 ఏళ్లు, మ‌హిళ‌ల‌కు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ వాళ్ల‌కు 27 ఏళ్లు, ఓబీసీల‌కు 30 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీల‌కు 32 ఏళ్లు, మించ‌కూడ‌దు. ట్రాన్స్ జెండ‌ర్స్‌కు మ‌హిళ‌ల వ‌య‌స్సు కంటే రెండేళ్ల అద‌నంగా ఉండొచ్చు.

ఎంపిక ప్ర‌క్రియ

లేట‌ర‌ల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్‌లో కోర్సుల‌కు ప్ర‌వేశ‌ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ర్యాంకు సాధించిన వారికి మెడిక‌ల్ ఫిట్‌నెస్ చేసి, త‌రువాత స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ చేస్తారు.

ప‌రీక్ష విధానం

ప్ర‌వేశ ప‌రీక్షఆఫ్‌లైన్‌లో ఉంటుంది. జూలై 13న (శ‌నివారం) ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. పరీక్ష‌ రెండు గంట‌ల పాటు ఉంటుంది. ఉద‌యం 10ః30 నుంచి మ‌ధ్యాహ్నం 12ః30 వ‌ర‌కు ప‌రీక్ష జ‌రుగుతుంది. ప‌రీక్షా కేంద్రంః ఐఎంయూ విశాఖ‌ప‌ట్నం క్యాంప‌స్, గాంధీన‌గ‌ర్‌, సింథియా జంక్ష‌న్ ద‌గ్గ‌ర‌, విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్ నుంచి ఎనిమిది కిలో మీట‌ర్ల ఉంటుంది.

120 మార్కుల‌కు ప్ర‌శ్నాప‌త్రం ఉంటుంది. ఇంగ్లీష్ 30, మ్యాథమెటిక్స్‌ 30, జనరల్ ఆప్టిట్యూడ్ 30, సాంకేతిక విషయాల పరిజ్ఞానం (ప్రశ్నపత్రం అందరికీ ఒకే విధంగా ఉంటుందని గ‌మ‌నించాలి. అభ్యర్థులు వారి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌తో సంబంధం లేకుండా) 30 మార్కుల‌కు ప్ర‌శ్న‌లు ఉంటాయి. అందులో ఒక త‌ప్పు స‌మాధానానికి 0.25 నెగిటివ్ మార్కు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు

లేట‌ర‌ల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్‌లో కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఫీజు జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థులు రూ.1,000, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థులు రూ.700 చెల్లించాలి. ఆ ఫీజును ఇండియ‌న్ మారిటైమ్ యూనివ‌ర్శిటీ, విశాఖ‌ప‌ట్నం క్యాంప‌స్ పేరు మీద డీడీ తీయాలి.

కోర్సు ఫీజులు ఇలా

అడ్మిష‌న్ రిజిస్ట్రేష‌న్/ కౌన్సిలింగ్ ఫీజు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రోగ్ర‌మ్ ఫీజు రూ.30 వేలు, సెమిస్ట‌ర్ ఫీజు రూ.1,22,500, కాష‌న్ డిపాజిట్ రూ. 30 వేల చెల్లించాలి. ఈ ఫీజుల‌న్నీ ఇండియ‌న్ మారిటైమ్ యూనివ‌ర్శిటీ, విశాఖ‌ప‌ట్నం క్యాంప‌స్ పేరు మీద‌ డీడీ తీసి చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తు పంపాల్సిన చిరునామా

డైరెక్ట‌ర్, ఇండియ‌న్ మారిటైమ్ యూనివ‌ర్శిటీ, విశాఖ‌ప‌ట్నం క్యాంప‌స్, వంగ‌లి గ్రామం, స‌బ్బ‌వ‌రం మండ‌లం, విశాఖ‌ప‌ట్నం-531035, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, చిరునామాకు ద‌ర‌ఖార‌స్తు పంపించాలి. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు ప్ర‌వేశ ప‌రీక్ష‌కు సంబంధించిన వివ‌రాలు ఫోన్ ద్వారా కానీ, ఈ మెయిల్ ద్వారా కాని స‌మాచారం ఇస్తారు. అద‌న‌పు స‌మ‌చారం కోసం imuvizag-academics@imu.ac.inను సంప్ర‌దించాలి. అలాగే డీఎస్‌పీ విద్యా సాగ‌ర్ (ఫ్యాక‌ల్టీ) మొబైల్ నంబ‌ర్ 9849050932ను కూడా సంప్ర‌దించాల‌ని ఐఎంయూ కోరింది.

ఇగ్నోలో కొత్తగా నాలుగు ఎంబీఏ కోర్సులు…

ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్‌ యూనివ‌ర్శిటీ (ఇగ్నో) కొత్త‌గా నాలుగు ఎంబీఏ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. 2024-జులై విద్యా సంవత్స‌రానికి అడ్మిష‌న్‌లో భాగంగా వివిధ దూర విద్యా కోర్సుల‌తో పాటు ఈ నాలుగు ఎంబీఏ కోర్సుల‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు విశాఖ‌ప‌ట్నం ప్రాంతీయ కేంద్రం సంచాల‌కుడు గోనిపాటి ధ‌ర్మారావు తెలిపారు.

ఇగ్నో కొత్త‌గా నాలుగు ఎంబీఏ కోర్సుల‌ను అందుబాటులోకి తెచ్చింది. అవి ఎంబీఏ హెల్త్‌కేర్‌, అండ్‌ హాస్ప‌ట‌ల్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ అగ్రి బీజీనెస్‌ మేనేజ్‌మెంట్, ఎంబీఏ క‌న‌స్ట్ర‌క్ష‌న్ మేనేజ్‌మెంట్‌, ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ స‌ప్ల‌య్ చైన్ మేనేజ్‌మెంట్‌ కోర్సులు కొత్త‌గా అందుబాటులోకి తెచ్చింది. రెండేళ్ల కాల వ్య‌వ‌ధిలో అందిస్తున్న ఈ కోర్సుల్లో ఏదైనా డిగ్రీ అర్హ‌త‌తో చేరొచ్చు. ఫీజు ఒక్కొ కోర్సుకు 64 వేలు రూపాయలు ఉంటుంది.

ఈ కోర్సులను పూర్తి చేస్తే వైద్య, వ్యవసాయ, మేనేజ్‌మెంట్, కనస్ట్రక్షన్ తదితర రంగాల్లోని మంచి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న రంగాల్లో ఇగ్నో కోర్సులను అందిస్తుందని విశాఖ‌ప‌ట్నం ప్రాంతీయ కేంద్రం సంచాల‌కుడు గోనిపాటి ధ‌ర్మారావు అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.‌ వివరాల కోసం తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

అప్లికేష‌న్ దాఖ‌లకు తేదీ జూన్ 30గా ఇగ్నో నిర్ణ‌యించింది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు జూన్ 30లోగా దర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్‌ ignou admission.samarth.edu.inలో ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌రు. అద‌న‌పు స‌మ‌చారం కోసం ఇగ్నో అధ్య‌య‌న కేంద్రాల‌నుగానీ, ప్రాంతీయ కేంద్రాన్నిగానీ సంప్ర‌దించ‌వ‌చ్చు. అలాగే 0891-2511200 ఫోన్ నంబ‌ర్‌ను సంప్ర‌దిస్తే మ‌రింత స‌మాచారం ల‌భిస్తుంది.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)