AP Govt Employees : తెలంగాణలో ఓటు హక్కు- ఏపీ ఉద్యోగులకు వేతన సెలవు-vijayawada news in telugu ap govt declared paid holiday to employees have telangana votes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Employees : తెలంగాణలో ఓటు హక్కు- ఏపీ ఉద్యోగులకు వేతన సెలవు

AP Govt Employees : తెలంగాణలో ఓటు హక్కు- ఏపీ ఉద్యోగులకు వేతన సెలవు

Bandaru Satyaprasad HT Telugu
Nov 29, 2023 06:12 PM IST

AP Govt Employees : తెలంగాణలో ఓటు హక్కు కలిగిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పోలింగ్ తేదీని వేతన సెలవుగా ప్రకటించింది. సరైన ఆధారాలు చూపించి ఉద్యోగులు పెయిడ్ హాలీడే పొందవచ్చని తెలిపింది.

ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt Employees : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం( నవంబర్ 30) నాడు జరుగనుంది. అయితే తెలంగాణలో ఓటు హక్కు కలిగిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఓటు హక్కును వినియోగించుకునే ఉద్యోగులకు పెయిడ్ హాలీడే ప్రకటించింది. నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వేతన సెలవు మంజూరు చేశారు. తెలంగాణలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రైవేట్, ఐటీ కంపెనీల ఉద్యోగులకు హాలీడే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరుగనుంది. అయితే పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణలోని విద్యాసంస్థలకు సైతం సెలవులు ఇవ్వాలని తెలిపింది. పోలింగ్‌ రోజున తెలంగాణలో ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ ఆదేశించారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ప్రకటించాలన్నారు. గతంలో ఎన్నికల వేళ కొన్ని సంస్థలు ఉద్యోగులకు సెలవు ఇవ్వలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రైవేట్ సంస్థలు సెలవులు ఇవ్వలేదనే ఫిర్యాదులు అందాయన్నారు. ఈ మేరకు ఈసారి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులు సెలవు ఇచ్చాయో, లేదో పరిశీలించాలని కార్మిక శాఖను తెలంగాణ సీఈవో వికాస్‌ రాజ్‌ ఆదేశించారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

వేతన సెలవు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా తెలంగాణ కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీన వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పౌరులంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నవంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవుగా ప్రకటిస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Whats_app_banner