AP Fiber Net Case : ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం, టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్ కు కోర్టు అనుమతి-vijayawada news in telugu acb court agreed to attach terasoft assets in ap fiber net case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Fiber Net Case : ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం, టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్ కు కోర్టు అనుమతి

AP Fiber Net Case : ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం, టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్ కు కోర్టు అనుమతి

Bandaru Satyaprasad HT Telugu
Nov 21, 2023 07:35 PM IST

AP Fiber Net Case : ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెరాసాఫ్ట్ సంస్థకు చెందిన ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు సీఐడీకి అనుమతి ఇచ్చింది.

ఏపీ ఫైబర్ నెట్ కేసు
ఏపీ ఫైబర్ నెట్ కేసు

AP Fiber Net Case : ఏపీ ఫైబర్ నెట్ కేసులో టెరా సాఫ్ట్ ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ తో పాటు, కనుమూరి కోటేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు హైదరాబాద్, విశాఖ, గుంటూరు సహా ఏడు ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. ఈ ఆస్తుల అటాచ్ మెంట్ కు సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్ కు ఏసీబీ కోర్టు అనుమతి

ఏపీ ఫైబర్‌నెట్‌ కేసులో టెరాసాఫ్ట్‌ ఆస్తుల అటాచ్‌కు సీఐడీకి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. టెరా సాఫ్ట్ కు చెందిన మొత్తం రూ.114 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో టెరాసాఫ్ట్‌ కంపెనీ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ11 తుమ్మల గోపీచంద్‌, ఆయన సతీమణి తుమ్మల పవన దేవిలకు చెందిన టెరాసాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌ సంస్థ ఆస్తులు, ఏ23గా ఉన్న కనుమూరి కోటేశ్వరరావుతో పాటు ఆయన డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఆస్తులు అటాచ్ చేసేందుకు సీఐడీ కోర్టును అభ్యర్థించింది. ఈ పిటిషన్ పై సీఐడీ వాదనలు వినిపిస్తూ... నిధుల దుర్వినియోగ ఆరోపణ 2014 నాటిది అయితే అంతకు ముందు ఆస్తులను ఎలా జప్తు చేస్తారని కోర్టు ప్రశ్నించగా, దుర్వినియోగం అయిన నిధుల మొత్తానికి నిందితుల ఆస్తులను జప్తు చేసే అధికారం కోర్టుకు ఉందని వాదించారు. ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది.

రూ.114 కోట్లు దుర్వినియోగం

ఫైబర్ నెట్ కేసులో రూ.114 కోట్లు దుర్వినియోగం జరిగాయని సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా వేమూరి హరికృష్ణ ఉండగా, ఏ11గా తుమ్మల గోపిచంద్, ఏ25గా చంద్రబాబు పేర్లను సీఐడీ నమోదు చేసింది. టెరాసాఫ్ట్ సంస్థకు చెందిన ఆస్తులతో పాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఆస్తులు జప్తు చేయాల్సి ఉందని సీఐడీ కోర్టుకు తెలిపింది.

మద్యం కేసు విచారణ వాయిదా

మద్యం కంపెనీలకు అనుమతులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారించింది. మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదని వాదనలు వినిపించారు. ఇప్పుడు కుంభకోణమని కేసులు పెట్టారన్నారు. రాజకీయ ఉద్దేశంతోనే కేసు నమోదు చేశారని చంద్రబాబు తరఫున న్యాయవాది నాగముత్తు కోర్టుకు తెలిపారు. ప్రివిలేజ్ ఫీజు నిర్ణయం కూడా నిబంధనల మేరకు తీసుకున్నారన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. రేపు సీడీఐ తరఫున న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.

IPL_Entry_Point